2023 దసరా డే 5- స్కందమాతగా శ్రీశైల భ్రమరాంబిక



శ్రీశైలంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి



తొమ్మిది రోజుల పాటూ నవదుర్గల అలంకారంలో దర్శనమిస్తోంది శ్రీశైల భ్రమరాంబిక



ఉత్సవాల్లో ఐదో రోజు స్కందమాతగా శ్రీశైల భ్రమరాంబిక



ఒడిలో బాలస్కందుడిని చేతపట్టుకుని కుడిచేత పద్మం ధరించి ఉంటుంది



ఎడమవైపు ఒకచేత్తో అభయముద్ర, మరో చేత్తో కమలం ధరించి సింహవాహనంపై కూర్చుని ఉంటుంది అమ్మవారు



శివగణాలకు స్కందుకు సైన్యాధిపతి. పైగా జ్ఞానానికి కూడా అధిపతి. ఇక అమ్మవారేమో తన చల్లని చూపుతో సకల ఐశ్వర్యాలనూ అనుగ్రహించే తల్లి



స్కందమాతను ఉపాసించడం వల్ల భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయని , సుఖ శాంతులు ఉంటాయని పండితులు చెబుతారు



స్కందమాత శ్లోకం
సింహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయా
శుభదాస్తు సదాదేవీ స్కందమాతా యశస్వినీ॥



Images Credit: Pinterest