దసరా 2023: శరన్నవరాత్రుల్లో కౌమారీ పూజ ఎన్నేళ్ల పిల్లలకి చేయాలి!



నవరాత్రులలో ముగ్గురమ్మల మూలపుటమ్మకు తోడుగా ఆమెతో పాటు తొమ్మిది శక్తులు ఉంటాయని దేవీ పురాణం చెబుతోంది. ఆ తొమ్మిది శక్తులో రెండవది కౌమారీ.



బాలాత్రిపుర సుందరి అలంకారం చేసి చిన్నారులకు కౌమారీ పూజ చేస్తారు.



రెండేళ్ల బాలికను కుమారి అంటారు..కుమారిని పూజించడం వల్ల దారిద్ర్యదుఃఖాలు నశిస్తాయి



మూడేళ్ల బాలికను త్రిమూర్తి అని అంటారు. ఈ త్రిమూర్తిని పూజించడం వల్ల ధనధాన్య, పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతుంది



నాలుగేళ్ల బాలికను కల్యాణి అని అంటారు. కల్యాణిని పూజించడం వల్ల రాజ్యాభివృద్ధి, విద్యాభివృద్ధి చేకూరుతుంది



ఐదేళ్ల బాలికను రోహిణి అని అంటారు. రోహిణిని పూజించడం వల్ల ఆరోగ్యం చేకూరుతుంది



ఆరేళ్ల బాలికను కాళిక అని అంటారు, కాళికను పూజించడం వల్ల శత్రునాశనం జరుగుతుందని చెబుతారు



ఏడేళ్ల బాలికను చండిక అంటారు. ఈ అమ్మను పూజిస్తే పేదరికం తొలగి ఐశ్వర్యం కలుగుతుంది



ఎనిమిది సంవత్సరాల బాలికను శాంభవి అంటారు. ఈ వయసు బాలికను పూజిస్తే ప్రతి పనిలో ఆటంకాలు తొలగి, అనుకూలత ఏర్పడుతుంది



తొమ్మిదేళ్ల పాపను దుర్గ అని అంటారు. ఈ అమ్మను పూజించడం వల్ల అన్ని రకాల సుఖ సంతోషాలు చేకూరుతాయి Image Credit: Pinterest