బ‌తుక‌మ్మ పండుగ‌లో నాలుగో రోజు నైవేద్యం ఇదే!



బతుకమ్మ సంబరాల్లో నాలుగో రోజైన ఆశ్వయుజ శుద్ధ తదియనాడు అమ్మ‌వారిని ‘నానబియ్యం బతుకమ్మ’గా కొలుస్తారు.



గునుగు, తంగేడు పూలతో నాలుగు వరుసల్లో బతుకమ్మను పేరుస్తారు. శిఖరం మీద గౌరమ్మను నిలిపి పూజిస్తారు.



నానబోసిన బియ్యాన్నీ, బెల్లాన్నీ, పాలనూ కలిపి చేసిన వంటకాలను నైవేద్యంగా పెడతారు.



నాలుగో రోజు: నానబియ్యం బతుకమ్మ
నైవేద్యం: బెల్లం అన్నం లేదా పరమాన్నం



ఒక కప్పు బియ్యాన్ని మూడు కప్పుల పాలలో ఉడికించాలి. పాలలో బియ్యం ఉడకవు అనుకుంటే రెండు ఒకటిన్నర కప్పు పాలు, ఒక కప్పు నీళ్లు పోయచ్చు.



మరో పక్క కడాయిలో బెల్లాన్ని కరిగించుకోవాలి. అలాగే నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకోవాలి.



అన్నం ఉడికాక చివర్లో కరిగించిన బెల్లం పాకాన్ని వేసి కలపాలి. స్టవ్ ఆపేయాలి.



బెల్లంగా బాగా కలిశాక పైన ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్స్ వేయాలి. అంతే బెల్లం అన్నం సిద్ధం.



ఆశ్వయుజ శుద్ధ పాడ్యమికి ముందురోజు వచ్చే అమావాస్య రోజున ఎంగిలి పూల బతుకమ్మ పేరుతో ప్రారంభమై దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది ఈ పండుగ


Thanks for Reading. UP NEXT

వాస్తు టిప్స్: చిన్న చిన్న మార్పులు మీ ఆర్థిక స్థితిని డిసైడ్ చేస్తాయి

View next story