వాస్తు టిప్స్: చిన్న చిన్న మార్పులు మీ ఆర్థిక స్థితిని డిసైడ్ చేస్తాయి



వాస్తు ప్రకారం రాత్రిపూట ఉపయోగించిన పాత్రలను సింక్‌లో ఉంచకుండా శుభ్రం చేయాలి



వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ఈశాన్య దిశలో చెత్తబుట్టను ఉంచ‌కూడదు. ఇది ఒక వ్యక్తి మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది.



డస్ట్‌బిన్‌ను ఆగ్నేయ దిశలో ఉంచవద్దు, ఇది డబ్బు ఆదా చేయడంలో అడ్డంకులను కలిగిస్తుంది. అందుకే ఇంటి నైరుతి దిక్కు చెత్తబుట్టను ఉంచేందుకు అనుకూలమని చెబుతారు.



చాలా మందికి మంచం మీద భోజనం చేసే అలవాటు ఉంటుంది. మంచంపై భోజనం చేసి అన్నపూర్ణాదేవిని అవమానిస్తే.. త‌ద్వారా ఆ ఇంట్లో వాస్తు దోషాలు తలెత్తడానికి ఎక్కువ సమయం పట్టదు.



బాత్రూంలో ఖాళీ బకెట్లు ఉంచవద్దు. వాస్తు ప్రకారం, బాత్రూంలో ఖాళీ బకెట్ ఉంచడం శ్రేయస్కరం కాదు. ఇది ఇంట్లో ఆర్థిక సంక్షోభాన్ని ప్రోత్సహిస్తుంది, ఆ ఇంటిలో వ్యక్తి అప్పుల చక్రంలో కూరుకుపోతాడు.



ఇంటి లేదా కార్యాలయంలోని గోడ ముదురు రంగులో ఉండకూడదు.వాస్తు ప్రకారం ఇది మీ ఇల్లు లేదా పని ప్ర‌దేశం వైపు ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది. ఇది మిమ్మల్ని తీవ్రమైన దీర్ఘకాలిక అనారోగ్యానికి గురి చేస్తుంది.



వాస్తు శాస్త్రం ప్రకారం, డబ్బు ఉంచే బీరువా, ఐరన్ సేఫ్‌ ఎల్లప్పుడూ ఉత్తరం వైపు ఉండాలి. దీని కారణంగా, మీ ఇంట్లో రుణం తీసుకునే సమస్య ఎప్పటికీ తలెత్తదు. ఫ‌లితంగా మీ ఇంట్లో ఆనందం, శాంతి ఉంటుంది.



వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు కట్టేటప్పుడు నైరుతి దిశలో బాత్‌రూమ్‌ను నిర్మించకూడదు. ఎందుకంటే ఈ దిశలో బాత్రూమ్ ఉంటే అప్పుల భారం పెరుగుతుంది. Images Credit: Pinterest