అక్టోబరు 14 సూర్యగ్రహణం భారత్ లో కనిపించకపోయినా నియమాలు పాటించాలా!



శ్రీ శోభకృత్ నామసంవత్సర భాద్రపద బహుళ అమావాస్య అక్టోబరు 14 శనివారం కేతుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం ఏర్పడుతోంది.



ఇది ఉత్తర అమెరికా, కెనడా, మెక్సికో, అర్జెంటీనా, కొలంబియా, పెరూ, క్యూబా, జమైకా, హైతీ, బ్రెజిల్, బహామాస్, ఆంటిగ్వా, ఉరుగ్వే, ఉత్తర అమెరికా, బార్బడోస్ ప్రదేశాలలో కనిపిస్తుంది.



భారతదేశంలో ఎక్కడా సూర్యగ్రహణం కనిపించదు కాబట్టి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుభకార్యాలపై ఎలాంటి ప్రభావం ఉండదని జ్యోతిష్యశాస్త్రవేత్తలు చెబుతున్నారు.



అయితే గ్రహణం ఏర్పడటానికి ముందు నుంచి గ్రహణం ముగిసే వరకు ఉన్న సమయాన్ని అశుభమైనదిగా పరిగణిస్తారు



ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు. శుభకార్యాలు జరిపిస్తే అశుభ ఫలితాలు వస్తాయని విశ్వసిస్తారు.



మనదేశంలో కనిపించదు కాబట్టి నియమాలు మాత్రం పాటించాల్సిన అవసరం లేదు. అయితే గ్రహణ సమయం ముగిసిన తర్వాత శుద్ధి చేసుకోవడం వల్ల ఆరోగ్యమే కానీ ఎలాంటి నష్టం లేదంటున్నారు.



భారత కాలమానం ప్రకారం ఈ గ్రహణం రాత్రి 08:34 గంటలకు ప్రారంభమై తెల్లవారుజామున 02:25 వరకు ఉంటుంది.



Images Credit: Freepik