ABP Desam


దసరా 2023: శరన్నవరాత్రుల్లో ఈ నియమాలు పాటించాలి


ABP Desam


నవరాత్రుల తొమ్మిది రోజుల్లో దుర్గమ్మ తొమ్మిదిరూపాలను పూజిస్తారు. ఈ తొమ్మిది రోజులూ కొన్ని నియమాలు పాటించాలి అవేంటంటే...


ABP Desam


ఆధ్యాత్మిక కార్యక్రమం ఏం చేస్తున్నా..పూజ, మంత్ర పఠనం, చాలీశా, స్తుతి..ఏదైనా కానీ మధ్యలో అస్సలు లేవకూడదు.


ABP Desam


దుర్గా శ్లోకాలు చదువుతున్న సమయంలో ఎవ్వరితోనూ మాట్లాడకూడదు, వేరే పని నిమిత్తం లేవకూడదు. దీనివల్ల మీ చుట్టూ ప్రతికూల శక్తి పెరుగుతుందంటారు.


ABP Desam


సాధారణంగా పూజ, వ్రతం, నోము, పండుగ అనేకాదు..పరిశుభ్రత పాటించడం అందరికీ చాలా అవసరం. అయితే శరన్నవరాత్రుల్లో ఇది మరికొంచెం ఎక్కువగా ఉండాలి..


ABP Desam


స్నానం ఆచరించిన తర్వాతే దేవుడి మందిరంలో అడుగుపెట్టాలి. స్నానం అనంతరం దేవుడి పాత్రలు శుభ్రం చేసుకుని శుచిగా నైవేద్యం వండిపెట్టి పూజచేయాలి.


ABP Desam


పూజ సమయంలో ధరించే దుస్తులు ప్రత్యేకంగా పెట్టుకోవాలి... లెదర్ వస్తువులు ధరించి పూజకు కూర్చుంటే అనుకూల ఫలితాలు కన్నా ప్రతికూల ఫలితాలే ఎక్కువ


ABP Desam


విష్ణు పురాణం ప్రకారం శరన్నవరాత్రులు చేస్తున్నవారు పగటిపూట నిద్రించడం నిషిద్ధం. ఉపవాసం ఉండేవారైతే ఈ తొమ్మిది రోజు పగటివేళ అమ్మవారి కీర్తలతో సమయం గడపాలి.


ABP Desam


మత విశ్వాసాల ప్రకారం నవరాత్రులలో ఉల్లిపాయ, వెల్లుల్లి , మాంసాహారం ఇంట్లో వండకూడదు. బయటి నుంచి తెచ్చుకుని కూడా తినకపోవడమే మంచిది


ABP Desam


నియమ నిష్టలతో తొమ్మిదిరోజుల పాటూ అమ్మవారికి పూజలు చేస్తున్న ఇంట్లో సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవడం మంచిది


ABP Desam


నవరాత్రి తొమ్మిది రోజులు గడ్డం, మీసాలు, జుట్టు, గోర్లు కత్తిరించకూడదు. Images Credit: Pinterest