చాణక్య నీతి: జీవిత భాగస్వామికి ఎప్పటికీ చెప్పకూడని 4 విషయాలివే!



అప్పట్లో చాణక్యుడు చెప్పిన మాటలు ఇప్పటికీ ఆచరణీయంగానే ఉంటాయి



ఓ వ్యక్తి ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలి, ఎవరిపట్ల ఎలా ఉండాలో కొన్ని సూచనలు చేశాడు



ఈ కోవలోనే జీవిత భాగస్వామికి చెప్పకూడని కొన్ని విషయాల గురించి శిష్యులకు బోధించాడు



భర్త సంపాదన ఎంతో పూర్తిగా భార్యకి చెప్పకూడదంటాడు చాణక్యుడు. భర్త సంపాదన భార్యకు తెలిస్తే ఇంట్లో దూబరా ఖర్చు పెరిగిపోతుందట.



ప్రతి మనిషికీ ఓ బలహీనత ఉంటుంది. ఆ బలహీనత ఏంటో జీవిత భాగస్వామికి తెలియకూడదు.



ఒక్కసారి బలహీనత తెలిసిందంటే ఏ చిన్న గొడవ వచ్చినా, సందర్భం వచ్చినా రాకపోయినా భర్త బలహీనతను పదే పదే ప్రస్తావించే ప్రమాదం ఉంది



ఎక్కడైనా అవమానం ఎదుర్కొంటే..పొరపాటున కూడా ఈ విషయం జీవిత భాగస్వామికి చెప్పకూడదు. అలా చెబితే మీరు చులకనైపోయే ప్రమాదం ఉంది



ఇంకా చెప్పాలంటే బయట పొందిన అవమానం కన్నా పదిరెట్లు ఎక్కువ అవమానం అప్పుడు ఇంట్లోనే ఎదుర్కోవాల్సి వస్తుంది



ఎవరికైనా సహాయం చేయాలి అనుకుంటే అది నిశ్సబ్ధంగా చేయండి. ఆ విషయం జీవిత భాగస్వామికి చెప్పడం ద్వారా అడ్డుకునే అవకాశం ఉంది.



Images Credit: Pinterest