గరుడ పురాణం: ఆత్మ ప్రయాణించే మార్గం ఇలా ఉంటుంది



గరుడ పురాణం ప్రకారం, మరణ సమయంలో తన బాధను కుటుంబ సభ్యులతో పంచుకోవాలనుకుంటాడు. కానీ అది సాధ్యం కాదు. ఆత్మ ఆ వ్యక్తి దేహాన్ని విడిచిపెట్టగానే ఇద్దరు యమదూతలు వచ్చి ఆత్మను యమలోకానికి తీసుకెళ్తారు.



ఆత్మను యమలోకానికి తీసుకెళ్లే ముందు భయపెడ‌తాడు. నరకంలో విధించే అన్ని శిక్ష‌ల‌ గురించి వివ‌రిస్తాడు. యమదూత చెప్పే మాటలు విని, ఆత్మ ఏడుస్తుంది.



యమలోకానికి వెళ్లే దారిలో రాళ్లు, ముళ్లు, అగ్ని ఇంకా చాలా కష్టమైన మార్గాలు ఉంటాయి. ఈ మార్గంలో ఆత్మ వేడి గాలిని త‌ట్టుకోలేక‌, వేడి ఇసుక మీద నడవలేక ఇబ్బంది ప‌డుతుంది.



ఆకలి, దాహంతో బాధపడుతుంది. ఫ‌లితంగా ఆత్మ ప్రయాణం నెమ్మదిస్తుంది. ఇది చూసిన యమదూతలు ఆగ్రహించి ఆత్మపై కొరడా ఝులిపిస్తారని గరుడ పురాణంలో పేర్కొన్నారు.



భూమికి యమలోకం లక్షా 32 వేల‌ కిలోమీటర్ల దూరంలో ఉందని గరుడ పురాణం చెబుతోంది. ఇంత దూరం ప్రయాణం చేసిన త‌ర్వాత‌ యమదూతలు ఆత్మను యముడు శిక్షించే ప్రదేశానికి తీసుకువెళతారు.



ఆ ఆత్మ యమరాజు ఆజ్ఞ మేరకు దూతలతో అతని నివాసంలోకి ప్రవేశిస్తుంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో యమదూతలు ఆత్మతో పాటు ఉంటారు.



యమదూతలతో ఇంటికి తిరిగి వచ్చిన ఆత్మ తిరిగి తన శరీరంలో చేరాలని కోరుకుంటుంది. కానీ యమదూతలు దానిని తిరిగి శరీరంలో చేరనివ్వరు. ఆకలి - దాహం వల్ల ఏడుపు మొదలవుతుంది.



ఇలాంటి ఆత్మలు పిండ ప్ర‌ధానం జ‌ర‌గ‌నంత వరకు తృప్తి చెందవు. ఈ సమయంలో కుటుంబ సభ్యులు పిండ ప్ర‌దానం చేయకపోతే ఆత్మ ప్రేతాత్మగా మారుతుంది.



అందుకే మరణించిన 10 రోజుల తర్వాత పిండ ప్ర‌దానం చేస్తారు. పిండ ప్ర‌దానము వలన మాత్రమే ఆత్మ కదిలే శక్తిని పొందుతుంది.



Image Credit: Pinterest