బతుకమ్మలో పేర్చే తంగేడు పూలవల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో!



తంగేడు చెట్టులో ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. తంగేడు పూలు, ఆకులు, బెరడు, వేర్లు ఇలా ఈ మొక్క అన్ని భాగాలు అద్భుతమైన ఔషధ గుణాలు కలిగి ఉంటాయి.



ఈ చెట్టు ఆకులు, పువ్వులు, బెరడు వేర్లతో తయారు చేసుకునే కషాయాలు అనేక అనారోగ్య సమస్యలను తగ్గించి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.



తంగేడు పూల కషాయం మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.



తంగేడు పువ్వుల పొడిని ముల్తానీ మట్టితో కలుపుకుని ముఖానికి రాసుకుంటే చర్మం నిగారింపు పెరుగుతుంది.



తంగేడు ఆకులను మజ్జిగతో కలిపి బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పాదాల పగుళ్లు ఉన్నచోట అప్లై చేస్తే పాదాల పగుళ్ల నొప్పి తగ్గుతుంది. పాదాల పగుళ్లు కూడా రావు.



తంగేడు పూలను పేస్ట్ చేసి ఎండబెట్టి కొబ్బరి నూనెలో వేసి మరిగించాలి. ఆ నూనెను తలకు పట్టించడం ద్వారా చుండ్రు సమస్య మాయమవుతుంది.



తంగేడు ఆకుల పొడిని గ్లాసు గోరువెచ్చట నీటితో కలిపి ఉదయాన్నే తీసుకుంటే పేగులలో పేరుకుపోయిన మలం తేలికపడి మలవిసర్జన సాఫీగా జరుగుతుంది.



కొందరిలో మూత్రం అధికంగా పోతుంటుంది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి తంగేడు పూల పొడిని బెల్లంతో కలసి తీసుకుంటే ఈ సమస్య పరిష్కారం అవుతుంది.



ఈ చెట్టు వేర్లతో చేసుకునే కషాయం నీళ్ల విరోచనాలను తగ్గించడానికి చక్కగా పనిచేస్తుంది.



Image Credit: Pixabay