చాణక్య నీతి: యూత్ దూరంగా ఉండాల్సిన 3 విషయాలివే!



యుక్తవయస్సులో సరైన మార్గనిర్ధేశకత్వం ఉండాలి, మంచి మాటలు పరిగణలోకి తీసుకోవాలి



కాదు కూడదు అంటే భవిష్యత్తులో పశ్చాత్తాపపడినా ఎలాంటి ప్రయోనం ఉండదని చెప్పాడు చాణక్యుడు



ముఖ్యంగా 3 విషయాలకు దూరంగా ఉండాలని శిష్యులకు బోధించాడు ఆచార్య చాణక్యుడు



బుట్టలోని కుళ్ళిన యాపిల్ మిగిలిన పండ్లను పాడుచేసినట్లే..చెడ్డవారి సాంగత్యం మీపై చెడు ప్రభావాన్ని చూపుతుంది



చెడు పనులు చేయడం ఎంత తప్పో చెడుపనులు చేసేవారితో కలసి తిరగడం కూడా అంతే తప్పు



చెడు సావాసాలు చేస్తే..వారు సమాజంలో మీ ప్రతిష్టను పాడు చేయడమే కాకుండా మీ లక్ష్యం నుంచి మిమ్మల్ని దూరం చేస్తారు



మంచి అలవాట్లు మనిషి జీవితాన్ని మెరుగుపరుస్తాయి..యువతలో కోపం దురాశ వంటి భావాలు పెరగడం ప్రారంభమైతే అది మీ ఆలోచనా శక్తిని ప్రభావితం చేస్తుంది.



కోపం-దురాశ మీ కెరీర్ కి ముఖ్యమైన అడ్డంకి



సోమరితనం మనిషికి అతి పెద్ద శత్రువు. యవ్వనంలో కష్టపడి పనిచేసే వ్యక్తి కెరీర్లో శిఖరాగ్రానికి చేరుకుంటాడని చాణక్య నీతి చెబుతోంది.



యవ్వనంలో సోమరితనం ఉన్న వ్యక్తికి కాలం మద్దతు ఇవ్వకపోతే భవిష్యత్తు అంధకారమే
Images Credit: Pinterest


Thanks for Reading. UP NEXT

బతుకమ్మ 9 రోజులు - 9 నైవేద్యాలు!

View next story