సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 14 వరకూ ఈ వస్తువులు కొనకూడదు
పితృ పక్షం సమయంలో కొత్త కారు, కొత్త ఇల్లు, కొత్త దుస్తులు సహా కొన్ని వస్తువులు కొనుగోలు చేయరాదని చెబుతారు
సెప్టెంబరు 30న మొదలైన పితృపక్షాలు అక్టోబరు 14 అమావాస్య తో ముగుస్తాయి
ముఖ్యంగా మహాళయపక్షంలో ఈ 3 వస్తువులు కొనుగోలు చేస్తే త్రిదోషం ఏర్పడుతుందని చెబుతారు
ఆవనూనె శనిదేవునికి ప్రతిరూపంగా పరిగణిస్తారు. ఈ సమయంలో ఆవనూనె కొనుగోలు చేస్తే కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే పితృ పక్షం సమయంలో ఆవనూనె కొనడం నిషేధించారు.
ఇల్లు, లేదా నివాస స్థలాన్ని శుభ్రపరిచే చీపురులో లక్ష్మీదేవి నివసిస్తుందని మత విశ్వాసం. పితృ పక్షంలో చీపురు కొనడం వల్ల ఆర్థిక నష్టం లేదా ధన సమస్యలు వస్తాయని నమ్ముతారు.
పితృదేవతల పేరు మీద దానం చేయడానికి ఉప్పు కొనుగోలు చేయవచ్చు. మీ ఇంట్లో ఉపయోగం కోసం లేదా కుటుంబ అవసరాల కోసం దీనిని పితృపక్షంలో కొనుగోలు చేయవద్దు.
త్రిదోషం కారణంగా వ్యక్తి అకాల మరణం, అనారోగ్యం పాలవుతాడు.
సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 14 మధ్య మాత్రమే వీటిని కొనుగోలు చేయకూడదు. ఈ తేదీలకు ముందు - ఆ తర్వాత కొనుగోలు చేయొచ్చు