చాణక్య నీతి: ఇలాంటివాళ్లు దానం చేయకపోవడమే మంచిది



చాణక్యుడు దాతృత్వాన్ని మానవుడు చేయగలిగే ఉత్తమమైన పనులలో ఒకటిగా అభివర్ణించాడు. అయితే మన శక్తికి మించి విరాళాలు ఇవ్వడం సరికాదన్నాడు.



దానం చేసేంత ఉందో లేదో తెలుసుకోకుండా దానం చేస్తే ఆ వ్యక్తి జీవితంలో ఏదో ఒకరోజు పెద్ద సమస్యలో కూరుకుపోతాడని హెచ్చ‌రించాడు.



సరిగ్గా ఆలోచించకుండా ఎవరికీ ఏమీ దానం చేయవద్దు. ఈ తప్పు చేసిన వ్యక్తి త‌ద‌నంత‌ర కాలంలో అప్పుల పాలవుతాడు. రోజువారీ ఖర్చుల కోసం ఇతరుల నుంచి అప్పు తీసుకోవల‌సి రావ‌చ్చు.



ఈ కారణంగా ఒక వ్యక్తి దానధర్మాలు చేసేటప్పుడు తన సంపదపై శ్రద్ధ వహించాలి. తన సంపద మేర‌కు దానం చేయాలని చాణ‌క్యుడు చెప్పాడు.



ఆచార్య చాణక్యుడు నిజానికి డబ్బు ఎల్లప్పుడూ అవసరమైన సమయంలో మాత్రమే ఖర్చు చేయాలని చెప్పాడు.



డబ్బును విచక్షణారహితంగా ఖర్చు చేయకూడదు. దీని వల్ల ఏదో ఒక రోజు మనం ఇబ్బందుల్లో పడటం ఖాయమ‌ని చాణక్యుడు హెచ్చ‌రించాడు.



దాన ధర్మం తప్పు అని చాణక్యుడు చెప్పలేదు. కానీ, దానం ఇచ్చే సమయంలో మన సామర్థ్యాన్ని బట్టి మాత్రమే ఇవ్వాలని చెప్పాడు.



లేదంటే భవిష్యత్తులో సమస్యలు తప్పవని హెచ్చ‌రించాడు.



Images Credit: Pinterest