పితృపక్షంలో ఏ రోజు ఏం చేయాలి! (సెప్టెంబర్ 30 నుంచి అక్టోబరు 14వరకు) పాడ్యమి తిధి రోజు శ్రార్ధం పెడితే లక్ష్మి కటాక్షం కలుగుతుంది, విదియలో శ్రార్ధము పెడితే సంతాన ప్రాప్తి సిద్ధిస్తుంది తదియ రోజు శ్రార్థం పెడితే ఇంట్లో అవివాహితులపై పితృదేవతల ఆశీర్వచనాలుంటాయి..మంచి సంబంధం కుదురుతుంది చవితి రోజు శ్రార్ధము పెడితే శత్రువులు మిత్రులవుతారు, పంచమి రోజు శ్రార్ధ కర్మలు నిర్వహిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయి షష్టి రోజు శ్రార్ధం పెడితే గౌరవం అందుకుంటారు, సప్తమి రోజు పరలోకంలో ఓక దేవగోష్టికి నాయకునిగా చేయును అష్టమి రోజు మంచి మేధస్సును చేకూర్చుతుంది నవమి రోజు శ్రార్ధ కర్మలు నిర్వహిస్తే మంచి జీవిత భాగస్వామి లభిస్తుంది..మరు జన్మలో కూడా, దశమి తిధి రోజు కోరికలను నేరవేరుతాయి ఏకాదశి రోజున సకల వేద విద్యా పారంగతులవుతారు, ద్వాదశి రోజున స్వర్ణ ఆభరణములను సమకూర్చును త్రయోదశి రోజు శ్రార్థం పెడితే సత్సంతానం, మేధస్సును, పశు, పుష్టి, సమృద్ధి, దీర్ఘాయుష్షు సకల సౌభాగ్యం సమకూరుతాయి ప్రమాదాల్లో చనిపోయిన వారికి చతుర్దశి తిది రోజు శ్రార్ధం చేయాలి అమావాస్య రోజున సకల కోర్కెలు నెరవేరుతాయి పాడ్యమి తర్పణం ముందుగా నిర్వర్తించి వానిలోగల లోపములను నివృత్తిచేసీ పరి పూర్ణతను చేకూర్చుతుంది