వాస్తులో దిక్కులకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. దిక్కులను అనుసరించి సామాన్లు అమర్చుకోవడం అవసరం.

ప్రతి ఇంట్లో చెత్తబుట్ట ఉంటుంది. అదెక్కడ పెట్టుకుంటున్నారనేది చాలా ముఖ్యం.

చెత్త బుట్ట ఎప్పుడూ ఇంట్లో ఈశాన్యం వైపు పెట్టకూడదు.

ఇంట్లోని ఈశాన్యం దేవతల నెలవు. ఇక్కడ చెత్త బుట్ట పెడితే ఇంట్లోని వారి మీద నెగెటివ్ ప్రభావం ఉంటుంది.

ఈశాన్యంలో చెత్త బుట్ట ఉంచితే మానసిక సమస్యలు వస్తాయి.

తూర్పు, ఆగ్నేయం, ఉత్తర దిక్కుల్లో కూడా చెత్తబుట్ట పెట్టకూడదు.

ఇది ఇంట్లో దరిద్రానికి కారణం అవుతుంది.

వాస్తు ప్రకారం చెత్త బుట్ట ఎప్పుడూ నైరుతి లేదా వాయవ్యంలో ఉండాలి.

ఇంట్లోకి సుఖశాంతులు రావాలంటే తప్పకుండా వాస్తు నియమాలు పాటించాలి.

Representational Image : Pexels