మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ రోజు నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి నైవేద్యం
రెండో రోజు అటుకుల బతుకమ్మ రోజు సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం
మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ..ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం
నాలుగో రోజు నానే బియ్యం బతుకమ్మ రోజు నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం చేస్తారు
ఐదో రోజు అట్ల బతుకమ్మ రోజు అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు
ఆరో రోజు ఈ రోజు అలిగిన బతుకమ్మ..అందుకే ఎలాంటి నైవేద్యం సమర్పించరు
ఏడో రోజు వేపకాయల బతుకమ్మ రోజు బియ్యంపిండిని బాగా వేయించి వేపపండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.
ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ రోజు నువ్వులు, వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యం తయారు చేస్తారు
తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ రోజు ఐదురకాల నైవేద్యాలు తయారు చేస్తారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, లెమన్ రైస్, కొబ్బరన్నం, నువ్వులన్నం Images Credit: Pinterest