వాస్తు దోషం లేదా మరే ఇతర దోషాల వల్ల మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందని మీరు భావిస్తే ఈ టిప్స్ పాటించడం ద్వారా పాజిటివ్ శక్తి నిండుతుందని చెబుతారు వాస్తు పండితులు
ఇంట్లో ఎప్పుడూ ఘర్షణ వాతావరణం ఉంటే గుగ్గిలం ధూపం వేయండి. ఆ పొగ ఇల్లు అంతటా వ్యాపించే ప్రదేశంలో ఉంచండి.
ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఎప్పుడూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తుంది. దీనిని పోగొట్టేందుకు నీళ్లలో లవంగాలు, గులాబీ రేకులను వేసి మనసులో ఇష్ట దైవాన్ని ప్రార్థించండి.
పసుపు, కుంకుమ, ఆవు నెయ్యి కలిపి ఇంటి ప్రధాన ద్వారంపై ఐదుసార్లు తిలకంలా రాయండి. రోజూ ఉదయాన్నే రాగి పాత్రలో నీటిని నింపి, మొదటిసారి మెయిన్ డోర్ తెరిచిన వెంటనే ఆ నీటిని చిలకరిస్తే ఇంట్లోని వాస్తు దోషం తొలగిపోతుంది.
పసుపు దుస్తులు ధరించి కుటుంబ సభ్యులందరి నుంచి ఉదయం నెయ్యితో పాటు బియ్యం సేకరించి ఏదైనా ఆధ్యాత్మిక ప్రదేశంలో ఇవ్వండి. ప్రతి గురువారం ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి
శనివారం రోజు వికలాంగులకు లేదా నిస్సహాయులకు సహాయం చేయడం ద్వారా మీ ఇంట్లో పరిస్థితులు క్రమంగా సానుకూలంగా మారతాయి.
ఇంట్లో వాస్తు దోషం, ప్రతికూలతను తొలగించడానికి రోజూ రామచరిత మానస్ లేదా సుందర కాండ జపించండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ తొలగిపోతుంది.
సానుకూల చిహ్నాలు లేదా వాస్తు మొక్కలతో ఇంటిని అలంకరించండి. పసుపు, గులాబీ, లేత నీలం రంగులు ఉపయోగించండి. Image Credits: Pinterest