చాణక్య నీతి: వీరిపట్ల మీరు నిస్వార్థంగా వ్యవహరించాలి!
సంపద పొందాలంటే, కష్టపడి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడం చాలా ముఖ్యం.
మీరు లక్ష్మి దేవి అనుగ్రహాన్ని పొందాలంటే మీ జీవితాంతం ఈ ఐదుగురు మహిళలను గౌరవించాలని, వీరిపట్ల నిస్వార్థంగా వ్యవహరించాలని చెబుతాడు చాణక్యుడు
తల్లి తల్లిని గౌరవించే ఆమె ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించే వారికి లక్ష్మీదేవి ఎల్లప్పుడూ తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తుందని ఆచార్య చాణక్యుడు చెప్పాడు.
గురు పత్ని గురువును జ్ఞానదాత అని అంటారు. వారిని గౌరవించడం ప్రతి ఒక్కరి కర్తవ్యం. గురువునే కాదు, జ్ఞానాన్ని అందించిన గురువు భార్యను కూడా తల్లిగా గౌరవించాలి.
అత్తగారు కుమార్తెను ఇచ్చిన అత్తగారు కళ్లను ప్రసాదించిన దేవత అని సామెత. మనం ఆమెను గౌరవించడమే కాకుండా వారి క్లిష్ట పరిస్థితుల్లో సహాయం అందించి, తోడుగా నిలబడాలి.
స్నేహితుడి భార్య స్నేహితుని భార్యతో గౌరవంగా ప్రవర్తించాలి, ఆమె పట్ల గౌరవం వ్యక్తం చేయాలి. ఇది మీ స్నేహ సంబంధంలో నమ్మకాన్ని, ప్రేమను పెంచుతుంది.
రాజు భార్య రాజు భార్య కూడా తల్లి లాంటిదని, ఎందుకంటే తన ప్రజలను పిల్లల్లా చూసుకుంటాడు. కాబట్టి రాజు భార్యను కూడా గౌరవించడం ముఖ్యం. ఈ కాలంలో రాజు భార్య అంటే పాలకుడి భార్య అనుకోవచ్చు.
లక్ష్మీదేవి అనుగ్రహం కోరుకునే వారు, సంపద కోరుకునే వారు ఈ ఐదుగురిని గౌరవించాలని ఆచార్య చాణక్యుడు చెప్పాడు.