దసరా 2023: నవదుర్గలు అంటే ఎవరు



శైలపుత్రి దుర్గ
సతీదేవి యోగాగ్నిలో తనువును విడిచిపెట్టి ఆ తర్వాత పర్వతరాజైన హిమవంతుని ఇంట్లో శైలపుత్రిగా అవతరించింది.



బ్రహ్మచారిణి దుర్గ
కుడి చేతిలో జపమాల, ఎడమచేతిలో కమండలం ధరించి పరమేశ్వరుడిని పతిగా పొందేందుకు ఘోరతపస్సు చేసి ఉమగా పూజలందుకుంటోంది.



చంద్రఘంట దుర్గ
చంద్రఘంట అమ్మవారు తలపై అర్ధచంద్రుడు ఘంటాకృతిలో ఉండడంతో 'చంద్రఘంట' అని పిలుస్తారు.



కూష్మాండ దుర్గ
దరహాసంతో బ్రహ్మాండాన్ని సృజించేది కావడంతో 'కూష్మాండ' అను పేరు వచ్చింది.



స్కందమాత దుర్గ
కుమార స్వామి, కార్తికేయుడు, శక్తిధరుడు అని ప్రసిద్ధుడైన స్కందుని తల్లి దుర్గాదేవిని 'స్కందమాత'పేరుతో నవరాత్రులలో ఐదో రోజు ఆరాధిస్తారు.



కాత్యాయని దుర్గ
కాత్యాయనీ మాత బాధ్రపదబహుళ చతుర్దశి రోజు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తేజస్సుతో కాత్యాయని మహర్షి ఇంట పుత్రికగా అవతరించింది.



కాళరాత్రి దుర్గ
కాళరాత్రి శరీరవర్ణము గాఢాంధకారంలా నల్లగా ఉంటుంది. తలపై కేశాలు చెల్లాచెదురుగా ఉంటాయి. ఈమె త్రినేత్రాలు బ్రహ్మాండంలా గుండ్రంగా ఉంటాయి.



మహాగౌరి దుర్గ
అష్టవర్షా భవేద్గౌరీ - మహాగౌరి అష్టవర్ష ప్రాయము గలది. మహాగౌరి ధరించే వస్త్రాలు, ఆభరణాలు తెల్లని కాంతులు వెదజల్లుతాయి.



సిద్ధిధాత్రి దుర్గ
సర్వవిధ సిద్ధులను ప్రసాదించే తల్లిని సిద్ధి ధాత్రి అంటారు. పరమేశ్వరుడు సర్వ సిద్ధులను దేవీ కృపవల్లే పొందాడని దేవీపురాణం చెబుతుంది.



Image Credit: Pinterest