చాణక్య నీతి: ఇంటి పెద్ద ముఖ్యంగా పాటించాల్సిన 3 విషయాలు
ముఖ్యంగా కుటుంబ పెద్ద 3 ముఖ్యమైన సూత్రాలు అనుసరించడం ద్వారా ఆ ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది
1.కుటుంబానికి సమయం కేటాయించండి కుటుంబాన్ని ఏకతాటిపైకి తీసుకెళ్లడం ఇంటి పెద్దల బాధ్యత. అలా జరగాలంటే కుటుంబం కోసం సమయం కేటాయించాలి.
కుటుంబానికి సమయం కేటాయించడం వల్ల వారి మనసులో ఏమైనా స్పర్థలు ఉంటే మొగ్గలోనే తొలగించేయవచ్చు. తద్వారా ఇంట్లో ప్రేమపూర్వక వాతావరణం ఉంటుంది
2. అనవసరంగా ఖర్చు చేయవద్దు పిల్లలు ఏదైనా ఇంటి పెద్దని చూసే ఫాలో అవుతారు. కుటుంబ పెద్ద కూడా తన ప్రతి నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి. అలవాట్లను మెరుగుపరచుకోవాలి.
డబ్బుని అనవసరంగా ఖర్చు చేయవద్దు అని చెప్పేముందు..ఇంటి పెద్ద దుబారాని తగ్గించుకోవాలి. భవిష్యత్ లో ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఎలా ప్లాన్ చేసుకోవాలో చేతల్లో చేసి చూపించాలి.
3.తోబుట్టువులతో సత్సంబంధాలు ఇంట్లో సంతోషం, శాంతి, సానుకూలత నెలకొనాలంటే ఇంటి అధిపతి తన సోదర సోదరీమణులతో సత్సంబంధాలు కొనసాగించాలి
సోదర, సోదరీమణులతో మంచి సంబంధాలు లేకుంటే అది మీ కుటుంబంపై చెడు ప్రభావం పడుతుంది. భవిష్యత్ లో మీ పిల్లల మధ్య కూడా సఖ్యత కరువవుతుంది..