ఆరో రోజు బతుకమ్మకి నైవేద్యం సమర్పించరు, ఎందుకంటే!



తెలంగాణలో వాడవాడలా బతుకమ్మ పండుగ ఘనంగా జరుగుతోంది



అక్టోబరు 14 న ప్రారంభమైన బతుకమ్మ పండుగ దుర్గాష్టమి వరకూ 9 రోజుల పాటూ ఘనంగా నిర్వహిస్తారు



తొమ్మిది రోజుల బతుకమ్మ వేడుకల్లో ఒక్కోరోజు ఒక్కో నైవేద్యం సమర్పిస్తారు



అయితే ఆరో రోజు అలిగినబతుకమ్మకి ఎలాంటి నైవేద్యం సమర్పించరు



అమ్మవారు అలగడం వెనుక ఓ కారణం ఉందని చెబుతారు



అప్పట్లో ఆరోరోజు బతుకమ్మను పేర్చే సమయంలో అనుకోకుండా మాంసం ముద్ద తగిలిందట..అది అపచారం అని భావించిన భక్తులు అమ్మవారిని వేడుకున్నారు



అపచారాన్ని మన్నించు తల్లీ...మాపై ఆగ్రహించవద్దు, అలగవద్దు..నీ బిడ్డల్ని కరుణించు అంటూ వేడుకున్నారు



అప్పటి నుంచి ఆరో రోజు అమ్మవారికి ఎలాంటి నైవేద్యం సమర్పించలేదని చెబుతారు