అన్వేషించండి

Diwali 2023 : దీపాల పండుగా లేదా పటాకులు పేల్చే పండుగా - బాణసంచా కాల్చడం ఎప్పటి నుంచి మొదలైంది!

దీపావళి అంటే దీపాల పండుగా? టపాసుల పండుగా?.. టపాసులు ఎందుకు కాల్చాలి - ఎందుకు వద్దు? అసలు టపాసులు కాల్చడం అనే సంప్రదాయం ఎప్పటి నుంచి మొదలైందో తెలుసా...

Diwali  A Festival Of Lights Or A Festival Of Bursting Firecrackers

జాతి, కుల, మత విభేదాలు లేకుండా ప్రజలంతా సమైక్యంగా జరుపుకునే పండుగ దీపావళి. ఊరూ వాడా దీపాలు, బాణసంచా వెలుగులతో నిండిపోతుంది. అయితే టపాసులు కాల్చొద్దు, ప్రకృతిని కలుషితం చేయొద్దంటూ పెద్ద హడావుడే జరుగుతోంది. కానీ టపాసులు కాల్చడం వెనుకున్న ఆంతర్యం ఏంటి? బాణసంచా కాల్చడం ఎప్పటి నుంచి మొదలైంది? ఇప్పుడెందుకు వద్దంటున్నారు?

Also Read: ధంతేరస్, చోటి దీపావళి - దీపావళి రోజు వెలిగించే దీపాలకూ ఓ లెక్కుందా!
 
చాణక్య నీతి - శుక్రనీతిలో ప్రస్తావన
చైనా వారు తుపాకి మందు కనిపెట్టడానికి ముందే భారత్ లో దానిని ఉపయోగించినట్లు ఆధారాలున్నాయి. చాణక్యుడి అర్థశాస్త్రం, శుక్రాచార్యుడి 'శుక్రనీతి'లో దీని గురించిన ప్రస్తావన ఉంది. అరబ్బులు, పర్షియన్లు తుపాకి మందు ఎలా తయారు చేయాలో భారతీయుల నుంచి నేర్చుకున్నారని చెబుతారు. అంతకుముందు నాఫ్తా అనే ద్రవరూప రసాయనం పోసిన బాణాలు, ఆయుధ ప్రయోగంలో సూరేకారం వాడేవారట. అంటే తుపాకీ మందు , అది ఉపయోగించే ఆయుధాలు తయాలు చేయడానికి ఆద్యులు భారతీయులే. సైనిక వేడుకల్లోనే కాకుండా ఇతర  సమయాల్లోనూ భారతదేశంలో బాణసంచా కాల్చేవారనీ క్రీ.శ. 7వ శతాబ్దం నాటి చైనా సాహిత్యంలో ప్రస్తావించారు. బాణసంచా తయారీలో ప్రధానమైనది తుపాకి మందు. ఇది సూరేకారం, గంధకం, బొగ్గుల మిశ్రమం. గంధకం, బొగ్గు మందుగుండు ఎక్కువసేపు కాలడానికి దోహదం చేస్తే, సూరేకారం మిరమిట్లు గొలిపే ఎర్రటి కాంతులు విరజిమ్ముతుంది. 

Also Read : దీపావళి రోజు పూజించాల్సిన దక్షిణావర్తి శంఖం విశిష్టత ఏంటో తెలుసా!

యుగ యుగాల పండుగ
రావణ వధ అనంతరం వనవాసాన్ని ముగించుకుని అయోధ్యలో సీతారాములు అడుగుపెట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని దీపావళి జరుపుకున్నారని చెబుతారు. ద్వారప యుగంలో నరకాసుల వధ తర్వాత బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారంటారు. 

Also Read : దీపావళికి దీపాలు వెలిగించేటప్పుడు అస్సలు చేయకూడని పొరపాట్లు ఇవే!

రాజలుకే పరిమితం
దీపావళి సందర్భంగా  బాణసంచా కాల్చడంపై నిషేధం విధించడాన్ని  చాలా మంది దీనిని హిందూ మతంపై దాడిగా భావించారు. హిందూ సంప్రదాయంలో ఇది అంతర్భాగమన్నారు. వాస్తవానికి మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా బాణసంచా నిషేధించడం మంచిదే. పైగా దీపావళి అంటే దీపాలే ప్రధానం..బాణసంచా కాదు. అప్పట్లో కూడా బాణసంచా కాల్చేవారు కానీ ఈ సంప్రదాయం కేవలం రాయల్టీకి మాత్రమే పరిమితం అయ్యేది. మొఘల్ కాలంలో క్రాకర్స్ కాల్చడం గొప్పతనానికి చిహ్నం. వివాహాలు, పట్టాభిషేకాల సమయంలో బాణసంచా కాల్చడం సర్వసాధారణం. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాతే భారతీయ పరిశ్రమలు బాణసంచా తయారీని ప్రారంభించాయి. మన దేశంలో మొదటి బాణసంచా తయారీ కర్మాగారం 19 శతాబ్ధంలో కోలకతాలో ప్రారంభమైంది. ఇద్దరు సోదరులు పి అయ్య నాడార్ - షణ్ముగ నాడార్ 1923లో అగ్గిపెట్టె తయారీ నేర్చుకునేందుకు పశ్చిమ బెంగాల్‌కు వెళ్లిన తర్వాత తమిళనాడు శివకాశి బాణాసంచా తయారీ కేంద్రంగా మారింది.

Also Read: కార్తీకమాసం ఎప్పటి నుంచి ప్రారంభం, కార్తీక పౌర్ణమి సహా ముఖ్యమైన రోజులివే!

బాణసంచా ఎందుకు కాల్చాలి
భారతదేశం వ్యవసాయ ప్రధాన దేశం. చాలా ప్రాంతాల వారి ప్రధాన ఆహారం...శీతాకాలంలోనే వృద్ధి చెందుతుంది. దీపావళితో శీతాకాలం ప్రారంభమవుతుంది. ఈ సమయంలోనే పంటను నాశనం చేసే రకరకాల కీటకాలు వృద్ధి చెందుతాయి. వీటి కారణంగా పంట దిగుబడి తగ్గిపోతుంది. ఈ కీటకాల కారణంగా ప్రజలు అనారోగ్యం పాలవుతారు. ఈ సమస్యకు గంధకం వినియోగం మంచి పరిష్కారం. దీపావళి రోజు బాణసంచా కాల్చడం వల్ల గాలిలో గంధకం పొగ వ్యాపించి కీటకాలను నివారిస్తుంది. ఇంకా..బురద, తడి, వానలు కారణంగా పెరిగిన క్రిమికీటకాలు విచ్చలవిడిగా సంచరించటం ప్రారంభిస్తాయి. పంటపొలాలు కోతలకి వచ్చి వాటిలో బాగా పెరిగిన పురుగులు, దోమలు వీరవిహారం చేయటం ప్రారంభిస్తాయి. ఈ  సమయంలో గంధకం, పొటాషియం వంటి రసాయనాల పొగపెడితే వాటి విజృంభణను నివారించవచ్చు. పొగ వెయ్యండి అంటే అందరూ వెయ్యరుకదా! పండగలో భాగంగా చెయ్యమంటే తప్పకుండా చేస్తారు. డెంగ్యూ ఫివర్‌ కలిగించే దోమలు కూడా టపాకాయలు కాల్చినప్పుడు వచ్చే పొగవల్ల నశిస్తాయట. 

Also Read: శనిదోషం తొలగిపోవాలంటే దీపావళికి నువ్వులతో దీపం ఇలా వెలిగించండి!

ఎక్కువ దీపాలు ఇందుకే
పూర్వకాలం సౌకర్యాలు ఎక్కువ లేని రోజుల్లో శరదృతువు ప్రయాణానికి అనుకూలమైన కాలం గనుక అందరూ అప్పుడే ప్రయాణాలు చేసేవారు. అలాంటి సమయంో బాటసారులకు దారి చూపటానికి కాబోలు ఎత్తైన ప్రదేశంలో ఒక దీపం పెట్టే సంప్రదాయం ఏర్పడింది. ఇప్పటికీ దేవాలయాలలో అలా ఒక దీపం ఎత్తైన స్థంభంపై వెలిగించటం కనిపిస్తుంది. చీకటి, అజ్ఞానాల మీద గెలుపుకి ప్రతీక అయిన దీపావళి, కొంచెం ఆలోచించి అర్థం చేసుకుంటే సంతోషాల దీపావళి అవుతుంది.

Also Read: ధనత్రయోదశి, నరక చతుర్దశి రోజు 'యమదీపం' వెలిగించడం ఎంత ముఖ్యమో తెలుసా!

అయితే అతి సర్వత్రా వర్జయేత్ అనే మాటని ఇక్కడ మరిచిపోరాదు. క్రాకర్స్ కాల్చొచ్చు అనే వాదనతో వాయుకాలుష్యం, శబ్ధకాలుష్యం పెరిగేంతగా కాల్చకూడదు..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Posani Heart Problem: పోసాని ఛాతినొప్పి డ్రామా - తేల్చిన పోలీసులు
పోసాని ఛాతినొప్పి డ్రామా - తేల్చిన పోలీసులు
Crazxy Movie Review - 'క్రేజీ' రివ్యూ అండ్ రేటింగ్: Tumbbad హీరో కొత్త సినిమా - థ్రిల్లింగ్ రైడ్!
'క్రేజీ' రివ్యూ అండ్ రేటింగ్: Tumbbad హీరో కొత్త సినిమా - థ్రిల్లింగ్ రైడ్!
Rahul Dravid: ఇంగ్లాండ్ లో ఇండియన్ టీమ్ ను సెకండ్ క్లాస్ మనుషుల్లా చూసేవారు: రాహుల్ ద్రవిడ్ వీడియో వైరల్
ఇంగ్లాండ్ లో ఇండియన్ టీమ్ ను సెకండ్ క్లాస్ మనుషుల్లా చూసేవారు: రాహుల్ ద్రవిడ్ వీడియో వైరల్
AP Pensions: 5 ఏళ్ల తరువాత ప్రజల్లో భయం పోయింది: జీడీ నెల్లూరులో పింఛన్ల పంపిణీలో చంద్రబాబు
5 ఏళ్ల తరువాత ప్రజల్లో భయం పోయింది: జీడీ నెల్లూరులో పింఛన్ల పంపిణీలో చంద్రబాబు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పోసానికి తీవ్ర అస్వస్దత   ఇలా అయిపోయాడేంటి..?మేం సపోర్ట్ ఆపేస్తే రెండు వారాల్లో నువ్వు ఫినిష్-  అయినా సంతకం పెట్టను..Badrinath Avalanche Workers Trapped | మంచుచరియల కింద చిక్కుకుపోయిన 41మంది | ABP DesamFlash Floods in Kullu Manali | బియాస్ నదికి ఆకస్మిక వరదలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Posani Heart Problem: పోసాని ఛాతినొప్పి డ్రామా - తేల్చిన పోలీసులు
పోసాని ఛాతినొప్పి డ్రామా - తేల్చిన పోలీసులు
Crazxy Movie Review - 'క్రేజీ' రివ్యూ అండ్ రేటింగ్: Tumbbad హీరో కొత్త సినిమా - థ్రిల్లింగ్ రైడ్!
'క్రేజీ' రివ్యూ అండ్ రేటింగ్: Tumbbad హీరో కొత్త సినిమా - థ్రిల్లింగ్ రైడ్!
Rahul Dravid: ఇంగ్లాండ్ లో ఇండియన్ టీమ్ ను సెకండ్ క్లాస్ మనుషుల్లా చూసేవారు: రాహుల్ ద్రవిడ్ వీడియో వైరల్
ఇంగ్లాండ్ లో ఇండియన్ టీమ్ ను సెకండ్ క్లాస్ మనుషుల్లా చూసేవారు: రాహుల్ ద్రవిడ్ వీడియో వైరల్
AP Pensions: 5 ఏళ్ల తరువాత ప్రజల్లో భయం పోయింది: జీడీ నెల్లూరులో పింఛన్ల పంపిణీలో చంద్రబాబు
5 ఏళ్ల తరువాత ప్రజల్లో భయం పోయింది: జీడీ నెల్లూరులో పింఛన్ల పంపిణీలో చంద్రబాబు
Rambha Re Entry: రీ ఎంట్రీకి రెడీ... ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన రంభ... సెకండ్ ఇన్నింగ్స్ షురూ!
రీ ఎంట్రీకి రెడీ... ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన రంభ... సెకండ్ ఇన్నింగ్స్ షురూ!
Teenmar Mallanna: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ అధిష్టానం చర్యలు, పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ అధిష్టానం చర్యలు, పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు
SBI PO: ఎస్‌బీఐ పీవో-2024 ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
ఎస్‌బీఐ పీవో-2024 ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
Crime News: తోటి డాన్సర్ జీవితంతో ఆడుకున్న ఢీ డాన్సర్ -ఆత్మహత్య - కన్నీరు పెట్టిస్తున్న చివరి వీడియో
తోటి డాన్సర్ జీవితంతో ఆడుకున్న ఢీ డాన్సర్ -ఆత్మహత్య - కన్నీరు పెట్టిస్తున్న చివరి వీడియో
Embed widget