Siddhu Jonnalagadda Jack: సిద్ధు జొన్నలగడ్డ 'జాక్' ఫస్ట్ సింగిల్ అదుర్స్ - 'పాబ్‌లో నీరుడా' సాంగ్ చూశారా?
Jack Movie Song: సిద్ధు జొన్నలగడ్డ, బొమ్మరిల్లు భాస్కర్ కాంబోలో వస్తోన్న లేటెస్ట్ మూవీ 'జాక్'. ఈ మూలీ నుంచి ఫస్ట్ సింగిల్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఏప్రిల్ 10న సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది.

Siddhu Jonnalagadda's Jack Movie First Song Released: స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వస్తోన్న లేటెస్ట్ మూవీ 'జాక్' (Jack). కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. 'ఏ ఉప్పనలూ చూడక్కర్లే.. తన ఉత్సాహం చూస్తే చాలదా.. ఏ అద్భుతం చూడక్కర్లా.. తన పోరాటం చూస్తే చాలదా..' అంటూ సాగే లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌కు అచ్చు రాజమణి మ్యూజిక్ అందిస్తుండగా.. 'పాబ్‌లో నిరుడా' పాటను బెన్నీ దయాల్ పాడారు. వనమాలి లిరిక్స్ అందించారు. యూత్‌ను ఆకట్టుకునేలా సాంగ్ ఉంది.
'బేబీ' మూవీ ఫేం వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత BVSN ప్రసాద్ నేతృత్వంలోని అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఈ మూవీని నిర్మిస్తుండగా.. ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదల కానుంది. ఇటీవల సిద్ధు బర్త్ డే సందర్భంగా 'జాక్' నుంచి టీజర్‌ను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అదిరే కామెడితో పాటు కాస్త యాక్షన్, లవ్ జోడించి ఈ మూవీ ఉండబోతోందని టీజర్‌ను బట్టి తెలుస్తోంది. మూవీలో సీనియర్ నటులు నరేష్, ప్రకాష్ రాజ్, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషించారు.
Pablo Nerudaa.. Pablo Nerudaa..
— SVCC (@SVCCofficial) March 7, 2025
Pablo Nerudaa…
Ye’ ulikee longani Raayithadaa..💥💥💥
Now witness #PabloNeruda in its most energetic form! ❤️🔥❤️🔥
▶️ https://t.co/eIh6UhOrdo
Full Song Out Now 🎧 #Jack #JackOnApril10th#SidduJonnalagadda @iamvaishnavi04 @baskifilmz #AchuRajamani… pic.twitter.com/xnQyRyQVjM
ఆకట్టుకుంటోన్న సిద్ధు లుక్
మూవీలో సీనియర్ నటుడు నరేష్, సిద్దు తండ్రీ కొడుకులుగా నటిస్తుండగా.. వీరి మధ్య వచ్చే కామెడీ సీన్స్ హైప్ వచ్చేలా ఉంటాయని టీజర్‌ను బట్టి అర్థమవుతోంది. సిద్దు స్టైలీష్ లుక్స్, డిఫరెంట్ షేడ్స్ టీజర్‌లో కనిపించగా.. అసలు హీరో ఏం ఉద్యోగం చేస్తున్నాడు.?, అతని లక్ష్యం ఏంటి?, అతని గమ్యం ఏంటి?, ఆ పోరాటాలు ఏంటి? ఈ లవ్ స్టోరీ ఏంటి? అని ఇలా రకరకాల ప్రశ్నలు తలెత్తేలా టీజర్ ఉండగా.. మూవీపై ఆసక్తిని మరింత పెంచేశాయి.
Also Read: యూరప్ ట్రిప్‌లో నాగచైతన్య, శోభిత కపుల్ - అక్కడి ఫుడ్ ఎలా ఎంజాయ్ చేశారో చూశారా.?, ఫోటోలు వైరల్





















