IPL Tickets 2025: అభిమానులకు గుడ్ న్యూస్.. ఐపీఎల్ టికెట్ల విక్రయాలు ప్రారంభం.. ఎక్కడ దొరకుతాయంటే..?
జొమాటో డిస్ట్రిక్ట్ యాప్ లో ఈ టికెట్లను అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొంది. ప్రతి రెండు టికెట్లకుగాను ఒక జెర్సీని బహుమతిగా ఇవ్వనుంది. గత కొంతకాలంగా ఈ స్ట్రేటజీని ఫ్రాంచైజీ ఫాలో అవుతోంది.

IPL 2025 Sunrisers Latest Updates: ఐపీఎల్ జోష్ ప్రారంభమైంది. ఈనెల 22 నుంచి ప్రారంభమయ్యే మెగా టోర్నీ కోసం టికెట్ల అమ్మకాలు కూడా ప్రారంభమయ్యాయి. శుక్రవారం నుంచి టికెట్లు అమ్మకాలు స్టార్ట్ చేసినట్లు సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం తెలిపింది. జొమాటో కు చెందిన డిస్ట్రిక్ట్ యాప్ లో ఈ టికెట్లను అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొంది. ప్రతి రెండు టికెట్లకుగాను ఒక జెర్సీని బహుమతిగా ఇవ్వనుంది. గత కొంతకాలంగా ఈ స్ట్రేటజీని ఫ్రాంచైజీ ఫాలో అవుతోంది.
ఆన్ లైన్ లో టికెట్లు అమ్మకాలు జరుపుతుండగా, వీటిని ఫిజికల్ గా ఎక్కడ తీసుకోవాలో ఫ్రాంచైజీ తెలుపలేదు. దీనిపై కాస్త గందరగోళం నెలకొంది. అయితే త్వరలోనే దీనిపై స్పష్టత రానుందని తెలుస్తోంది. ఇక హైదరాబాద్ లో ఈనెల 23న రాజస్థాన్ రాయల్స్ తో తొలి మ్యాచ్ ను ఆడనుంది. అలాగే 27న లక్నో సూపర్ జెయింట్స్ తో తలపడనుంది. ఈ రెండు మ్యాచ్ లకు సంబంధించిన టికెట్లను అందుబాటులో ఉంచుతున్నట్లు ఫ్రాంచైజీ పేర్కొంది. Clike Here to Book IPL Tickets online
కార్స్ స్థానంలో ముల్డర్..
ఇక గతేడాది రన్నరప్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బైడెన్ కార్స్ స్థానంలో వియాన్ ముల్డర్ ను జట్టులోకి తీసుకుంది. తను గాయపడటంతో ఈ మార్పు చేసినట్లు తాజాగా ఒక ప్రకటనలో ఫ్రాంచైజీ యాజమాన్యం తెలిపింది. ముల్డర్ సౌతాఫ్రికాకు మూడు ఫార్మాట్లలో ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 18 టెస్టులు, 25 వన్డేలు, 11 టీ20లు ఆడిన అనుభవం ముల్డర్ సొంతం. ఇక బుధవారం న్యూజిలాండ్ తో జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ సెమీస్ లో ముల్డర్ ఆడాడు. అతడిని రూ.75 లక్షలకు సన్ రైజర్స్ కొనుగోలు చేసింది.
ఈసారి బలంగా సన్ రైజర్స్..
ఈసారి సన్ రైజర్స్ మరింత బలంగా మారింది. ఇషాన్ కిషన్, మహ్మద్ షమీ, అభినవ్ మనోహర్ లాంటి ఆటగాళ్లతో పటిష్టంగా ఉంది. దానికి తోడు ముల్డర్ లాంటి ఆల్ రౌండర్ తోడయ్యాడు. ఇక లీగ్ షెడ్యూల్ తో పాటు నాకౌట్ మ్యాచ్ లను కూడా ఈసారి ప్రకటించారు. మే 20న క్వాలిఫయర్ -1, 21న ఎలిమినేటర్ మ్యాచ్ లు హైదరాబాద్ లో జరుగుతాయి. మే 23న క్వాలిఫయర్-2, మే-25న ఫైనల్ మ్యాచ్ లు ఈడెన్ గార్డెన్స్ జరుగుతాయి. ఇక సన్ రైజర్స్ హైదరాబద్ జట్టు విషయానికొస్తే తొలి మ్యాచ్ ను మార్చి 23న రాజస్థాన్ రాయల్స్ జట్టుతో ఆడనుంది. సొంతగడ్డపై ఏడు, వేరే జట్ల వేదికలపై ఏడు మ్యాచ్ లను ఆడుతుంది. సొంతగడ్డపై రాజస్థాన్ తో పాటు లక్నో సూపర్ జెయింట్స్ (మార్చి 27న), గుజరాత్ టైటాన్స్ (ఏప్రిల్ 6), పంజాబ్ కింగ్స్ (ఏప్రిల్ 12), ముంబై ఇండియన్స్ (ఏప్రిల్ 23), ఢిల్లీ క్యాపిటల్స్ (మే 5), కోల్ కతా నైట్ రైడర్స్ (మే 10న)తో ఆడుతుంది.




















