Viral News: డేంజర్‌గా మారిన చికెన్ బిర్యానీ బోన్ - గొంతులో ఇరుక్కోవడంతో 8 గంటలు ఆపరేషన్ !
Biryani: బిర్యానీ తిని కూల్ డ్రింక్ తాగి..బ్రేవ్ మని తేల్చేవాళ్లుంటారు. కానీ ఆ మహిళ మాత్రం ఆస్పత్రిలో చేరింది. 21 రోజులు ఉంది. చివరికి ఎనిమిది గంటల ఆపరేషన్ చేస్తే కానీ ప్రాణం నిలబడలేదు.

Mumbai Woman: సండే కదా అని చికెన్ తెచ్చి చక్కగా చికెన్ బిర్యానీ చేసుకున్నారు. కుటుంబం అంతా తిన్నారు. బిర్యానీ చేసిన ఆ మహిళ కూడా తిన్నారు. కానీ తిన్న కాసేపటికే ఏదో తేడా అనిపించింది. అది కడుపులో కాదు. ఇంకెక్కడో ఏమిటో అర్థం కాలేదు. రెండో రోజుకు అసలు నడవలేని పరిస్థితి వచ్చింది. ఏమయిందోనని ఆస్పత్రకి వెళ్లారు. అక్కడ పరీక్షలు చేసిన వైద్యులు 4-C5 వెన్నుపూస డిస్క్‌ల మధ్య ఉన్న ఆమె మధ్య గర్భాశయ వెన్నెముక ప్రాంతం దగ్గర ఒక ఎముక ఉన్నట్లుగా గుర్తించారు. ఆ ఎముక అక్కడకు ఎలా చేసిందో వారికి అర్థం కాలేదు. తాము అంతకు ముందు రోజు చికెన్ బిర్యానీ తిన్నామని ఆ మహిళ చెప్పడంతో అదే అక్కడికి చేరిందని గుర్తించారు.
ముంబైలోని కుర్లాకు చెందిన 34 ఏళ్ల రూబీ షేక్ అనే మహిళ తన బిర్యానీలోని కోడి ఎముక చిక్కుకోవడంతో 8 గంటల పాటు శస్త్రచికిత్స చేయించుకుంది. ఫిబ్రవరి 3న రూబీ తన కుటుంబంతో కలిసి భోజనం చేస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. 3.2 సెం.మీ. కోడి ఎముక ఆమె గొంతులో ఇరుక్కుపోయింది. దాన్ని మళ్లీ గొందులోకో.. లేకపోతే బయటకో తీసే ప్రయత్నంలో అది తప్పు దిశలో కదిలింది, దీనివల్ల తీవ్ర సమస్యలు తలెత్తాయి. ఇరవై ఒక్క రోజులు ఆస్పత్రిలో ఉన్నా ఆ సమస్యకు పరిష్కారం దొరకలేదు. ఇక ఆపరేషన్ చేయాల్సిందేనని వైద్యులు తేల్చడంతో చివరికి కుటుంబసభ్యులు ఒప్పుకున్నారు.
ఫిబ్రవరి 8న జరిగిన ఆపరేషన్ చాలా సంక్లిష్టమైనదిని వైద్యులు చెప్పారు. వైద్య విధానంలో ఇటువంటి కేసులు అసాధారణమని వైద్యులు పేర్కొన్నారు. రూబీ కుటుంబానికి ఈ చికెన్ బిర్యానీ వల్ల అయిన ఖర్చు ఎనిమిది లక్షల రూపాయలు. అయితే వారి పరిస్థితి చూసి ఆస్పత్రి సగం ఖర్చు తగ్గిచింది. ఆపరేషన్ తర్వాత నాలుగు లక్షలు కట్టించుకుని డిశ్చార్జ్ చేశారు. నెల రోజులు విశ్రాంతి తీసుకోవాలని.. ఎముకల జోలికి వెళ్లవద్దని సలహా ఇచ్చారు. అన్నవాహికలో జరిగిన మార్పుల వల్ల ఎముక అక్కడికి చేరి ఉండవచ్చని వైద్యులు చెప్పారు. ఇదో 'అసాధారణ కేసు' గా చెబుతున్నారు.
సాధారణంగా మనుషులు తినే అన్నం గొంతు నేరుగా అన్న వాహికలోకి వెళ్తాయి. కానీ తినేటప్పుడు గొంతులో వచ్చే చిన్న చిన్న మార్పుల వల్ల సమస్యలు వస్తాయి. మనం తినేటప్పుడు కొరపోతుందని చెప్పుకుంటూ ఉంటారు. విపరీతమైన దగ్గు వస్తుంది. అలాంటి సమయంలో అన్నవాహిక లోకి కాకుండా.. ఇతర అవయవాల్లోకి ఆహారం వెళ్లే ప్రమాదం ఉందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. అయితే ముంబై మహిళకు ఇలా వెళ్లింది ఏముక కావడం.. అది ఇరుక్కుపోవడం ప్రాణాల మీదకు తెచ్చింది. ఇలాంటి ఘటనలు కోటికి ఒక్కటి జరుగుతూంటాయని.. అత్యంత అసాధారణమైనవి చెబుతున్నారు.





















