అన్వేషించండి

Diwali 2023: దీపావళి రోజు పూజించాల్సిన దక్షిణావర్తి శంఖం విశిష్టత ఏంటో తెలుసా!

Diwali 2023:దీపావళి అమావాస్య రోజు సాయంత్రం చాలామంది లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పూజలు చేస్తారు. ఈ పూజలో ఉంచాల్సిన వస్తువులలో అత్యంత ముఖ్యమైనది దక్షిణావర్తి శంఖం. ఈ శంఖం విశిష్టత ఏంటో తెలుసా..

Diwali 2023 Dakshinavarti Shankh: శ్రీ మహాలక్ష్మిని ఆనందం, శ్రేయస్సు , సంపదకు అధిదేవతగా భావిస్తారు. లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందిన ఎవ్వరైనా జీవితంలో వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదని చెబుతారు. అందుకే అమ్మవారి కరుణా కటాక్షాలకోసం తమ శక్తి కొలది పూజిస్తారు.  ముఖ్యంగా దీపావళి రోజు లక్ష్మీదేవిని, వినాయకుడిని పూజిస్తారు. ఈ సమయంలో దక్షిణావర్తి శంఖాన్ని తీసుకొచ్చి ఆ పూజలో ఉంచి...అప్పటి నుంచి ప్రతి శుక్రవారం పూజను కొనసాగిస్తే ఆ ఇల్లు లక్ష్మీనివాసంగా మారుతుంది. 

దక్షిణావర్తి శంఖం ఎలా ఉద్భవించింది

పురాణాల ప్రకారం క్షీరసాగర మథనం సమయంలో శ్రీ మహాలక్ష్మితో పాటూ దక్షిణావర్తి శంఖం ఉద్భవించింది. అందుకే లక్ష్మీదేవితో పాటూ ఈ శంఖాన్ని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని, శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం సిద్ధిస్తుందని చెబుతారు. ఈ శంఖాన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆహార ధాన్యాల కొరత ఉండదు.

Also Read: ధన త్రయోదశి రోజు ఈ వస్తువులు కొనితెచ్చుకున్నా శుభమే - తక్కువ ఖర్చే!

దక్షిణావర్తి శంఖాన్ని ఎలా గుర్తించాలి

సముద్రంలో కనిపించే శంఖాలు ఎక్కువగా ఎడమ రెక్కల శంఖులే. ఈ శంఖుల ఉదరం ఎడమ వైపు తెరిచి ఉంటుంది. కానీ దక్షిణ శంఖ ముఖం కుడి వైపు ఉంటుంది. ఈ శంఖాన్ని చాలా పవిత్రమైనదిగా, ప్రయోజనకరమైనదిగా పరిగణిస్తారు

ఇలా పూజించాలి

ఇంట్లో దక్షిణావర్తి శంఖాన్ని ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. అయితే ఇంట్లో ఉంచుకోవడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. దీన్ని ఇంట్లో పెట్టుకునే ముందు శుభ్రమైన ఎరుపు వస్త్రాన్ని తీసుకోవాలి. ఈ శంఖాన్ని గంగాజలంతో నింపాలి. ఒక రోజు పూర్తయ్యే వరకు ‘ఓం శ్రీ లక్ష్మీ బేతాయై నమః’ అనే మంత్రాన్ని జపించాలి. మంత్రం చదివిన తర్వాత దక్షిణవర్తి శంఖాన్ని ఎర్రటి గుడ్డలో చుట్టి పెట్టాలి. దీనిని ప్రతిశుక్రవారం పూజిస్తే ఇంట్లో ధనధాన్యాలకు కొదువ ఉండదు.

Also Read: యుగయుగాలుగా లక్ష్మీ ఆరాధన -ఇంతకీ దీపావళి రోజే లక్ష్మీ పూజ ఎందుకు చేయాలి!

దక్షిణవర్తి శంఖం ప్రాముఖ్యత

పురాణాల ప్రకారం ఎవరైతే తన దక్షిణావర్తి శంఖాన్ని కలిగి ఉంటారో..ఈ ఇంట్లో నివాసం ఉంటున్న వారిపై లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. ఆ ఇంట్లో ఆర్థిక సంక్షోభాలన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. శంఖం శబ్ధం వల్ల ఇంటిలోని నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది.

Also Read: ధనత్రయోదశి, నరక చతుర్దశి రోజు 'యమదీపం' వెలిగించడం ఎంత ముఖ్యమో తెలుసా!

దీపావళి రోజే ఎందుకు!

శాస్త్రం ప్రకారం దీపావళి రోజున దక్షిణావర్తి శంఖాన్ని ఇంటికి తీసుకురావడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. శంఖాన్ని నైరుతి దిశలో ఉంచడం వల్ల ఇంట్లో ఎప్పుడూ డబ్బుకు లోటుండదు. పూజానంతరం ఓం శ్రీ లక్ష్మీ సహోద్రాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించి...లక్ష్మీపూజ తర్వాత శంఖాన్ని ఎర్రటి గుడ్డలో చుట్టి భద్రంగా ఉంచాలి. దక్షిణావర్తి శంఖాన్ని దక్షిణం వైపు ఉంచడం వల్ల ప్రతికూల శక్తులు ఇంట్లో ఉండవు, శత్రువులు మీకు హాని చేయలేరు. ఈ ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా నివాసం ఉంటుందని విశ్వశిస్తారు.

Also Read: దీపావళి 5 రోజుల పండుగ - ఏ రోజు ఏంచేయాలి, విశిష్ఠత ఏంటి!

 
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Group-3 Results: గ్రూప్‌-3 ఫలితాలు విడుదల, అభ్యర్థుల మార్కుల వివరాలు అందుబాటులో - డైరెక్ట్ లింక్ ఇదే
గ్రూప్‌-3 ఫలితాలు విడుదల, అభ్యర్థుల మార్కుల వివరాలు అందుబాటులో - డైరెక్ట్ లింక్ ఇదే
Dilruba Movie Review - 'దిల్‌రూబా' రివ్యూ: ఇది కిరణ్ అబ్బవరం 'జల్సా'యే కానీ... 50 కోట్ల కలెక్షన్లు తెచ్చిన 'క' తర్వాత చేసిన సినిమా హిట్టేనా?
'దిల్‌రూబా' రివ్యూ: ఇది కిరణ్ అబ్బవరం 'జల్సా'యే కానీ... 50 కోట్ల కలెక్షన్లు తెచ్చిన 'క' తర్వాత చేసిన సినిమా హిట్టేనా?
Tirumala Letters Issue: తెలంగాణ నేతలకు తిరుమలలో దక్కే గౌరవం ఇదేనా, చాలా బాధాకరం: రఘునందన్ రావు
తెలంగాణ నేతలకు తిరుమలలో దక్కే గౌరవం ఇదేనా, చాలా బాధాకరం: రఘునందన్ రావు
Aadhi Pinisetty Nikki Galrani: వీకెండ్‌లో చిల్ అవుతున్న ఆది, నిక్కీ కపుల్ - మాల్దీవ్స్ అందాలు ఎంజాయ్ చేస్తున్నారుగా..
వీకెండ్‌లో చిల్ అవుతున్న ఆది, నిక్కీ కపుల్ - మాల్దీవ్స్ అందాలు ఎంజాయ్ చేస్తున్నారుగా..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Parvatmala project Explained in Telugu | రోడ్లు వేయలేని మార్గాల్లో రోప్ వే తో మహారాజులా ప్రయాణం |ABPMS Dhoni Dance in Pant Sister Marriage | అన్నీ మర్చిపోయి హ్యాపీగా డ్యాన్స్ చేసిన ధోనీ | ABP DesamHow To Use Shakthi App | శక్తి యాప్ తో ఎక్కడికెళ్లినా సేఫ్ గా ఉండండి | ABP DesamChitrada Public Talk | చిత్రాడలో జనసేన విజయకేతనం సభపై స్థానికుల అభిప్రాయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Group-3 Results: గ్రూప్‌-3 ఫలితాలు విడుదల, అభ్యర్థుల మార్కుల వివరాలు అందుబాటులో - డైరెక్ట్ లింక్ ఇదే
గ్రూప్‌-3 ఫలితాలు విడుదల, అభ్యర్థుల మార్కుల వివరాలు అందుబాటులో - డైరెక్ట్ లింక్ ఇదే
Dilruba Movie Review - 'దిల్‌రూబా' రివ్యూ: ఇది కిరణ్ అబ్బవరం 'జల్సా'యే కానీ... 50 కోట్ల కలెక్షన్లు తెచ్చిన 'క' తర్వాత చేసిన సినిమా హిట్టేనా?
'దిల్‌రూబా' రివ్యూ: ఇది కిరణ్ అబ్బవరం 'జల్సా'యే కానీ... 50 కోట్ల కలెక్షన్లు తెచ్చిన 'క' తర్వాత చేసిన సినిమా హిట్టేనా?
Tirumala Letters Issue: తెలంగాణ నేతలకు తిరుమలలో దక్కే గౌరవం ఇదేనా, చాలా బాధాకరం: రఘునందన్ రావు
తెలంగాణ నేతలకు తిరుమలలో దక్కే గౌరవం ఇదేనా, చాలా బాధాకరం: రఘునందన్ రావు
Aadhi Pinisetty Nikki Galrani: వీకెండ్‌లో చిల్ అవుతున్న ఆది, నిక్కీ కపుల్ - మాల్దీవ్స్ అందాలు ఎంజాయ్ చేస్తున్నారుగా..
వీకెండ్‌లో చిల్ అవుతున్న ఆది, నిక్కీ కపుల్ - మాల్దీవ్స్ అందాలు ఎంజాయ్ చేస్తున్నారుగా..
DC New Captain Axar: ఢిల్లీ కొత్త కెప్టెన్ గా స్టార్ ఆల్ రౌండ‌ర్.. అపార అనుభ‌వం అత‌ని సొంతం.. టీమిండియాలో కీల‌క ప్లేయ‌ర్
ఢిల్లీ కొత్త కెప్టెన్ గా స్టార్ ఆల్ రౌండ‌ర్.. అపార అనుభ‌వం అత‌ని సొంతం.. టీమిండియాలో కీల‌క ప్లేయ‌ర్
Viral Video: వీడు అసలు మనిషేనా? ఓ ప్రాణం తీశానని కూడా లేదు- వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం వీడియో చూశారా
వీడు అసలు మనిషేనా? ఓ ప్రాణం తీశానని కూడా లేదు- వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం వీడియో చూశారా
MLC Nagababu: ఎమ్మెల్సీగా నాగబాబు - ఛాన్స్ ఇచ్చినందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు
ఎమ్మెల్సీగా నాగబాబు - ఛాన్స్ ఇచ్చినందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు
Hyderabad News: హీరో బాలకృష్ణ ఇంటి ముందు కారు బీభత్సం - ఫెన్సింగ్‌ను ఢీకొట్టిన కారు
హీరో బాలకృష్ణ ఇంటి ముందు కారు బీభత్సం - ఫెన్సింగ్‌ను ఢీకొట్టిన కారు
Embed widget