అన్వేషించండి

Diwali-2023: యుగయుగాలుగా లక్ష్మీ ఆరాధన -ఇంతకీ దీపావళి రోజే లక్ష్మీ పూజ ఎందుకు చేయాలి!

ఏటా ఆశ్వయుజ అమావాస్య రోజు దీపావళి పండుగ జరుపుకుంటారు. సంతోషాన్ని సంపదలను ఇచ్చే ఈ పండుగరోజున లక్ష్మీపూజ ఎందుకు చేస్తారు. యుగయుగాలుగా ఈ పూజకు ఎంత ప్రాముఖ్యత ఉందో తెలుసా...

దీపోజ్యోతిః పరం బ్రహ్మ, దీపః సర్వతమో పహః |
దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే ॥

దీపాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావించి దీపావళి రోజు లక్ష్మీపూజ చేసిన అనంతరం ఇల్లంతా దీపాలతో అలంకరిస్తారు. మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సంపదలకు చిహ్నంగా ఈ దీపాన్ని భావిస్తారు. ఆశ్వీయుజ బహుళ చతుర్దశి నుంచి కార్తీకమాసం మొత్తం సంధ్యా సమయంలో మట్టి ప్రమిదలలొ దీపాలు వెలిగిస్తారు. దీపావళి రోజు చేసే లక్ష్మీపూజ వెనుక ఓ ప్రత్యేకత ఉంది. యుగయుగాలుగా ఈ లక్ష్మీపూజకు ప్రాముఖ్యత ఉంది. 

Also Read: దీపావళి 5 రోజుల పండుగ - ఏ రోజు ఏంచేయాలి, విశిష్ఠత ఏంటి!

దిపావళి రోజు లక్ష్మీపూజ ఎందుకు చేయాలి

దుర్వాస మహర్షి ఒకరోజు దేవేంద్రుడి పిలుపు మేరకు ఆతిథ్యానికి వెళ్లి ఓ హారాన్నిస్తాడు. అహంకారంతో ఆ హారాన్ని తిరస్కరించిన ఇంద్రుడు తన ఐరావతం మెడలో వేసేస్తాడు. ఏనుగు ఆ హారాన్ని కాలితో తొక్కేస్తుంది. అసలే దుర్వాసుడికి కోపం ఎక్కువ..ఇదంతా ఆగ్రహించిన మహర్షి దేవేంద్రుడిని శపిస్తాడు. ఆ శాప పలితంగా తన స్థానాన్ని, సర్వసంపదలను కోల్పోయిన దేవేంద్రుడు..దిక్కుతోచని స్థితిలో  శ్రీమహావిష్ణువుని ప్రార్థిస్తాడు. కరుణించిన శ్రీ మహావిష్ణువు...ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మీ స్వరూపంగా తలచి పూజించమని ఉపదేశిస్తాడు. ఇంద్రుడు అలా చేసిన తర్వాత పోయిన సరిసింపదలు తిరిగొచ్చాయని పురాణ కథనం. అప్పటి నుంచి లక్ష్మీదేవిని పూజించిన వారికి సర్వసంపదలూ చేకూరతాని విశ్వాసం.

Also Read: ధనత్రయోదశి, నరక చతుర్దశి రోజు 'యమదీపం' వెలిగించడం ఎంత ముఖ్యమో తెలుసా!

ద్వాపరయుగంలో దీపావళి

భూదేవి-వరహా స్వామికి అసుర సమయంలో జన్మించిన నరకాసురుడు..తల్లి చేతిలో మాత్రమే మరణించేలా వరం పొందుతాడు. వరగర్వంతో లోకకంటకుడిగా తయారైన నరకుడు ముల్లోకాలను పట్టిపీడించాడు. నరకాసురుడి బాధలు భరించలేని దేవతలు, మునులు, గంధర్వులు  శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లి తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారి మొర ఆలకించిన శ్రీమహావిష్ణువు ద్వాపర యుగంలో కృష్ణుడిగా అవతరించి సత్యభామతో నరకాసుర సంహారం చేశాడు. నరకుడు చతుర్థశి రోజు మరణించగా ఆ తర్వాత రోజు దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారు. రాక్షసుడి బారినుంచి విముక్తి కలగడంతో ఆనందంతో బాణసంచా కాల్చారని కథనం

Also Read: కార్తీకమాసం ఎప్పటి నుంచి ప్రారంభం, కార్తీక పౌర్ణమి సహా ముఖ్యమైన రోజులివే!

త్రేతాయుగంలో

రావణ సంహారం అనంతరం సతీసమేతంగా అయోధ్యకు చేరుకున్నాడు శ్రీరాముడు. అందుకే దసరా సందర్భంగా రావణ దహనం కార్యక్రమం నిర్వహిస్తారు..దసరా అనంతరం వచ్చే పండుగ దీపావళి. రావణ సంహారం తర్వాత అయోధ్యకు చేరుకోవడంతో ప్రజలంతా దీపాలు వెలిగించి, బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారని చెబుతారు. 

Also Read: ధనత్రయోదశి రోజు బంగారం కొనుగోలు చేయాలా!

లక్ష్మీ -కుబేర  మంత్రం
ఓం శ్రీం శ్రియై నమః

ఓం హ్రీం శ్రీం లక్ష్మీభ్యో నమః

ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలయే ప్రసిద్ ప్రసిద్ ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీయై నమః

కుబేర ప్రార్థనా మంత్రం
దండాయ నమస్తుభ్యము నిధిపద్మధిపాయ చ
త్వత్ప్రసాసేన్ ధంధన్యాదిసంపదః..

మహాలక్ష్మి మంత్రం
ఓం శ్రీ హ్రీం శ్రీం కమలే కమలయే ప్రసిద్ ప్రసిద్
ఓం శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీయై నమః.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ustad Zakir Hussain Passed Away: తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
Bigg Boss 8 Telugu Winner: బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ ఫిక్స్ - ఇంతకీ గెలిచింది ఎవరు?
బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ ఫిక్స్ - ఇంతకీ గెలిచింది ఎవరు?
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
Best Chess Apps: ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ustad Zakir Hussain Passed Away: తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
Bigg Boss 8 Telugu Winner: బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ ఫిక్స్ - ఇంతకీ గెలిచింది ఎవరు?
బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ ఫిక్స్ - ఇంతకీ గెలిచింది ఎవరు?
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
Best Chess Apps: ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
TSPSC Group 2 Exam: సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
Manchu Manoj Vs Manchu Vishnu: మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
YSRCP On One Nation One Election: 2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
Telangana Latest News : తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
Embed widget