అన్వేషించండి
Delhi Rains: భారీ వర్షాలకు కుప్పకూలీన ఢిల్లీ ఎయిర్ పోర్ట్ టెర్మినల్- ఒకరు మృతి పలువురికి గాయాలు
IGI Airport Accident:భారీ వర్షాలు ఢిల్లీని ముంచెత్తాయి. ఇన్నాళ్లు ఉక్కపోతతో అల్లాడిపోయిన జనం ఇప్పుడు వర్షాలతో ఇబ్బంది పడుతున్నారు. విమానాశ్రయంలో ప్రమాదం జరిగి ఒకరు మృతి చెందారు.

భారీ వర్షాలకు దెబ్బతిన్న ఢిల్లీ ఎయిర్ పోర్ట్ టెర్మినల్- ఒకరు మృతి పలువురికి గాయాలు
1/5

భారీ వర్షాలు ఢిల్లీని ముంచెత్తాయి. ఇన్నాళ్లు ఉక్కపోతతో అల్లాడిపోయిన జనం ఇప్పుడు వర్షాలతో ఇబ్బంది పడుతున్నారు. వర్షాలు కారణంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ 1లో ఘోర ప్రమాదం జరిగింది.
2/5

ఢిల్లీలో కురిసిన భారీ వర్షాలకు విమానాశ్రయంలోని టెర్మినల్-1 దెబ్బతింది. ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందగా ఆరుగురు గాయపడ్డారు.
3/5

వర్షాలు ఇటు ప్రమాదంతో విమాన ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎయిరిండియా, ఇండిగో, స్పైస్ జెట్ వంటి సంస్థలు తమ పలు విమానాలను రద్దు చేసుకున్నాయి.
4/5

భారీ వర్షాలకు ఇందిరాగాంధీ టెర్మినల్ 1 పైకప్పు కూలింది. ఉదయం కురిసిన భారీ వర్షానికి టెర్మినల్ 1 పైకప్పు అకస్మాత్తుగా ఊడి పడింది. అక్కడ ఉన్న మనుషులకు గాయాలు అయ్యాయి. కార్లు ధ్వంసం అయ్యాయి.
5/5

ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా ఆరుగురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ప్రమాదం గురించి తెలిసన వెంటనే రెస్క్యూ టీం అక్కడకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. సమాచారం మేరకు క్షతగాత్రులను రక్షించి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Published at : 28 Jun 2024 09:29 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
అమరావతి
రాజమండ్రి
నల్గొండ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion