అన్వేషించండి
Satyabhama Serial February 1st Episode Highlights: చెలరేగిపోయిన సంధ్య.. సత్యకు కౌంట్ డౌన్ స్టార్ట్ చేసిన మహదేవయ్య - సత్యభామ ఫిబ్రవరి 1 ఎపిసోడ్ హైలెట్స్!
Satyabhama Today Episode: క్రిష్.. మహదేవయ్య కొడుకు కాదని సత్య బయటపెడదాం అనుకుంటే ప్లాన్ రివర్సైంది. MLA గా పోటాపోటీగా బరిలో దిగారు మామా కోడలు.. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే....

Satyabhama Serial Today February 1st Highlights (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
1/9

శివాలయంలో సంధ్య, సంజయ్ కి క్రిష్ పెళ్లిచేసేస్తాడు. అప్పుడే సత్య కాల్ చేసి కంగారుపడుతుంటే..వాళ్లిద్దరూ నా దగ్గరే ఉన్నారు నువ్వు మీ ఇంట్లో అందర్నీ తీసుకుని ఇంటికి రా అక్కడ మాట్లాడుకుందాం అని కాల్ కట్ చేస్తాడు క్రిష్
2/9

పెళ్లి దండలతో ఇంటికి వచ్చిన సంధ్య, సంజయ్ ని చూసి షాక్ అవుతారు మహదేవయ్య, భైరవి. ప్లాన్ మొత్తం ఖరాబు చేశాడంటూ మహదేవయ్య రగిలిపోతాడు. సంధ్యను పెళ్లి చేసుకుంటానని చెప్పగానే సత్య ఆ స్వీట్స్ విసిరికొట్టింది..వీడికి సిగ్గులేకుండా ఎలా పెళ్లి చేసుకుని వచ్చాడని నిలదీస్తుంది భైరవి
3/9

మీ పెదనాయన కావాలంటే లోపలకు రా.. ఇది కావాలంటే బయటకు పో అంటుంది. సంజయ్ చక్రవర్తి బాబాయ్ కొడుకు వాడి ఇష్టాలపై మనకు హక్కులేదంటాడు క్రిష్. అలా అయితే వాళ్లింటికే పొమ్మను అంటుంది జయమ్మ.
4/9

ఇప్పుడు కొత్త పంచాయతీ పెట్టకు అంటాడు మహదేవయ్య. మీ తమ్ముడిని పిలిపించు సంగతి తేల్చుకుందాం అంటుంది భైరవి. ఏం చేయాలి ఇప్పుడు అని ఆలోచనలో పడతాడు మహదేవయ్య
5/9

సంజయ్ ఇక్కడే ఉంటాడంటాడు మహదేవయ్య. నీకు హారతిచ్చే దిక్కులేదు లోపలకి వచ్చెయ్ అంటాడు క్రిష్. రేణుక సంద్యను దేవుడి గదిలోకి తీసుకెళ్తుండగా సత్య ఎంట్రీ ఇస్తుంది.
6/9

నువ్వే దగ్గరుండి చేశావ్ కదా అని నిలదీస్తుంది సత్య. మా బిడ్డను మాకు అప్పగించండి బాబూ అంటాడు విశ్వనాథం. మాకు ఈ పెళ్లి ఇష్టంలేదని చెప్పిన తర్వాత ఎందుకు చేశారు బావగారు అంటాడుహర్ష. విశాలాక్షి సంధ్యను లాక్కెళుతుంటే..నా ఇష్టం అన్న సంధ్యను లాగిపెట్టి కొడుతుంది.
7/9

నీ మొండితనంతో నన్ను వేధించకు నీ జీవితం నువ్వు చూసుకో అంటుంది సంధ్య. మీకు అక్క అంటే ఇష్టం అందుకే తన ప్రేమను ఒప్పుకున్నారు, నేనంటే ఇష్టం లేదు నా ప్రేమను అడ్డుకుంటున్నారని బాధపడుతుంది. ఈ కుటుంబంపై కోపం మీకుంటే అక్కను కూడా తీసుకుని పదండి నేనూ వస్తానంటుంది
8/9

విశాలాక్షి సంధ్యను బలవంతంగా తీసుకెళుతుంటే సంజయ్, క్రిష్ అడ్డుపడతారు. నా చెల్లెలు ఒంటరిగా బతికినా పర్వాలేదు సంజయ్ కి ఇవ్వను అంటుంది సత్య.
9/9

ఇంతలో పోలీసులు వస్తారు. నా కుటుంబం వల్ల మాకు ముప్పు ఉందని పోలీసులకు కంప్లైంట్స్ ఇస్తుంది సంధ్య. అంతా షాక్ అవుతారు
Published at : 01 Feb 2025 09:42 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
అమరావతి
సినిమా
నల్గొండ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion