అన్వేషించండి
Brahmamudi February1st Episode Highlights: కళ్యాణ్ కి మంచి రోజులు, అపర్ణకి రాజ్ కావ్య చెప్పబోయే సమాధానం ఏంటి - బ్రహ్మముడి ఫిబ్రవరి 1 ఎపిసోడ్ హైలెట్స్!
Brahmamudi Serial February1st Episode: కావ్య పేరుమీద ఆస్తి మొత్తం రాసేసిన సీతారామయ్య... ష్యూరిటీ సంతకం పెట్టి కొత్త కష్టాలు తీసుకొచ్చాడు. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

Brahmamudi February1 Episode (Disney Plus Hotstar/ Star Maa)
1/9

రాజ్ ఎవరికో కాల్ చేసి వీసా కావాలని, తన భార్యకు పాస్ పోర్ట్ కావాలని అడుగుతాడు.ఇదంతా విన్న రుద్రాణి వీళ్లు ఇంట్లో ఉన్నదంతా ఊడ్చేసి విదేశాల్లో సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారని చిచ్చు పెట్టేందుకు సిద్ధమవుతుంది
2/9

రూమ్ లోకి వెళ్లేసరికి కావ్య 30 రోజుల్లో ఇంగ్లీష్ బుక్ చదువుతుంది. ఎందుకు అని అడిగితే మీటింగ్స్ లో మాట్లాడాలి కదా ఇంగ్లీష్ రావాలి కదా అంటుంది. ఇది విన్న రుద్రాణి కన్ఫామ్ చేసుకుంటుంది
3/9

ధాన్యలక్ష్మి దగ్గరకు వెళ్లి నీకో ముఖ్యమైన విషయం అని మొదలుపెడుతుంది. ఇన్నాళ్లూ ఆస్తులు కరిగించేసి ఏం చేస్తున్నారో అనుకున్నాం కదా వాటిని డాలర్లుగా మార్చేస్తున్నారు. విదేశాలకు చెక్కేయాలని ప్లాన్ చేసుకున్నారు అంటుంది. నన్ను బకరా చేయకు నీ పని నువ్వు చేసుకో అని షాక్ ఇస్తుంది ధాన్యలక్ష్మి
4/9

పాస్‌ఫోర్టు, వీసా కోసం ఏజెంట్ ఫోన్ చేస్తే ఆ డాక్యుమెంట్స్ తీసుకునేందుకు ఇంటికిరమ్మని రాజ్ అంటాడు. మనం ఆఫీసుకి వెళుతున్నాం కదా అక్కడికే రమ్మని చెప్పండి అంటుంది కావ్య. మనం ఆఫీస్ నుంచి బ్యాంకుకి వెళతాం కదా అందుకే ఇక్కడకు రమ్మన్నాను అనగానే..సరే అంటుంది కావ్య. ఆ డాక్యుమెంట్స్ స్వప్నకి ఇచ్చేసి ఏజెంట్ కి ఇమ్మని చెప్పి వెళ్లిపోతారు.
5/9

కళ్యాణ్ రాసిన పాటను చూసి రైటర్ మెచ్చుకుంటాడు. ఇంతలో మ్యూజిక్ డైరెక్టర్ రావడంతో మీకు కావాల్సిన పాట ఇదిగో అని ఇస్తాడు. అది చూసిన మ్యూజిక్ డైరెక్టర్ ఇది మీరే రాశారా అంటే అవును యూత్ కోసం స్టైల్ మార్చానంటాడు.
6/9

రైటర్ వెళ్లిపోతుండగా వెనుకే వెళ్లిన కళ్యాణ్ పాటలో కొన్ని మార్పులు చేర్పులు చెబుతాడు.ఇది నువ్వే రాశావ్ అని నాకు తెలుసు త్వరలోనే కలసి పనిచేద్దాం అని మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ కి గుడ్ న్యూస్ చెబుతాడు...
7/9

ఇంగ్లీష్ బుక్ తో కుస్తీ పట్టావ్ కదా ఏం నేర్చుకున్నావ్ అని అడుగుతాడు రాజ్. చిన్నప్పుడు మా పెద్దమ్మ చెప్పిన సామెతలను ఇంగ్లీష్‌లోకి ట్రాన్స్ లేట్ చేస్తున్నా అంటుంది. నేనో సామెత చెప్తాను మీరు తెలుగులో చెప్పండి అంటుంది. డస్ట్ ఇన్ డైమండ్ అనగానే ఆశ్చర్యంగా చూస్తాడు రాజ్..మట్టిలో మాణిక్యం అంటుంది. దయచేసి ఇలాంటి సామెతలు ఇంగ్లీష్ లోకి ట్రాన్స్ లేట్ చేయకు అని చెబుతాడు
8/9

డాక్యుమెంట్స్ తీసుకునేందుకు ఏజెంట్ రావడంతో..నేను చెప్పింది నిజమే కదా ధాన్యలక్ష్మి అని గొడవ మొదలుపెడుతుంది రుద్రాణి. వాళ్లు మూలాలు మర్చిపోరు లేనిపోని అనుమానాలు సృష్టించవద్దంటాడు సుభాష్. మీరంతా సెటిలవ్వాలి మిగిలినవాళ్లు ఏమైనా పర్వాలేదా అని రుద్రాణి నిలదీస్తుంది
9/9

బ్రహ్మముడి ఫిబ్రవరి 03 సోమవారం ఎపిసోడ్ లో.. నువ్వు ఆస్తులను డాలర్లుగా మార్చుతున్నావని మాకు తెలియదు అనుకున్నావా అని అపర్ణ ఫైర్ అవుతుంది. రాజ్ కావ్య షాక్ అవుతారు...
Published at : 01 Feb 2025 08:35 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
ఇండియా
సినిమా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion