అన్వేషించండి

Delhi Elections 2025: ఢిల్లీలో మ్యాజిక్​ ఫిగర్​ దాటిన బీజేపీ, హస్తినలో ఆప్ కోటకు బీటలు!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్​ కొనసాగుతోంది. అయితే అధికారంలో ఉన్న ఆప్​ లీడ్​లో వెనుకబడగా.. బీజేపీ దూసుకెళుతోంది. బీజేపీ 44 స్థానాల్లో ఆధిక్యంతో మ్యాజిక్​ ఫిగర్​ను దాటింది.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్​ కొనసాగుతోంది. అయితే అధికారంలో ఉన్న ఆప్​ లీడ్​లో వెనుకబడగా.. బీజేపీ దూసుకెళుతోంది. బీజేపీ 44 స్థానాల్లో ఆధిక్యంతో మ్యాజిక్​ ఫిగర్​ను దాటింది. ధిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గానూ ఈ నెల 5న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఎలక్షన్​ కౌంటింగ్​ శనివారం 8 గంటల నుంచి ప్రారంభమైంది. కాగా కౌంటింగ్​లో బీజేపీ లీడింగ్​లో దూసుకెళుతోంది. 

26 స్థానాల్లోనే ఆమ్​ ఆద్మీ
ఉదయం 10 గంటల సమయానికి బీజేపీ 44 స్థానాల్లో ముందంజలో ఉంది. ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు కావాల్సిన 36 మ్యాజిక్​ ఫిగర్​ను దాటేసింది. అధికారంలో ఉన్న ఆమ్​ ఆద్మీ పార్టీ కేవలం 26 స్థానాల్లో మాత్రమే లీడింగ్​లో ఉంది. కాంగ్రెస్​తోపాటు ఇతర పార్టీలు ఇంకా ఖాతా కూడా తెరవలేదు.

వెనుకబడ్డ కేజ్రీవాల్​, సీఎం ఆతిషీ
ఆమ్​ ఆద్మీ పార్టీ ప్రముఖులు కూడా వెనుకంజలో ఉండడం గమనార్హం. ఆ పార్టీ చీఫ్​ అరవింద్ కేజ్రీవాల్​, ముఖ్యమంత్రి ఆతిషీతోపాటు మరికొందరు మంత్రులు కూడా కౌంటింగ్​లో వెనుకబడిపోయారు. ​న్యూ ఢిల్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి పర్​వేశ్​ వర్మ.. అరవింద్​ కేజ్రీవాల్​పై స్వల్ప ఓట్ల తేడాతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక కాల్​కాజీ స్థానంలో ఢిల్లీ సీఎం ఆతిషీపై బీజేపీ అభ్యర్థి రమేశ్​ బిధూరి ముందంజలో ఉన్నారు.

బీజేపీకి 50 శాతానికి పైగా ఓట్లు
కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన డేటా ప్రకారం, భారతీయ జనతా పార్టీకి ఇప్పటివరకు 50 శాతానికి పైగా ఓట్లు వచ్చాయి. అదే సమయంలో, ఆమ్ ఆద్మీ పార్టీకి 40 శాతానికి పైగా ఓట్లు వచ్చాయి. ఈ లీడ్​ ఇలాగే కొనసాగితే బీజేపీ చరిత్రాత్మక విజయం సాధించినట్లే. 28 ఏళ్ల తర్వాత ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. 

ఎగ్జిట్​ పోల్స్​ అంచనా ప్రకారమే..
ఫిబ్రవరి 5న ఎన్నికలు ముగిసిన తర్వాత ఎగ్జిట్​ పోల్స్​ అంచనా ప్రకారమే ఫలితాలు వస్తుండడం విశేషం. పీపుల్స్ ఇన్‌సైట్‌ సర్వే ప్రకారం మొత్తం 70 స్థానాలకుగాను బీజేపీ కూటమి 40 నుంచి 44 స్థానాల్లోనూ విజయం సాధిస్తుందని, ఆమ్‌ఆద్మీ 25 నుంచి 29 స్థానాలు, కాంగ్రెస్ ఒక స్థానం గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. 

బీజేపీ కూటమికి 39 నుంచి 45, ఆమ్‌ఆద్మీకి 22 నుంచి 31, కాంగ్రెస్ సున్నా లేదా రెండు స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని టైమ్స్‌ నౌ అంచనా వేసింది. పీ-మార్క్‌ సర్వే ప్రకారం బీజేపీ కూటమి 39 నుంచి 49 స్థానాల్లోనూ, ఆమ్‌ఆద్మీ 21 నుంచి 31 సీట్లు, కాంగ్రెస్ సున్నా నుంచి 1 స్థానం గెలిచే అవకాశం ఉందని అంచనా వేసింది. పోల్‌ డైరీ సర్వే ప్రకారం బీజేపీ కూటమికి 42 నుంచి 50, ఆప్‌నకు 18 నుంచి 25, కాంగ్రెస్‌ సున్నా నుంచి 2 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. చాణక్య స్ట్రాటర్జీస్‌ బీజేపీ కూటమి 39 నుంచి 44 స్థానాల్లోనూ, ఆప్‌ 25 నుంచి 28 స్థానాలు., కాంగ్రెస్ 2 నుంచి 3 చోట్ల విజయం స్థాదిస్తుందని పేర్కొంది.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NDA Convenor Post Revival: ఎన్డీఏ కన్వీనర్ పదవి మళ్లీ తెరపైకి.. బీజేపీ హైకమాండ్ వ్యూహం ఏమిటి? నిజంగానే చాన్స్ ఉందా?
ఎన్డీఏ కన్వీనర్ పదవి మళ్లీ తెరపైకి.. బీజేపీ హైకమాండ్ వ్యూహం ఏమిటి? నిజంగానే చాన్స్ ఉందా?
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Embed widget