Balakrishna Akhanda 2: ఈ శివరాత్రికి శివ'తాండవ'మేనా! - బాలకృష్ణ 'అఖండ 2' ఫస్ట్ లుక్ అప్పుడేనా?
Akhanda 2: బాలయ్య, బోయపాటి కాంబోలో వస్తోన్న 'అఖండ 2' సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది. ఈ సినిమాలో బాలయ్య ఫస్ట్ లుక్ అతి త్వరలోనే విడుదల చేసేందుకు మూవీ టీం సన్నాహాలు చేస్తోంది.

Akhanda 2 First Look: నందమూరి బాలకృష్ణ (Balakrishna), బోయపాటి శీను కాంబోలో తెరకెక్కిన 'అఖండ' (Akhanda) మూవీ.. అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. తమన్ (Thaman) మ్యూజిక్‌తో పాటు బాలకృష్ణ నట విశ్వరూపంతో థియేటర్లు దద్దరిల్లాయి. ఈ సినిమాకు సీక్వెల్‌గా 'అఖండ 2: తాండవం' (Akhanda 2) తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. 14 రీల్స్ బ్యానర్‌పై రామ్ అచంట, గోపి అచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నందమూరి ఎం.తేజస్విని సమర్పిస్తున్నారు. ఈ పాన్ ఇండియా సినిమాపై ఇప్పుడో క్రేజీ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోన్న ఈ సినిమా నుంచి బాలకృష్ణ ఫస్ట్ లుక్ విడుదల చేసేందుకు మూవీ టీం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో విజయ్ దేవరకొండ - కొత్త సినిమా టైటిల్ అదేనా?, టీజర్ ఎప్పుడంటే?
లుక్ అప్పుడేనా..!
ఈ నెల చివరిలో అంటే మహా శివరాత్రి సందర్భంగా తొలి లుక్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో బాలయ్య రెండు భిన్నమైన పాత్రల్లో కనువిందు చేయనున్నారు. సంయుక్తా, ప్రగ్యా జైస్వాల్ కీలక పాత్రల్లో నటించనున్నారు. ఈ సినిమా దసరా సందర్భంగా సెప్టెంబర్ 25వ తేదీన థియేటర్లలోకి రానుంది. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. కాగా, ఇటీవలే ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమమైన మహా కుంభమేళాలో ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభించారు. సంచలన విజయం సాధించిన 'అఖండ'కు దీటుగా సినిమాను రూపొందిస్తున్నారు. బాలకృష్ణ, బోయపాటి కాంబోలో వస్తోన్న నాలుగో చిత్రమిది. అంతకు ముందు ఆయన సింహా, లెజెండ్, అఖండ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు అందుకున్నాయి.
సంక్రాంతికి వచ్చిన 'డాకు మహారాజ్' చిత్ర విజయంతో బాలయ్య ఫుల్ జోష్‌లో ఉన్నారు. తమన్ మ్యూజిక్ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలిచింది. బాలయ్య మాస్ జాతరతో ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో పండుగ చేసుకున్నారు. బాబీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ సొంతం చేసుకుంది.
త్వరలోనే సన్మాన వేడుక
కాగా.. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే బాలకృష్ణకు పద్మభూషణ్ పురస్కారం ప్రకటించిన సంగతి తెలిసిందే. 'ఈ పురస్కారం నాకు, మా కుటుంబానికే కాదు. తెలుగు పరిశ్రమకు తెచ్చిన గౌరవం' అని బాలయ్య అన్నారు. ఈ అవార్డు తనపై బాధ్యతను మరింత పెంచిందని చెప్పారు. ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు బాలకృష్ణ నివాసానికి వెళ్లి ఆయనకు అభినందనలు తెలిపారు. ఇండస్ట్రీలోని 10 అసోసియేషన్స్ అండ్ యూనియన్స్ కలిసి బాలయ్యకు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. వారంతా కలిసి బాలకృష్ణ కోసం త్వరలోనే చిత్ర పరిశ్రమ తరఫున ఓ సన్మాన వేడుక నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పి.భరత్ భూషణ్, కార్యదర్శి కేఎల్ దామోదర్ ప్రసాద్, నిర్మాతల మండలి కార్యదర్శి టి.ప్రసన్నకుమార్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు మాదాల రవి పాల్గొన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

