అన్వేషించండి
Tollywood Train Scenes: టాలీవుడ్ ఆన్ ‘ట్రాక్’ - రైలు బండి, మనోళ్ల ఫేవరెట్ అండి!

టాలీవుడ్ ఆన్ ‘ట్రాక్’ - రైలు బండి, మనోళ్ల ఫేవరెట్ అండి!
1/16

రైల్లో ప్రయాణమంటే చాలామందికి ఇష్టం. కిటికీ పక్కన కూర్చొని ప్రకృతి అందాలను చూస్తూ సాగిపోతుంటే భలే హాయిగా ఉంటుంది. రైలు కొండలు, లోయలు, వంతెనల మీదుగా వెళ్తుంటే భలే థ్రిల్‌గా ఉంటుంది. అందుకే, మన ‘టాలీవుడ్’కు కూడా రైలు బండి అంటే చాలా ఇష్టం. పైగా, రైల్లో షూటింగ్ జరుపుకున్న చాలా చిత్రాలు విజయం కూడా సాధించాయి. రైల్లో తీసే పాటలకైతే పేరే పెట్టక్కర్లేదు. ఇక పోరాట సన్నివేశాలైతే ఎంతో ఉత్కంఠంగా ఉంటాయి. బాలయ్య బాబు తొడ కొడితే చాలు రైలు మొత్తం వెనక్కి వెళ్లిపోయే సీన్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. తాజా ‘రాధే శ్యామ్’లో కూడా చాలా సన్నివేశాలను రైల్లోనే చిత్రీకరించారు. ఆ సీన్స్ చాలా థ్రిల్లింగ్‌గా ఉంటాయని అంటున్నారు. దీని తర్వాత విడుదల కానున్న రామ్ చరణ్, ఎన్టీఆర్‌ల చిత్రం RRRలో కూడా రైలు సన్నివేశాలు ఉండనున్నాయి. ఈ రెండు చిత్రాల్లో స్టీమ్ ఇంజిన్ రైళ్లు కనిపించనున్నాయి. ఇవి చూసేందుకు భలే అందంగా, ఆహ్లాదకరంగా ఉంటాయి. గతంలో ‘ఆరెంజ్’, ‘అతడు’, ‘24’ తదితర చిత్రాల్లో కూడా ఈ స్టీమ్ ఇంజిన్లు కనిపించాయి. టాలీవుడ్‌లో ముఖ్యమైన సన్నివేశాలన్నీ రైల్లోనే చిత్రీకరించిన సినిమాలు ఇంకా చాలానే ఉన్నాయి. ‘వెంకీ’, ‘మర్యాద రామన్నా’, ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలోని కామెడీ సన్నివేశాలన్నీ రైల్లోనే చిత్రీకరించారు. జగపతి బాబు, ఇంద్రజ నటించిన ‘ఓ చిన్న మాట’ సినిమా మొత్తం రైల్లోనే సాగుతుంది. ఇంకా చాలా సినిమాల్లో రైలు సన్నివేశాలు ఉన్నాయి. కానీ, వాటిలో మనకు గుర్తుండిపోయేవి కొన్నే. మరి ఆ చిత్రాలేమిటో చూసేయండి మరి.
2/16

‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’లో రకుల్, సందీప్ కిషన్
3/16

‘లౌక్యం’లో గోపీ చంద్, రకుల్ ప్రీత్ సింగ్
4/16

‘మర్యాద రామన్న’లో సలోని, సునీల్
5/16

‘తొలి ప్రేమ’లో వరుణ్ తేజ్, రాశీ ఖన్నా
6/16

‘వర్షం’ సినిమాలో త్రిష
7/16

‘ఆర్య’ సినిమాలో అల్లు అర్జున్
8/16

‘సరిలేరు నీకెవ్వరు’లో మహేష్ బాబు, రష్మిక
9/16

‘వెంకీ’ సినిమాలో బ్రహ్మానందం, రవితేజ
10/16

‘మిరపకాయ్’లో స్వాతి
11/16

‘అతడు’లో త్రిషా, మహేష్ బాబు
12/16

‘24’లో నిత్య మీనన్, సూర్య
13/16

‘వంశీ’లో మహేష్ బాబు
14/16

‘ఆరెంజ్’ సినిమాలో జెనీలియా, రామ్ చరణ్
15/16

RRRలో రామ్ చరణ్, ఎన్టీఆర్
16/16

‘రాధే శ్యామ్’ చిత్రంలో పూజా హెగ్డే, ప్రభాస్
Published at : 10 Mar 2022 04:05 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
తెలంగాణ
రాజమండ్రి
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion