అన్వేషించండి
Varun Tej-Lavanya: పెళ్లయిన ఇన్నాళ్లకు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మెగా జంట
Varun Tej-Lavanya: వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లయిన ఇన్నాళ్లకు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తిరుమలలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి
1/6

Varun Tej-Lavanya Visit Tirumala: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆయన భార్య లావణ్య త్రిపాఠి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ (ఆగస్టు 14) ఉదయం జంటగా స్వామివారి సేవలో పాల్గొన్నారు.
2/6

బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో వీఐపీ దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వేదపండితులు ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
3/6

మంగళవారం ఉదయమే ఈ జంట తిరుపతి వెళ్లిన అక్కడ కొండపై బస చేసి ఈ రోజు ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. ఇక పెళ్లైన మొదటి సారి ఈ జంట తిరుపతి సందర్శించారు.
4/6

కాగా గతేడాది నవంబర్ 1న వీరి పెళ్లి ఇటలీలో జరిగిన సంగతి తెలిసిందే. కొంతకాలం సీక్రెట్ రిలేషన్‌లో ఉన్న ఈ జంట పెద్ద సమక్షంలో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.
5/6

దాదాపు ఆరేళ్ల డేటింగ్ అనంతర ఏడడుగులు వేశారు. ఇక పెళ్లి తర్వాత వరుణ్ తేజ్ తన సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయాడు. ఆ తర్వాత ఏపీ ఎన్నికల నేపథ్యంలో తన బాబాయ్ పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు.
6/6

ప్రస్తుతం కాస్తా విరామం దొరికడంతో భార్యతో కలిసి నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం బయట ఈ జంటను చూసి భక్తులు వారితో సెల్ఫీ తీసుకునేందుకు ఆసక్తి చూపారు.
Published at : 14 Aug 2024 07:04 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
నిజామాబాద్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion