Amrutham Serial: పాపం.. అమృతం, అంజిని చితక్కొట్టేశారుగా.. - ఇందా అంటూ 'గోవిందా' అయిపోయారు, నవ్వుల ఎపిసోడ్ చూసేయండి
Amrutham Serial Review: ఒకప్పటి అందరి హార్ట్ ఫేవరెట్ సీరియల్ 'అమృతం'. అంజి, అమృతం అల్లరి కామెడీని తలుచుకుంటూ ఇప్పటికీ నవ్వుకుంటారు. ఆ హాస్య రసామృతం ఎపిసోడ్స్ మళ్లీ మీకోసం..

Amrutham Serial Episode 4 Review: 90sలో వచ్చిన 'అమృతం' సీరియల్ (Amrutham Serial) అంటే ఇప్పటికీ చాలామందికి ఫేవరెట్. గుణ్ణం గంగరాజు దర్శకత్వం రూపొందించిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌లో శివాజీరాజా, నరేశ్, హర్షవర్ధన్, గుండు హనుమంతరావు, వాసు ఇంటూరి, నారిపెద్ది శివన్నారాయణ, నరేశ్, రాగిణి, ఝూన్సీ కీలక పాత్రలు పోషించారు. అంజి, అమృతం తమ అల్లరి కామెడీ పంచులతో నవ్వించే తీరుకు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఒత్తిడిలో ఉన్నప్పుడు ఈ సీరియల్ చూస్తూ కాస్త రిలాక్స్ ఫీల్ అవుతుంటారు చాలామంది.
'ఇందా గోవిందా.. ఎంత పని చేసిందా..'
అమృతం, సంజీవని ఇంట్లో ఉండగా.. అంజి ఆయాసపడుతూ అక్కడకు వస్తాడు. మార్కెట్‌లో 'ఇందా గోవిందా' అనే కంపెనీ కొత్తగా పెట్టారని.. అందులో మనం డబ్బులు జమ చేస్తే.. దానికి రెట్టింపు డబ్బులు వెంటనే తీసుకోవచ్చని చెబుతాడు. ముందు నమ్మకపోయినా తర్వాత సంజీవని చెప్పడంతో అమృతం.. డబ్బులు తీసుకుని అంజితో ఆ కంపెనీకి వెళ్తాడు. అమృతం, అంజి రూ.5 వేలు ఓ కౌంటర్‌లో డిపాజిట్ చేసి పక్క కౌంటర్‌లోనే రూ.10 వేలు తీసుకుంటారు. అయితే, తీసుకునేటప్పుడు వేగంగా తీసుకుని ఇచ్చేటప్పుడు మాత్రం ఒక్కో నోటు నెమ్మదిగా లెక్కపెడుతూ ఇవ్వడంతో అమృతానికి అనుమానం వస్తుంది. అయితే, పక్కాగా ఉండాలని అలా ఇస్తున్నట్లు కంపెనీ సిబ్బంది చెబుతారు.
ఇక ఆ రోజు ఒంట్లో బాగోలేదంటూ ఆఫీసుకు సెలవు పెట్టేసిన అమృతం.. అంజితో కలిసి మళ్లీ కొంత డబ్బు తీసుకుని ఆ కంపెనీకి వెళ్తాడు. అయితే, అప్పటికే కంపెనీ వద్ద రద్దీ ఉండడంతో క్యూలో తోసుకుంటుంటారు. అదే క్యూలో అమృతం మేనేజర్ అంబుజనాభం సైతం ఉంటాడు. క్యూలో తన మీద పడడంతో అతన్ని అంజి చితక్కొడతాడు. తన మేనేజర్ అని తెలియక అమృతం కూడా ఓ చేయి వేస్తాడు. తర్వాత మేనేజర్ అని తెలుసుకుని బిక్క ముఖం వేస్తాడు. ఇక తనకు వచ్చిన డబ్బులు తీసుకుని మేనేజర్ వెళ్లగా.. అంజి, అమృతం ఇంకా డబ్బులు కావాలనే అలానే క్యూలో ఉంటారు. సరిగ్గా అమృతం వెళ్లే సరికి టైం అయిపోయిందంటూ కౌంటర్ క్లోజ్ చేస్తారు.
పాపం.. చితక్కొట్టేస్తారు..
ఇంటికి వెళ్లిన తర్వాత అంజి.. అమృతంకు ఇప్పుడే వెళ్లి మనం ఆ కంపెనీ షట్టర్ ముందు పడుకుందామని సలహా ఇస్తాడు. అప్పుడు మనమే తర్వాత ముందుగా డబ్బులు తీసుకోవచ్చని చెబుతాడు. దీంతో ఇద్దరూ 'ఇందా గోవిందా' కంపెనీకి వెళ్లి షట్టర్ ముందు నిద్రపోతారు. అయితే, అప్పుడే డబ్బుతో ఉడాయించిన కంపెనీ సిబ్బంది షట్టర్ బయట వీరిని చూసి లోపలికి వెళ్లి పడుకోవాలని చెబుతారు. దీంతో వారు అలానే చేస్తారు. అయితే, ఉదయాన్నే డబ్బులు కట్టిన మిగతా వాళ్లు వచ్చి పడుకున్న వీరిని చూసి తమ డబ్బులు తమకు ఇవ్వాలని వీరిని బెదిరిస్తారు. మేము కంపెనీ వాళ్లం కాదని చెప్పినా వాళ్లతో గొడవ పెట్టుకుని చితక్కొట్టేస్తారు. కట్లతో ఉన్న వీరిని చూసి నవ్వకుండా ఉండగలమా.. పాపం.. ఇందా గోవిందా కంపెనీ ఎంత పని చేసిందో కదా..
Also Read: ఓటీటీలోకి రవీనాటాండన్ కుమార్తె రషా తడానీ 'ఆజాద్' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?





















