Actress Raasi: అనసూయ వివాదంలో మరో ట్విస్ట్.. హీరోయిన్ రాశి ఫైర్, పేరెత్తకుండానే చీవాట్లు !
Anchor Anasuya | యాంకర్ అనసూయపై హీరోయిన్ రాశి ఫైర్ అయ్యారు. ఆమె పేరెత్తకుండానే గతంలో జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ చీవాట్లు పెట్టారు..

హీరో శివాజీ, నటి కమ్ యాంకర్ అనసూయ మధ్య నడుస్తున్న వివాదం ఇప్పటికీ హాట్ హాట్ గానే ఉంది. ఇందులో ఎవరి వెర్షన్ వారికుంది. ఎవరిని సపోర్ట్ చేసేవారు వారికున్నారు. అయితే ప్రధానం గా రెండు వైపులా వాడుతున్న భాష పట్ల మాత్రం సొసైటీ నుండి తీవ్రమైన వ్యతిరేకత ఉన్న మాట మాత్రం నిజం. సోషల్ మీడియాపై నియంత్రణ లేదన్న ఒకేఒక్క కారణం తో ఇష్టం వచ్చినట్టు అసభ్య కరమైన పదజాలం వాడుతూ యూత్ నీ, వారి మైండ్స్ ని కలుషితం చేస్తున్నారు ఇరువైపులా మద్దతు పలికే యూట్యూబర్ లూ, ఇన్ఫ్లుయెన్స్ ర్లు. సరే బూతు పదజాలాల మాటలు అలా ఉంచితే ఇప్పుడు ఈ వివాదం లోకి హీరోయిన్ రాశి ఎంట్రీ ఇచ్చారు. పేరు ఎత్త కుండానే అనసూయ ని చెడుగుడు ఆడేశారనే చెప్పాలి.
'నా గురుంచి అ మాట ఎలా వాడావు లేడీ యాంకరూ "అంటున్న రాశి
శివాజీ - అనసూయల వివాదం మొదలైనప్పటి నుండీ గతంలో అనసూయ యాంకర్ గా చేసిన ఒక షో లోని కొన్ని క్లిప్స్ సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్నాయి. అందులో ఒక నటుడు "రాశి ఫలాలు " అనే మాట వాడగా అనసూయ " నువ్వు రాశి *** ఫలాలు గురించి మాట్లాడుతున్నావా " అంటూ అడగడం ఉంది. ఈ క్లిప్ ను విపరీతం గా సర్క్యూలేట్ చేస్తూ అనసూయ ను ట్రోల్ చేస్తున్నారు ఆమెను విమర్శించేవారు.అయితే ఈ సీన్ లోకి ఇప్పుడు స్వయంగా హీరోయిన్ రాశి ఎంట్రీ ఇచ్చారు. శివాజి వాడిన పదాలు తప్పు అంటూనే అనసూయ తనపై వాడిన లాంగ్వేజ్ ఫై తీవ్ర అభ్యంతరం తెలిపారు. "ఆ లేడీ యాంకర్ " అంటూ పేరు ఎత్త కుండానే ఆమెనూ, ఆ టైం లో ఆ షోలో జడ్జ్ లుగా ఉండి అనసూయ వాడిన పదాలకు నవ్విన వారిపైనా ఫైర్ అయ్యారు.
ఆ క్లిప్ ను తన భర్త తనకు చూపించడం తో బాధకు లోనయ్యా అని చెబుతూనే లీగల్ గా కూడా కేస్ వేద్దామని అనుకున్నా తన తల్లి వారించడం తో ఆగానని తెలిపారు. ఎందుటి వారికి నీతులు చెప్పే ముందు మనం సరిగ్గా ఉండాలి అనే అర్ధం వచ్చేలా ఆమె హితవు పలికారు. సోషల్ మీడియా ను మంచికి వాడాలి గానీ ఇలా చెడుకు కాదని అన్నారు.
పదేళ్లు హీరోయిన్ గా స్టార్ డమ్ చూసిన రాశి
బాలనటి గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన రాశి 1996లో హీరోయిన్ గా మారారు. 2006 వరకూ తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ సినిమా ల్లో నటించారు. ఆమె నటించిన సినిమాల్లో సూపర్ హిట్స్ చాలానే ఉన్నాయి. తెలుగు లో రాశి, తమిళ్ లో మంత్ర పేరుతో పాపులర్ అయిన ఆమె అసలు పేరు విజయ లక్ష్మీ. ప్రస్తుతం పెళ్ళి చేసుకుని సెటిల్ అయిన రాశి గత ఐదేళ్ళు గా తన సొంత యూ ట్యూబ్ ఛానెల్ " raasi visions "నడుపుతూ అభిమానులతో తన అభిప్రాయాలు, ఆలోచనలు పంచుకుంటున్నారు.





















