Sivaji Comments Controrvarsy: శివాజీకి అంతమద్దతు ఎందుకు..? మన సొసైటీ Misogynistic అయిపోతోందా..?
Sivaji:పది రోజులు దాటినా నటుడు శివాజీ వ్యాఖ్యలపై రచ్చ చల్లారడం లేదు. శివాజీ కామెంట్లు, రిగ్రెసివ్, Misogynist అనే వాదనలున్నా.. ఆయనకు మెజారిటీ మద్దతు వస్తోంది. అంటే మన సమాజం Misogynistic అయిపోతోందా..?

Sivaji Comments: Misoginy..చాలా మందికి స్పెల్లింగ్ కూడా తెలియని.. పలకడం కూడా రాని ఈ పదం ఇప్పుడు మన దగ్గర ట్రెండింగ్ అయింది. దీనర్థం ఏంటంటే మహిళల పట్ల తీవ్రమైన వ్యతిరేక భావన, ద్వేషం ఉండటం.. సింపుల్‌గా చెప్పాలంటే పురుష దురహంకారి అనుకోవచ్చు. ఈ మధ్య దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు.. ఆ సందర్భంగా మాట్లాడిన పదాలపై తీవ్ర రచ్చే జరుగుతోంది.కచ్చితంగా శివాజీ మాట్లాడిన మాటలు తప్పు.. వ్యక్తిగత స్వేచ్చకు హద్దులు పెట్టాలనుకుంటున్న ఆయన ఆలోచన కూడా తప్పు. ఇందులో వేరే మాటే లేదు. అయితే ఈ వ్యాఖ్యలు చేసి పదిరోజులు దాటినా దీనిపై ప్రకంపనలు ఇంకా కొనసాగుతున్నాయి. ఆయన మాటలను సమర్థిస్తున్న వారు ఓ వైపు ఉంటే.. అతన్ని మనం పైన మట్లాడుకున్న Misogynyగా పేర్కొన్న వారు ఇంకో వైపు. రెండు వైపులా చర్చ నడుస్తోంది. చాలా సెన్సిటివ్ అయిన ఈ టాపిక్‌పై కామెంట్ రాయడానికి.. చేయడానికి కూడా నేను సందేహించాను.అయితే శివాజీకి అనేక ప్లాట్‌ఫామ్‌లలో దక్కుతున్న మద్దతు.. నన్ను ఆలోచింపజేస్తోంది. ఆందోళనకు గురి చేస్తోంది కూడా..! ఒక్క శివాజీ Misogyny అయితే ఇక్కడ లక్షలమంది శివాజీలు కనిపిస్తున్నారు. మా ప్లాట్‌ఫామ్‌లో అయినా ఇతర సోషల్‌మీడియా సైట్‌లలో అయినా కనిపిస్తున్న కామెంట్లలో మెజారిటీ ఇంకా చెప్పాలంటే.. మెజారిటీ కంటే చాలా ఎక్కువ కామెంట్లు ఆయనకు అనుకూలంగా ఉన్నాయి. అంటే లక్షలమంది MISOGYNIST లు సమాజంలో ఉన్నారా..? మరి మెజారిటీ వాళ్లది కాబట్టి గుర్తించాలా.. ? చర్చించాలా..? సరే ప్రస్తుతానికి క్రిటికల్‌గా గమనిద్దాం..
శివాజీ కామెంట్ల తుపాను
మహిళలు, మహాళా నటులు బయటకు వెళ్లేప్పుడు ఎలాంటి దుస్తులు వేసుకోవాలో చెబుతూ రెండు అభ్యంతరకమైన మాటలు మాట్లాడారు. ఫస్ట్.. అసలు ఎవరు ఎలాంటి దుస్తులు వేసుకోవాలని చెప్పడం మోరల్ పోలీసింగ్. ఆ రెండు పదాలు.. మాట్లాడటం తీవ్ర ఆక్షేపనీయం. దీనిపై వెంటనే భారీ Outrage వచ్చింది.. ఆయన పలుసార్లు క్షమాపణ చెప్పారు, మహిళా కమిషన్ ముందు హాజరై వివరణ కూడా ఇచ్చారు.
అయితే ఇక్కడ అభ్యంతరం చెబుతున్న వాళ్ల ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఆయన అభ్యంతరకరమైన పదాలని వెనక్కు తీసుకున్నారు కానీ.. తన వ్యాఖ్యలను కాదన్నది వారి వాదన. ప్రతిసారీ ఆయన తన మాటలపై స్పందించినప్పుడు, అశ్లీల పదజాలాన్ని మాత్రమే వెనక్కి తీసుకుంటూ, మహిళలకు “మంచి ఉద్దేశంతోనే సలహా ఇచ్చాను” అనే వాదనను మరింత గట్టిగా వినిపించారు. ఇలాంటి అంశాలపై ఎప్పటి నుంచో గళం విప్పుతున్న గాయని చిన్మయి శ్రీపాద ఆన్‌లైన్‌లో వెంటనే స్పందించారు. నటి, ప్రజెంటర్ అనసూయ స్పందన తర్వాత డిబేట్ మొదలైంది. ఆ తర్వాత కొన్నిరోజులకే ప్రకాష్ రాజ్, నాగబాబు కొణిదెల, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వంటి వారు శివాజీ వ్యాఖ్యలను తప్పు పట్టారు.
ఎక్కడా తగ్గని శివాజీ..
..శివాజీ తనపై వస్తున్న విమర్శలపై ఎక్కడా వెనక్కు తగ్గలేదు. తాను "పొరపాటుగా మాట్లాడిన" రెండు పదాలు అన్నారు తప్పితే.. వాఖ్యల సారాంశం విషయంలో పునరాలోచించే పనేలేదన్నారు. అనసూయ వంటి వారిపై Sarcastic గా ఆయన చేసిన కామెంట్లలో కూడా ఆయన ఇంటెన్షన్ ఏంటన్నది అర్థం అవుతోంది. ఇది ఓ అహంకారపూరితమైన పితృస్వామ్య ధోరణి అన్నది ఫెమినిస్టుల అభిప్రాయం. ఆయన ఇంతకు ముందు కూడా ఇలాంటి కామెంట్లు చేసిన విషయాన్ని వాళ్లు హైలైట్ చేస్తున్నారు.
2023లో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7లో పాల్గొన్న సమయంలో కూడా మహిళా కంటెస్టెంట్లపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “నా ఇంట్లో మహిళలు ఇలా ప్రవర్తిస్తే చెంపదెబ్బ కొడతాను, గొంతుపై కాలు వేసి తొక్కేవాడినంటూ.. " ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. కొంతమంది లేడీ కంటెస్టంట్లపై ఆర్గ్యుమెంట్ చేస్తూ.. "వీళ్లని పెళ్లి చేసుకోవడానికి మగాళ్లు భయపడతారు" అంటూ చేసిన కామెంట్లపై అభ్యంతరం వచ్చింది. బిగ్‌బాస్ నాగార్జున ప్రశ్నించినా కూడా శివాజీ వెనక్కు తగ్గలేదు. శివాజీ ఈ మధ్య నటించిన కోర్ట్ మూవీలో మంగపతి పాత్ర కూడా ఇలాంటిదే. ఆయన సినిమా పాత్రను ప్యారలల్‌గా జీవితంలో జీవిస్తున్నారంటూ కామెంట్లు కూడా వినిపించాయి.
శివాజీ చేసింది తప్పే.. మరి ఇంత మద్దతు ఎందుకు..?
ఇదే ఇప్పుడు అసలు ప్రశ్న. తాను మంచి ఉద్దేశ్యంతోనే సలహా ఇచ్చానని ఆయన సమర్థించుకుంటున్నా..ఆయన వ్యాఖ్యలు రిగ్రెసివ్ అని మహిళలను "కట్టడి" చేసే ఉద్దేశ్యంతో చేసినవే అన్నది స్పష్టం. మరి స్వేచ్చకు హద్దులు లేవా..? ప్రొవోకింగ్‌కు పాల్పడటం లేదా అన్న డిబేట్ ఇంకోవైపు నడుస్తోంది. ఇంకా చెప్పాలంటే అదే ఎక్కువ కనబడుతోంది. శివాజీ చేసిన వ్యాఖ్యల కింద కామెంట్లను, ఆయన వ్యతిరేకుల వ్యాఖ్యల కింద కామెంట్లను చూసినా మనకు ఇది అర్థమవుతుంది.
బాగా ప్రస్ఫుటంగా ట్రిగ్గర్ అయిన విషయం.. ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ చానల్ Unsubscribe చేయడం. ఒక్కరోజులోనే ఆరు లక్షలమంది అతని చానల్‌నూ వీడారు. దీంతో Youtube స్వయంగా అతన్ని అలెర్ట్ చేసింది..నువ్వేదో "తప్పు చేస్తున్నావని.."
"నా అన్వేషణ", శివాజీ వ్యాఖ్యలపై వీడియో చేసి, చాలా అగ్రెసివ్‌గా కౌంటర్ ఇచ్చే క్రమంలో. ఆ ఊపులోనే హిందూ దేవతలను vulgar దృక్ఫధంతో ప్రజెంట్ చేశారు. దీనిపై హిందూ సంఘాలు భగ్గుమనడం వల్లే సబ్‌స్క్రైబర్లు వీడుతున్నారనుకోవచ్చు. అయితే అదొక్కటే కారణం కాదు. కచ్చితంగా శివాజీని వ్యతిరేకించడం కూడా ఓ కారణంగా చూడాల్సి ఉంది.
“మోరల్ పోలీసింగ్‌కు ఈ దేశంలో చోటు లేదు. ఎవరు ఏ బట్టలేసుకోవాలో చెప్పడానికి నువ్వెవరూ” ?అంటూ శివాజీని ప్రశ్నించిన నాగబాబుపై Backlash వచ్చింది.
అనసూయ- చిన్మయిపై యుద్ధం
ఇక శివాజీని అవుట్‌రైట్‌గా వ్యతిరేకించిన ఇద్దరు మహిళలు చిన్మయి, అనసూయ. చిన్మయి ఇలాంటి విషయాల్లో ఇన్‌వాల్వ్ అవ్వడం కొత్తకాదు. Metoo మూవ్‌మెంట్ దగ్గర నుంచి ఆమె ఇలాంటి విషయాలపై తన గొంతు విప్పుతూనే ఉన్నారు. . కొన్ని సందర్భాల్లోలో హిందూ iconsపై చేసిన కఠిన వ్యాఖ్యలను తీసుకుని, “వెస్ట్ మెంటల్ ఫెమినిస్ట్, anti-tradition” లేబుల్ వేసారు.
ఇక అనసూయపై అయితే చాలా తీవ్రమైన పదజాలంతోనే విరుచుకుపడుతున్నారు అనసూయ భరద్వాజ్‌పై ప్రస్తుత సోషల్ మీడియా perception ఒక్కరోజులో తయారైంది కాదు. తాను ప్రజెంటర్‌గా ఉన్న టీవీ షోలో ఏళ్ల పాటు వచ్చిన డబుల్ మీనింగ్ జోకులు, బాడీ షేమింగ్ వంటివి ఎన్నాళ్ల నుంచో Meme పేజీలకు మేతగా ఉన్నాయి. ఇక టాలీవుడ్ హీరో Vijay Devarakonda విషయంలో రెండు మూడుసార్లు జోక్యం చేసుకోవడం కూడా ఫ్యాన్స్‌కు ఆగ్రహం తెప్పించింది. కొంతమంది ఫాన్స్ ఆమెకు Attention Seeker అనే ఒక లేబుల్ ఇచ్చి దానిని స్థిరపరిచారు ఇలాంటి సమయంలో అనసూయ చేసిన కామెంట్లు ఆమెపైనే రివర్స్ అవుతున్నాయి. నాగబాబు కామెంట్లను షేర్ చేసే సమయంలో అనసూయ శారీలో ఉన్న ఫోటోలు పెట్టగా..కింద కామెంట్లలో ఆమె గ్లామరస్ వీడియోలు, ఫోటోలను ఆన్‌లైన్ ఆడియన్స్ షేర్ చేశారు.
"vultures, irresponsible media” అంటూ ఆమె స్పందించినప్పుడు.. “ఇప్పుడే నీకుే values జ్ఞాపకం వచ్చాయా? Jabardasthలో double meaning చేసేప్పుడు ethics ఏమయ్యాయి?” అన్న కామెంట్లు వచ్చాయి. Radio Jockey శేఖర్ భాషా లాంటివాళ్లు.. మహిళల అవయువాల విషయంలో శివాజీ మాట్లాడిన ఏ మాటలను అయితే తప్పు పట్టారో.. వాటినే చిన్మయి.. అనసూయ ఉపయోగించారని చూపించారు. ఓ సినిమాపాటలో చిన్మయి ఆ పదాలను పలకడం.. అనసూయ రెండు మూడుసార్లు వాటి గురించే మాట్లాడిన క్లిప్స్ సోషల్‌మీడియాలో వచ్చాయి. ఇదంతా Hypocracy అంటూ జనం కామెంట్ చేశారు.
వ్యక్తిగత జీవితం ఆర్గ్యుమెంట్‌ను డిసైడ్ చేస్తుందా..?
పర్సనల్‌గా అయినా.. ప్రొఫెషనల్‌గా అయినా ఎెలా వ్యవహరిస్తున్నారు అన్నది వాళ్ల చాయిస్. చిన్మయి, అనసూయ ఇద్దరూ తమ ఇష్టాల మేరకు అలా ఉంటున్నారు. అదే తమ వ్యక్తిత్వం అని వాళ్లు చెబుతున్నారు. అది నచ్చనంత మాత్రాన వాళ్లు మాట్లాడిన విషయాన్ని పక్కన పెట్టేయొచ్చా..? Vctim Blaming చేయడం తప్పు.. నటుడు శివాజీ చేస్తోంది అదే అన్న ఆర్గ్యుమెంట్ వీళ్లు బలంగా వినిపిస్తున్నారు. అయితే ఇక్కడ ఓ విషయం చెప్పుకోవాలి. ఇక్కడ message బలం కన్నా, messenger image debateని డామినేట్ చేస్తుంది. ఈ మొత్తం చర్చ వెనుక ఒక deep cultural layer ఉంది. తెలుగు entertainment, meme కల్చర్ సంవత్సరాలుగా మహిళలను ఎలా చూపించిందన్నది.
చాలా టీవీ షోలు, స్కిట్‌లు, మాస్ సినిమాల్లో హీరోయిన్లను, యాంకర్‌లను Entertainment ప్రాపర్టీగా వాడిన ఫలితం ఇది. ఒక మహిళ తన దేహంపై, స్వేచ్ఛపై, సేఫ్టీపై మాట్లాడితే,
చాలా మంది ముందుగా చూసేది: ఆమె డ్రెస్ సెన్స్, ఆమె టీవీ షోలు, అంతకు ముందు కాంట్రవర్సీలు ముందుకు వస్తున్నాయి. వాటి ఆధారంగానే "వీళ్లు స్వేచ్ఛను దుర్వినియోగం చేశారు." అనే ఒక నేరేటివ్‌ను బిల్డ్ చేశారు.
నిజంగానే Freedom దుర్వినియోగం అవుతుందా..?
శివాజీ వైపు నిలబడుతున్న వారు చేస్తున్న ఆర్గ్యుమెంట్ స్వేచ్చను దుర్వినియోగం చేస్తున్నారని..! psychology యాంగిల్‌లో చూస్తే... ఇది self-image defence. అంటే,
అంటే తమ పితృస్వామ్య ధోరణి- (Patriarchal hierarchy)ని ఎవరైనా ప్రశ్నించినప్పుడు, - తనను change చేసుకోవడం కంటే, change కోరుతున్న వారినే discredit చేయడం అన్నమాట. 'ఫేక్ ఫెమినిజం', 'అజెండా'' అటెన్షల్ సీకర్' అనే లేబుల్స్ అన్నీ ఈ defence mechanism లోనివే.ఏదో టీవీ షోలో అనసూయ మాట్లాడిన మాటలు ఇప్పుడు ఆర్గ్యూ చేయడానికి ఓ raw material కావచ్చు, కానీ శివాజీ చేసిన victim-blamingకు అది తగిన సమాధానం అవుతుందా అన్నది ప్రశ్న. ఓ వ్యక్తి ఒకప్పుడు ఏం చేసినా ఓ పాయింట్ చెప్పినప్పుడు.. అతను అప్పుడు చేసిన పనులు ఇప్పుడు పాయింట్ వాల్యూని తగ్గించవు కదా..?
అసలు అది విక్టిమ్ బ్లేమింగ్ కాదు..మహిళల స్వేచ్చను పూర్తిగా తాము గౌరవిస్తున్నామని వారు చెబుతున్నారు. అయితే..మహిళల freedomని theoretically గౌరవిస్తున్నామని చెబుతూనే, practically ఆ freedomని ఎవరు ఉపయోగించాలో, ఎప్పుడు ఉపయోగించాలో, ఎంత వరకు ఉపయోగించాలో నిర్ణయించే హక్కు మాత్రం ఇంకా తమ చేతుల్లోనే ఉంచుకోవాలని కోరుకుంటున్నారా..? అన్నది ముఖ్యమైన అంశం.
మరి స్వేచ్చకు హద్దులు నిజంగానే అక్కర్లేదా..?
ఇది ఇప్పుడు అసలైన ప్రశ్న. శివాజీ లాంటి వాళ్లని ప్రశ్నిస్తున్న అనసూయ, చిన్మయి లాంటి వాళ్ల మీద వస్తున్ననెగటివిటీని కాసేపు పక్కన పెట్టి చూసినా "ఎవరు ఎలా ఉండాలో వాళ్లిష్టం" అనే స్థాయికి నిజంగా మనం చేరుకున్నామా..? దానికి సిద్ధంగా ఉన్నామా అన్నది సమీక్షించుకోవాలి.శివాజీకి మద్దతు ఇస్తున్న వారందరినీ రెగ్రెసివ్ అని ఒక్కమాటతో చెప్పేయొచ్చా.. వాళ్లంతా Patriarchal ఏనా..? ఇందులో చాలామంది మహిళలు ఉండటం కూడా గమనించాలి. తప్పు చేసిన వాళ్లని తప్పు పడదాం.. కానీ తప్పు చేసే Scope కావాలని ఇవ్వడం ఎందుకు అన్నది వాళ్ల ప్రశ్న.ఇప్పుడు ఇలా మాట్లాడేవాళ్లంతా మధ్యతరగతి సొసైటి మనుషులు. మన సొసైటీలో పూర్తి స్వేచ్చను ఆమోదించే పరిస్థితి కచ్చితంగా లేదు. దానికి వాళ్లింకా సిద్ధం కాలేదు అన్నది కూడా నిజం. ఓ సినిమా ఫంక్షన్ నుంచే ఇదంతా వచ్చింది కాబట్టి సినిమాల్లో కనిపించేదంతా ఓ ఊహాలోకం. మనుషులను రంజింపచేయడానికి.. వాళ్లని పూర్తిగా ఫాంటసీలోకి తీసుకెళ్లడానికి ఓ వృత్తిపరంగా గ్లామరస్‌గా ఉంటారు. కానీ బయట ఉన్నప్పుడు.. నార్మల్‌గా ఉండాలనే సలహాలు వస్తున్నాయి. నార్మల్‌గా ఉన్నా కూడా సినిమా వాళ్లపై మామూలు జనం ఎగబడుతూనే ఉన్నారు. గ్లామర్ ప్రపంచం.. బయట ప్రపంచం దాదాపుగా ఒకేలా ఉండే అడ్వాన్స్‌డ్ దేశాల్లో అయితే ఓకే కానీ.. మన దగ్గర ఆ హద్దు ఉండాలనే పాయింట్ కూడా ఉంది. ఇది వ్యక్తిగత స్వేచ్చను అడ్డగించడం, ఆడవాళ్లకి హద్దులు పెట్టాలనే ఉద్దేశ్యం కాదు.. ఓ కన్వీనియెన్స్ అనే వాదన కూడా ఉంది. కానీ దానిని అదే స్ఫూర్తితో తీసుకోవడానికి మిగతా వారు అంగీకరించకపోవడమే సమస్య.





















