అన్వేషించండి

Azaad OTT Release Date: ఓటీటీలోకి రవీనాటాండన్ కుమార్తె రషా తడానీ 'ఆజాద్' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?

Rasha Thadani Azaad Movie: రవీనా టాండన్ కుమార్తె రషా తడాని బాలీవుడ్ ఎంట్రీ మూవీ 'ఆజాద్' ఈ నెల 14 నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీని అభిషేక్ కపూర్ తెరకెక్కించారు.

Rasha Thadani's Azaad Movie OTT Release On Netflix: బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ (Ajay Devgn) హీరోగా ప్రముఖ బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రషా తడానీ (Rasha Thadani) ఫస్ట్ మూవీ 'ఆజాద్' (Azaad). ఈ ఏడాది జనవరి 17న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. అభిషేక్ కపూర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో డయానా పెంటీ, ఆమన్ దేవగన్ కీలక పాత్రలు పోషించారు.

ఈ నెల 14 నుంచి ఓటీటీలోకి..

ఈ మూవీ ఈ నెల 14 నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో (Netflix) స్ట్రీమింగ్ కానుంది. బ్రిటిష్ కాలం నాటి పాలనలో సాగే ఓ పీరియాడిక్ డ్రామాగా 'ఆజాద్' రూపొందింది. ఓ తిరుగుబాటు నాయకుడి గుర్రంతో అనుబంధం ఏర్పరుచుకున్న యువకుడు.. అతని మరణం తర్వాత దాన్ని సంరక్షించే బాధ్యతను తీసుకుంటాడు. ఈ క్రమంలో తన ప్రేమ, కలల సాకారానికి ఆ యువకుడు ఏం చేశాడనేదే కథ. ఈ మూవీలో గుర్రం కీలక పాత్ర పోషించింది. బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత విజయం సాధించలేకపోయిన 'ఆజాద్' తాజాగా ఓటీటీలోకి స్ట్రీమింగ్ కానుంది.

Also Read: ఫేమస్ భూత్ బంగ్లాలో రామ్ చరణ్ ' RC16' మూవీ షూటింగ్ - స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ ఓకే.. మరి అసలు స్టోరీ అదేనా..?

కంగనా 'ఎమర్జెన్సీ' కూడా..

మరోవైపు, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ (Kangana Ranaut) స్వీయ దర్శకత్వంలో వచ్చిన 'ఎమర్జెన్సీ' (Emergency) మూవీ సైతం ఈ నెల 14 నుంచే 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ కానుంది. జనవరి 17న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ జీవితం ఆధారంగా ఈ మూవీ రూపొందింది. ఇందిరా ఆమె హయాంలో అత్యవసర పరిస్థితి ప్రకటించిన సందర్భాన్ని ఆధారంగా చేసుకుని మూవీ తెరకెక్కించారు. కంగనా రనౌత్.. ఇందిరాగాంధీ పాత్రలో నటించగా.. అనుపమ్ ఖేర్ జయప్రకాశ్ నారాయణ్ పాత్రలో, అటల్ బిహారీ వాజ్‌పేయీగా శ్రేయాస్ తల్పాడే నటించారు. వీరితో పాటు మహిమా చౌదరి, మిలింద్ సోమన్, సతీష్ కౌశిక్ తదితరులు నటించారు. 

ప్రస్తుతం ఓటీటీల్లోకి వచ్చే పలు సినిమాలు అన్ని భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతుండగా.. 'ఎమర్జెన్సీ' తెలుగులోనూ స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. విడుదలకు ముందే ఈ మూవీ పలు వివాదాల్లో చిక్కుకుంది. దీంతో వాయిదా పడుతూ వచ్చిన సినిమా థియేటర్లలోకి వచ్చి ఇప్పుడు ఓటీటీల్లోకి రానుంది.

Also Read: ఓటీటీలోకి వచ్చేస్తోన్న గోదారి యువకుడి 'పరాక్రమం' - ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్.. ఎప్పటి నుంచో తెలుసా?

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Bharat Bhhagya Viddhaata OTT : ఓటీటీలోకి కంగనా రనౌత్ కొత్త మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి కంగనా రనౌత్ కొత్త మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
KJQ OTT : ఆ ఓటీటీలోకి దసరా ఫేం దీక్షిత్ శెట్టి KJQ - ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి దసరా ఫేం దీక్షిత్ శెట్టి KJQ - ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
Vadhandhi 2 Series OTT : గ్రామంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ డోంట్ మిస్
గ్రామంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ డోంట్ మిస్
Dark Comedy Thriller OTT : శవాన్ని కిడ్నాప్ చేసే ఫ్రెండ్స్ - ఓటీటీలోకి వచ్చేసిన డార్క్ కామెడీ డ్రామా... ఎందులో చూడొచ్చంటే?
శవాన్ని కిడ్నాప్ చేసే ఫ్రెండ్స్ - ఓటీటీలోకి వచ్చేసిన డార్క్ కామెడీ డ్రామా... ఎందులో చూడొచ్చంటే?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
TDP vs JSP Social Media War: టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
Embed widget