Rekhachithram Telugu OTT Relese Date: తెలుగులో మరో ఓటీటీలోకి మర్డర్ మిస్టరీ 'రేఖాచిత్రం' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా..?
Rekhachithram OTT Platform: మలయాళంలో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన 'రేఖాచిత్రం' మరో ఓటీటీలోనూ కేవలం తెలుగులో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 14 నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది.

Asif Ali's Rekhachithram Telugu OTT Release On Aha: మర్డర్, క్రైమ్, థ్రిల్లర్ మూవీస్ అంటే ఉండే క్రేజ్ వేరు. ఆడియన్స్ ఇంట్రెస్ట్ మేరకు పలు ఓటీటీలు అలాంటి కంటెంట్‌ను ఎక్కువగా అందుబాటులో తెస్తున్నాయి. ఈ ఏడాదిలో మలయాళ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన 'రేఖాచిత్రం' (Rekhachithram) మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ తెలుగులో మరో ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.
ఈ నెల 14 నుంచి తెలుగులో స్ట్రీమింగ్..
View this post on Instagram
'రేఖాచిత్రం' (Rekhachithram) మూవీ కేవలం తెలుగు వెర్షన్‌లో ఈ నెల 14 నుంచి 'ఆహా' (Aha) ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సదరు ఓటీటీ సంస్థ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. '40 ఏళ్ల నాటి హత్య. చివరికి నిజం వెలుగులోకి వస్తుందా..?'. అంటూ క్యాప్షన్ ఇచ్చింది. జోఫిన్ టి చాకో దర్శకత్వం వహించిన సినిమాలో ఆసిఫ్ అలీ, అనస్వర రాజన్ ప్రధాన పాత్రలు పోషించారు. రూ.6 కోట్ల స్వల్ప బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.55 కోట్లకు పైగా వసూలు చేసింది. మలయాళ ఇండస్ట్రీలోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీగా రికార్డు సృష్టించింది.
ఇప్పటికే 'సోనీ లివ్'లో స్ట్రీమింగ్
ఇప్పటికే 'రేఖాచిత్రం' మూవీ 'సోనీ లివ్' (SonyLIV) ఓటీటీలో ఈ నెల 7 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళం, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంది. క్రైమ్ థ్రిల్లర్ మూవీస్‌కు ఉండే క్రేజ్ దృష్ట్యా ఇప్పుడు 'ఆహా'లోనూ కేవలం తెలుగులోనే స్ట్రీమింగ్ కానుంది.
Also Read: పాపం.. అమృతం, అంజిని చితక్కొట్టేశారుగా.. - ఇందా అంటూ 'గోవిందా' అయిపోయారు, నవ్వుల ఎపిసోడ్ చూసేయండి
మర్డర్ మిస్టరీ కథ ఏంటంటే.?
నగరంలో సీఐ గోపీనాథ్ (ఆసిఫ్ అలీ) ఓ ఆత్మహత్య కేసును విచారిస్తుంటాడు. అయితే, అతను ఆన్ లైన్ రమ్మీ ఆడుతూ అధికారులకు అడ్డంగా దొరికిపోగా అతన్ని సస్పెండ్ చేస్తారు. అనంతరం ఉన్నతాధికారులు అతన్ని అటవీ ప్రాంతానికి బదిలీ చేస్తారు. ఈ సూసైడ్ కేసు విచారణ కోసం మళ్లీ ఎంట్రీ ఇచ్చిన సీఐ.. ఎంక్వైరీ చేస్తుండగా 40 ఏళ్ల కిందటి హత్య కేసుతో ఈ కేసుకు లింక్ ఉన్న విషయాన్ని గుర్తిస్తాడు. 1985 టైంలో ఓ షూటింగ్ లోకేషన్ నుంచి ఓ బాలిక కూడా అదృశ్యం అవుతుంది. ఆ కేస్ కూడా గోపీనాథ్ దగ్గరకి చేరుతుంది. అయితే ఇలా ఒక్క కేసుకే ఎన్నో ట్విస్టులు ఉంటాయి. అసలు 40 ఏళ్ల కిందటి హత్య కేసుతో ఇప్పటి ఆత్మహత్యకు సంబంధమేంటి? ఆ అమ్మాయి మిస్సింగ్ వెనుక ఉన్నది ఎవరు.? ఫైనల్‌గా ఆ చిక్కు ముడులను విప్పి, ఈ కేసును సీఐ ఎలా చేధించాడు ? అనేది తెలియాలంటే 'రేఖా చిత్రం' మూవీని చూడాల్సిందే. ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ట్విస్ట్‌లు, టర్న్‌లతో ఊహించని విధంగా ఉంటుంది. మరి ఈ మూవీని 'ఆహా'లోనూ చూసి ఎంజాయ్ చేసేయండి మరి.





















