అన్వేషించండి
Naga Chaitanya-Sobhita Dhulipala: నాగ చైతన్య - శోభితా ధూళిపాళ ఎంగేజ్‌మెంట్ ఫోటోలు - కొత్త జంటకు దిష్టి తీయండమ్మా!
Naga Chaitanya Sobhita Dhulipala Engagement Photos: యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, శోభితా ధూళిపాళ నిశ్చితార్థం కుటుంబ సభ్యుల మధ్య వేడుకగా జరిగింది. ఆ ఫోటోలు చూడండి.

శోభితా ధూళిపాళ, నాగ చైతన్య
1/5

Naga Chaitanya Engagement Photos: యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య జీవితంలో ఆగస్టు 8న చాలా ముఖ్యమైన రోజు. శోభితా ధూళిపాళతో ఆయన నిశ్చితార్థం జరిగింది. ఇద్దరు కలిసి ఏడు అడుగులు వేయాలని నిర్ణయం తీసుకున్నారు. కుటుంబ పెద్దలు, సభ్యుల అనుమతితో ఉంగరాలు మార్చుకున్నారు. ఈ విషయాన్ని నాగార్జున ట్వీట్ చేశారు.
2/5

కాబోయే కొత్త జంట చైతన్య, శోభితకు అభిమానులు, ప్రేక్షకులతో పాటు పలువురు పరిశ్రమ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. దిష్టి తీయమని కొందరు సలహా ఇస్తున్నారు.
3/5

నాగ చైతన్య, శోభితా ధూళిపాళ ప్రేమలో ఉన్నారని కొన్నాళ్ల క్రితమే బయటకు వచ్చింది. అందుకు కారణం ఈ ఫోటోనే. లండన్ రెస్టారెంట్ తమ సోషల్ మీడియాలో చైతన్య వచ్చారని పేర్కొంది. అందులో శోభిత కనిపించడంతో జనాలు సందేహం కలిగింది.
4/5

శోభితా ధూళిపాళ, నాగ చైతన్య మీద ప్రేక్షకుల్లో కలిగిన సందేహం నిజమని ఆ తర్వాత కొన్నాళ్ళకు స్పష్టం అయ్యింది. వాళ్లిద్దరి లండన్ టూర్ ఫోటోలు నెట్టింట షికార్లు కొట్టాయి.
5/5

శోభితా ధూళిపాళ తెలుగమ్మాయి. ఆమె స్వస్థలం తెనాలి. తండ్రి నేవి ఉద్యోగి కావడంతో విశాఖ, ముంబై ప్రాంతాల్లో పెరిగింది. తొలుత మోడల్ గా, ఆ తర్వాత హిందీ సినిమా 'రమణ్ రాఘవ్ 2.0'తో హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టింది.
Published at : 08 Aug 2024 02:10 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
అమరావతి
ఇండియా
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion