Hidimba OTT Streaming: మరో ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్ - నరమాంస భక్షకులు తిరిగొస్తే వినాశనమేగా.. ఏ ఓటీటీలోనో తెలుసా?
Hidimba OTT Platform: అశ్విన్ బాబు, నందితా శ్వేత నటించిన సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ 'హిడింబ'. ఏడాదిన్నర క్రితం రిలీజైన ఈ మూవీ 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతుండగా.. తాజాగా 'అమెజాన్ ప్రైమ్'లోకి వచ్చింది.

Nag Ashwin's Hidimba OTT Streaming On Amazon Prime Video: క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ అంటేనే మూవీ లవర్స్ రిలీజై ఎన్ని రోజులైనా క్రేజ్ తగ్గదు. ప్రస్తుతం చాలా ఓటీటీలు ఆడియన్స్‌కు మరింత చేరువయ్యేలా హారర్, క్రైమ్ థ్రిల్లర్ కంటెంట్‌ను ఎక్కువగా అందిస్తున్నాయి. అలాంటి కోవలోకి చెందిన సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'హిడింబ' (Hidimba). అశ్విన్ బాబు, నందితా శ్వేత లీడ్ రోల్స్‌లో నటించిన ఈ మూవీ 2023, జులై 20న థియేటర్లలోకి వచ్చింది. ఇప్పటికే ఈ మూవీ 'ఆహా' ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా.. తాజాగా 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లోనూ (Amazon Prime Video) స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నెల 21 నుంచి తెలుగు వెర్షన్‌లోనే అందుబాటులోకి వచ్చింది. అనిల్ కన్నెగంటి దర్శకత్వం వహించిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. రూ.3 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన మూవీ రూ.5.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో శ్రీనివాసరెడ్డి, సాహితీ అవంచ, సంజయ్ స్వరూప్, శిజ్జు, విద్యులేఖ రామన్, రాజీవ్ కనకాల, శుభలేఖ సుధాకర్, ప్రమోదిని, రఘుకంచె తదితరులు కీలక పాత్రలు పోషించారు.
కథేంటంటే..?
అభయ్ (అశ్విన్ బాబు), ఆద్య (నందితా శ్వేత) పోలీస్ ట్రైనింగ్‌లో ఉండగా లవ్ చేసుకుంటారు. అనంతరం కొన్ని కారణాలతో విడిపోతారు. ఆద్య ఐపీఎస్ కాగా.. అభయ్ హైదరాబాద్‌లో పోలీస్ ఆఫీసర్‌గా పని చేస్తుంటాడు. అయితే, నగరంలో అమ్మాయిల కిడ్నాప్‌ల కేసుకు సంబంధించి ఇద్దరూ కలిసి పని చేయాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే బోయ అనే ఓ కరుడుగట్టిన ముఠాను పట్టుకుంటారు. వాళ్ల చెరలో ఉన్న అమ్మాయిలందరినీ విడిపిస్తారు. అయితే, నగరంలో మరో అమ్మాయి కిడ్నాప్ కలకలం రేపుతుంది. దీంతో సైకోను పట్టుకునేందుకు సీక్రెట్ ఆపరేషన్ చేపట్టగా అది ఫెయిల్ అవుతుంది. ఈ కేసులో అసలు నేరస్థులు ఎవరు.?, అసలు ఈ కిడ్నాప్‌లకు ఎలా ఎండ్ కార్డ్ పడింది..?, నిందితుడు రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిల్నే లక్ష్యంగా చేసుకోవడానికి కారణం ఏంటి.? ఆఖర్లో మూవీలో వచ్చే ట్విస్ట్ ఏంటి.? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
Also Read: ముందుగా టీవీలోకి 'సంక్రాంతికి వస్తున్నాం' - ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చెయ్యండి, ఎప్పుడంటే?
మరో సైకో థ్రిల్లర్ మూవీ కూడా..
మరోవైపు, చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన హారర్ థ్రిల్లర్ మూవీ 'తుంబాడ్'. రూ.5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ తొలుత అక్టోబర్ 12, 2018న విడుదలై.. రూ.13.6 కోట్లు రాబట్టింది. ఇటీవలే ఈ మూవీ రీ రిలీజ్ కాగా.. ఓటీటీలో అందుబాటులో లేదు. థియేట్రికల్ రన్ తర్వాత తాజాగా మళ్లీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లోకి అందుబాటులోకి వచ్చింది. ఈ మూవీలో సోహమ్ షా (Sohum Shah), హరీష్ ఖన్నా, జ్యోతి మల్లే, రుద్ర సోని, మాధవ్ హరి జోషి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు రాహి అనిల్ బార్వే (Rahi Anil Barve) దర్శకత్వం వహించారు.
Also Read: మూవీ లవర్స్‌కు ఈ సమ్మర్ సినిమాల పండుగే - ఆ ఓటీటీల్లోకి బ్లాక్ బస్టర్ మూవీస్, సిరీస్‌లు






















