Snakranthiki Vasthunnam: ముందుగా టీవీలోకి 'సంక్రాంతికి వస్తున్నాం' - ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చెయ్యండి, ఎప్పుడంటే?
Sankranthiki Vasthunnam TV Premiere: సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచిన 'సంక్రాంతికి వస్తున్నాం' ముందుగా టీవీలోకి ప్రసారం కానుంది. ఈ మేరకు 'జీ తెలుగు' సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.

Sankranthiki Vasthunnam TV Premiere Release Date On Zee Telugu: టాలీవుడ్ టాప్ హీరో విక్టరీ వెంకటేశ్ (Venkatesh), స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' (Sankranthiki Vasthunnam) ఈ సంక్రాంతికి రిలీజై బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా.? అని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ముందుగా టీవీలోకి ప్రీమియర్ కాబోతున్నట్లు మేకర్స్ ఇటీవలే ఓ ప్రకటనలో తెలిపారు. తాజాగా, 'ఏమండోయ్.. వాళ్లు చూస్తున్నారు. మరిన్ని వివరాలు, కూసంత చమత్కారం కోసం వేచి చూడండి. త్వరలోనే మరిన్ని వివరాలు ప్రకటిస్తాం.' అని జీ5 సరదాగా ఓ పోస్ట్ పెట్టింది. దీంతో ఇది ఓటీటీ రిలీజ్ కోసమేనా లేక టీవీనా అంటూ కాస్త కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యింది. దానికి తెర దించుతూ లేటెస్ట్‌గా 'జీ తెలుగు' ఆసక్తికర ప్రకటన చేసింది. మార్చి 1న సాయంత్రం 6 గంటలకు టెలివిజన్ ప్రీమియర్‌గా మూవీ ప్రసారం కానుందని తెలిపింది.
The blockbuster date of #SankranthikiVasthunnam is 𝐌𝐀𝐑𝐂𝐇 𝟏𝐬𝐭 💥🔥
— ZEE TELUGU (@ZeeTVTelugu) February 22, 2025
StayTuned to #ZeeTelugu 💥#SankranthiKiVasthunnamOnZeeTelugu#WorldTelevisionPremiereSankranthikiVasthunnam #FirstTVloVasthunnam #SVonTV #SankrathikiVasthunnamFirstOnTV@VenkyMama @anilravipudi… pic.twitter.com/LUa1F3tkbu
ఓటీటీ రిలీజ్‌పై వీడని సస్పెన్స్
ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ5 కొనుగోలు చేయగా తొలుత ఫిబ్రవరిలోనే ఓటీటీలోకి వస్తుందని అంతా భావించారు. ఊహించని రెస్పాన్స్ రావడంతో ఓటీటీ రిలీజ్ వాయిదా పడింది. సాధారణంగా ఏ మూవీ అయినా థియేటర్లలో రిలీజైన కొన్ని వారాల తర్వాత ఓటీటీలోకి అడుగుపెడుతుంది. అయితే, మూవీ టీం దీనికి భిన్నంగా ముందుగా టీవీలో ప్రీమియర్ చేసి ఆ తర్వాత ఓటీటీలోకి రిలీజ్ చేయనుంది. ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతుందో స్పష్టమైన ప్రకటన రాలేదు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తెరకెక్కిన మూవీలో వెంకటేశ్ తన కామెడీ టైమింగ్‌తో మెప్పించారు. ఆయన సరసన ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. 'బుల్లిరాజు'గా ఛైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్ కామెడీ సినిమాకే హైలైట్‌గా నిలిచింది. మూవీలో మురళీధర్ గౌడ్, శ్రీనివాసరెడ్డి, సాయికుమార్, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలు పోషించారు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన మూవీ దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూలు చేసింది.
Also Read: నీరూ, నిప్పూ, గాలీ... అన్నీ నా కోపానికి దాసోహమే... పవర్ ఫుల్‌గా తమన్నా 'ఓదెల 2' టీజర్... చూశారా?
బాలీవుడ్‍లోకి..
తెలుగులో సూపర్ హిట్ సక్సెస్ అందుకున్న మూవీ త్వరలో బాలీవుడ్‌లోకి సైతం వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. చిత్ర నిర్మాత దిల్ రాజు ఈ ప్రాజెక్టును హిందీ ప్రేక్షకుల కోసం రీమేక్ చేయనున్నట్లు వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. బాలీవుడ్ టాప్ హీరో అక్షయ్ కుమార్ హీరో అయితే బాగుంటుందని ఆయన అనుకుంటున్నట్లు సమాచారం. అయితే, ప్రస్తుతం ఇది చర్చల దశలోనే ఉండగా.. అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.



















