అన్వేషించండి

APPSC Group 2 Exam Date: అభ్యర్థులకు అలర్ట్.. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలపై ఏపీపీఎస్సీ కీలక ప్రకటన

APPSC Group 2 Exam Postponed | గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలపై ఏపీపీఎస్సీ కీలక ప్రకటన చేసింది. అంతలోనే ఎగ్జామ్ వాయిదా వేయాలని కమిషన్ కు ప్రభుత్వం లేఖ రాసింది.

AP Group 2 Exam Postponed |  అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ఆదివారం జరగనున్న గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్షలపై క్లారిటీ వచ్చేసింది. ఫిబ్రవరి 23న ఏపీ గ్రూప్ 2 పరీక్షలు యథాతథంగా జరుగుతాయని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC) స్పష్టం చేసింది. కొందరు అభ్యర్థులు వాయిదా కావాలని కోరుతున్నారని, ప్రభుత్వం దీనిపై పునరాలోచించి నిర్ణయం తీసుకుంటుందని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సైతం ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయడంతో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షలపై గందరగోళం నెలకొంది. అయితే పరీక్షల నిర్వహణపై ఏపీపీఎస్సీ క్లారిటీ ఇచ్చింది. ఎగ్జామ్ వాయిదా అని సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని కమిషన్ కొట్టిపారేసింది. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది.

ఈ 23న గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష 
మొత్తం 92,250 మంది అభ్యర్థులు ఏపీలో గ్రూప్‌ 2 మెయిన్స్ పరీక్ష రాయనున్నారు. ఆదివారం నాడు (ఫిబ్రవరి 23న) గ్రూప్ 2 మెయిన్స్ నిర్వహణకు ఏపీపీఎస్సీ కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. ఉదయం, మధ్యాహ్నం రెండు పూటల ఎగ్జామ్స్ జరగనున్నాయి. పేపర్-1 ఎగ్జామ్ ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు, పేపర్ 2 ఎగ్జామ్ మధ్యాహ్నం 3 గంటల నుంచి 5.30 గంటల వరకు నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. అభ్యర్థులు అరగంట ముందుగానే ఎగ్జామ్ సెంటర్ కు చేరుకోవాలని, చివరి నిమిషంలో చేసే తప్పిదాలతో పరీక్ష మిస్ చేసుకునే పరిస్థితి ఉంటుందని హెచ్చరించింది. 

ట్విస్ట్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం..

గ్రూప్స్ 2 మెయిన్ పరీక్షలపై అభ్యర్థుల విన్నపాన్ని ఏపీ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. ఫిబ్రవరి 23న నిర్వహించాల్సిన పరీక్షను తాత్కాలికంగా వాయిదా వేయాలని కోరుతూ ఏపీపీఎస్సీకి  కూటమి ప్రభుత్వం లేఖ రాసింది. ప్రస్తుతం ఉన్న రోస్టర్ తప్పుల సరిచేయకుండా గ్రూప్ 2 పరీక్ష నిర్వహణపై అభ్యర్ధుల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. ఇది ప్రస్తుతం కోర్టులో రోస్టర్ అంశంపై పిటిషన్ మార్చి 11 న  విచారణ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కోర్టులో ఉన్న ఈ అంశంపై అఫిడవిట్ వేసేందుకు ఇంకా సమయం ఉంది. అప్పటి వరకు పరీక్షలు నిర్వహించవద్దని రాష్ట్ర ప్రభుత్వం ఏపీపీఎస్సీకి లేఖ రాసింది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ తేదీలో మార్పులేదని కమిషన్ ప్రకటన విడుదల చేసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. 

Also Read: RRB Recruitment 2025: ఇండియన్ రైల్వేలో 32 వేల ఉద్యోగాల దరఖాస్తు గడువు పొడిగింపు, ఎప్పటివరకు అవకాశమంటే?

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Visakhapatnam Airport Service Ends: కొన్ని గంటల్లో ముగియనున్న విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలు.. ఇక నుంచి భోగాపురం నుంచి విమాన సర్వీసులు
కొన్ని గంటల్లో ముగియనున్న విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలు.. ఇక నుంచి భోగాపురం నుంచి విమాన సర్వీసులు
Tadipatri High Tension: తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
Deputy CM Pawan Kalyan: చంద్రగిరిలో ఏనుగుల గుంపు రైతులపై దాడులు.. హనుమాన్ బృందాలను మోహరించాలని పవన్ కళ్యాణ్ ఆదేశం
చంద్రగిరిలో ఏనుగుల గుంపు రైతులపై దాడులు.. హనుమాన్ బృందాలను మోహరించాలని పవన్ కళ్యాణ్ ఆదేశం
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS SL Galle Day 2 Updates: గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tadipatri High Tension: తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
Embed widget