National Anthem In Cricket Match: క్రికెట్ మ్యాచ్‌కు ముందు జాతీయ గీతం ఎందుకు ఆలపిస్తారు? ఈ సంప్రదాయం ఎప్పటి నుంచి మొదలైందీ?
National Anthem In Cricket Match: క్రికెట్ మ్యాచ్‌లు జరిగినప్పుడు మ్యాచ్‌కు ముందు ఆయా దేశాల జాతీయ గీతాలను ఆలపిస్తారు. ఎందుకు ఇలా చేస్తారు. ఎప్పటి నుంచి ఈ సంప్రదాయం మొదలైంది?

National Anthem In Cricket Match: పాకిస్తాన్‌లో జరుగుతున్న ఐసీసీ ఛాంపియన్ ట్రోపీ 2025లో శనివారం ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరుగుతోంది. గ్రూప్ బీలో ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు జరిగిన ఓ ఘటన వైరల్ అవుతోంది. ఆస్ట్రేలియా జాతీయ గీతం వేయడానికి బదులు భారత్ జాతీయ గీతం వేశారు. రెండు సెకన్ల తర్వాత జరిగిన తప్పును తెలుసుకొని దాన్ని ఆపేసి ఆస్ట్రేలియా జాతీయ గీతం వేశారు. అసలు మ్యాచ్‌కు ముందు జాతీయ గీతం ఎందుకు ఆలపిస్తారు.
ఐసీసీ టోర్నీలు, ద్వైపాక్షిక ఇలా వివిధ సిరీస్‌లు జరిగినప్పుడు మ్యాచ్ ప్రారంభానికి ముందు జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. ఏ దేశాలు ఆడుతుంటే ఆ దేశాలకు చెందిన జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. ముందు ఆతిథ్య దేశాల గీతాన్ని వేస్తారు. ఇది ఎప్పటి నుంచి ప్రాంరభమైందనే విషయంపై క్లారిటీ లేదు కానీ 2000 నుంచి ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నట్టు సమాచారం.
ముందు ఐసీసీ టోర్నెంట్స్‌లో మాత్రమే జాతీయ గీతాలాపన సంప్రదాయాన్ని పాటించే వాళ్లు. తర్వాత ఆయా దేశాలు కూడా తమ ద్వైపాక్షిక సిరీస్‌లో జాతీయ గీతాలాపన సంప్రదాయాన్ని మొదలు పెట్టాయి.
ఎందుకు జాతీయ గీతాలాపన చేస్తారంటే?
క్రికెట్ అనేది ఒక ఎమోషనల్ గేమ్. అందుకే దానికి దేశభక్తిని యాడ్ చేసేందుకు ఈ జాతీయ గీతాన్ని ఆలపించే సంప్రదాయం తీసుకొచ్చారు. అంతేకాకుండా ఆటగాళ్లు, ప్రేక్షకుల్లో ఐక్యత, గౌరవం పెంపొదించి జాతీయ గర్వాన్ని చాటి చెప్పేలా ఉంటుందని నిర్వాహకుల భావన. ఒక దేశం తరఫున ఆడుతున్న భావన ఆటగాళ్లలో కలిగించేందుకు కూడా ఇదో సాధనంగా ఉపయోగపడుతుంది. దేశం తరపున ఆడుతూ మైదానంలో జాతీయ గీతాలాపన చేయడం చాలా మంది క్రీడాకారులకు డ్రీమ్‌గా ఉంటుంది. అందుకే చాలా మంది క్రీడాకారులు జాతీయ గీతం ఆలపించేటప్పుడు భావోద్వేగానికి గురవుతుంటారు.
మ్యాచ్ మొదట్లో జాతీయ గీతాలాపన చేయడం క్రికెట్‌తోనే మొదలు కాలేదు. ముందు ఈ సంప్రదాయం పుట్‌బాల్ మ్యాచ్‌లలో ఉండేది. దీన్ని 1900 తొలినాళ్లలో మొదలు పెట్టారు. ఫిఫా, ఒలంపిక్స్ ఇలా ఇతర గ్లోబల్ స్పోర్ట్స్ ఈవెంట్స్‌లో సంప్రదాయం కంటిన్యూ అయ్యింది. అనంతరం క్రికెట్‌లోకి వచ్చింది. ఇప్పటి వరకు క్రికెట్‌లో ఐసీసీ నిర్వహించే వరల్డ్ కప్, ఛాంపిన్స్ ట్రోఫీ, టీ 20 వరల్డ్ కప్‌తోపాటు ద్వైపాక్షిక సిరీస్‌లలో జాతీయ గీతం పాడుతారు. 1999 క్రికెట్ వరల్డ్‌కప్‌లో మ్యాచ్‌లకు ముందు జాతీయ గీతం ఆలపించారు. తర్వాత 2003 వరల్డ్ కప్ నాటికి ఇది రెగ్యులర్ ప్రక్రియలా మారింది. 2011 వరల్డ్‌కప్ నుంచి ప్రతి మ్యాచ్‌కు కచ్చితంగా ఆ దేశ జాతీయ గీతాలు ఆలపించాలని అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు ప్రతీ మేజర్ ఐసీసీ ఈవెంట్‌కు కచ్చితంగా జాతీయగీతాలాపన సంప్రదాయంగా కొనసాగిస్తున్నారు.
ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగినప్పుడు ముందుగా విదేశీ గీతాన్ని ఆ తర్వాత వెంటనే ఆతిథ్య దేశ గీతాన్ని ఆలపించాలి. కీలకమైన సిరీస్‌లు ఉన్నప్పుడు ముందు బ్యాటింగ్ చేసిన దేశాల జాతీయ గీతాన్ని ఆలపిస్తారు.
Also Read: పాక్ గడ్డపై భారత జాతీయ గీతం- వైరల్ అవుతున్న దృశ్యం




















