అన్వేషించండి
Investors Lose Money: దక్కని శుభారంభం - 2023 తొలివారంలో రూ.4.02 లక్షల కోట్లు గాయబ్!
Stock Market Bad Start: దక్కని శుభారంభం - 2023 తొలివారంలో రూ.4.02 లక్షల కోట్లు గాయబ్!

స్టాక్ మార్కెట్ న్యూస్
1/6

నూతన సంవత్సరం తొలి వారంలో స్టాక్ మార్కెట్లు ఇన్వెస్టర్లకు షాకులిచ్చాయి. యూఎస్ ఫెడ్ వడ్డీరేట్ల పెంపు కొనసాగిస్తుందన్న అంచనాలు, అమెరికా ఎంప్లాయిమెంట్ డేటా వంటివి నెగెటివ్ సెంటిమెంటుకు దారితీశాయి.
2/6

తొలి వారం స్టాక్ మార్కెట్ల పతనంతో బీఎస్‌ఈ నమోదిత కంపెనీల మార్కెట్ విలువ రూ.4.02 లక్షల కోట్లు తగ్గి రూ.279.78 లక్షల కోట్లకు చేరుకుంది. నిఫ్టీ 338 పాయింట్లు నష్టపోగా బీఎస్‌ఈ సెన్సెక్స్ 1263 పాయింట్లు పతనమైంది.
3/6

ఈ వారం నిఫ్టీ ఐటీ సూచీ 2 శాతం పతనమైంది. నిఫ్టీ ప్రైవేట్ బ్యాంకు సూచీ 1.12 శాతం నష్టపోయింది. బ్యాంకు, ఆటో, ఫార్మా, రియాల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్, మీడియా, హెల్త్‌కేర్ సూచీలు ఎరుపెక్కాయి. నిఫ్టీ మిడ్ క్యాప్50 సూచీ 0.64 శాతం, స్మాల్ క్యాప్50 సూచీ 0.73 శాతం మేర పతనమయ్యాయి.
4/6

ఎఫ్‌ఓఎంసీ మీటింగ్ మినట్స్ విడుదలయ్యాక మదుపర్లు సెంటిమెంటు బలహీనపడిందని విశ్లేషకులు అంటున్నారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు అమెరికా ఫెడ్ రేట్ల పెంపు కొనసాగిస్తుందన్న అంచనాలు ప్రతికూలంగా మారాయి. త్వరలో విడుదల చేయబోయే యూఎస్ జాబ్‌డేటా సానుకూలంగా ఉంటే మార్కెట్లు పెరగొచ్చని పేర్కొన్నారు.
5/6

శుక్రవారం డాలర్‌తో పోలిస్తే రూపాయి 82.72 వద్ద స్థిరపడింది. చివరి ముగింపుతో పోలిస్తే 0.31 శాతం నష్టపోయింది. మొత్తంగా ఈ వారంలో కరెన్సీ విలువలో పెద్ద మార్పేమీ లేదు.
6/6

డిమాండ్ తగ్గడంతో క్రూడాయిల్ ధర పతనమవుతోంది. శుక్రవారం 0.6 శాతం తగ్గి బ్యారెల్ ధర రూ.6,111 వద్ద ఉంది. బ్రెండ్ క్రూడ్ 78.88 డాలర్లుగా ఉంది.
Published at : 06 Jan 2023 06:08 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
అమరావతి
తెలంగాణ
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion