అన్వేషించండి

North Korea: పుతిన్‌కు తోడవుతున్న కిమ్ - రష్యాకు సపోర్టుగా ఉత్తర కొరియా సైన్యం - ఏం జరుగుతుందో ?

Russia: రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా రంగంలోకి దిగింది. తమ దేశం నుంచి సైనికులను రష్యాకు పంపింది. పుతిన్ అణుబాంబు హెచ్చరికల మధ్య ఈ పరిణామం కలకలం రేపనుంది.

North Korea deploys 8 to 10 thousand soldiers in support of Russia: ప్రపంచంలో ప్రమాదకరమైన దేశాధినేతల్లో ఇద్దరు అయిన  రష్యా ప్రెసిడెంట్ పుతిన్,  ఉత్తర కొరియా నియంత కిమ్  యుద్ధంలో చేతులు తలిపారు. ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న పోరాటానికి ఉత్తర కొరియా తరపున పదివేల మంది వరకూ సైనికుల్ని పంపాలని నిర్ణయించింది. ఉక్రెయిన్‌తో రెండున్నరేళ్లుగా రష్యా యుద్ధం చేస్తోంది.ఈ యుద్ధంలో రష్యా కొన్ని  వేల మంది సైనికుల్ని కోల్పోయినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో సైనికుల కొరత  ఏర్పడిందేమో కానీ తానున్నానంటూ మిత్రుడు కిమ్ స్నేహ హస్తం అందించారు. 

కిమ్ జోంగ్ ఉన్ క్రూరమైన ఉత్తరకొరియా నియంతగా పేరు పొందారు. ఆయనకు చైనా, రష్యాతో తప్ప ఏ దేశంతోనూ సంబంధాలు ఉండవు. ఆ రెండు దేశాల అధినేతలో ప్రెండ్ షిప్ కొనసాగిస్తారు. వెళ్తే ఆయన పర్యటనలు ఆ రెండు దేశాలకే ఉంటాయి. ఆ దేశాల అధ్యక్షులే ఉత్తరకొరియాకు వెళ్తారు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు గా ఉన్నప్పుడు ఆయనతో చర్చలు జరిపారు కానీ ఏ మాత్రం వర్కవుట్ కాలేదు.  ఇద్దరూ విచిత్రంగా తిట్టుకునేవారు. ఆ ఎపిసోడ్ అలాగే ఉండగానే రష్యా కోసం ఉత్తర కొరియా సైనికుల్ని పంపాలని నిర్ణయించుకున్నారు. 

Also Read: హిందీ ట్యూటర్లకు ఎలాన్ మస్క్ కంపెనీలో ఉద్యోగావకాశాలు - జీతం ఎంతో తెలుసా ?

ఓ వైపు దక్షిణ కొరియా తమ దేశంపై యుద్ధం చేస్తుందేమోనని.. తమ నాయకుడిపై హత్యాయత్నం చేస్తున్నారే్మోనని ఉత్తర కొరియా సైన్యం అనుమానిస్తోంది. అందుకే తమ దేశ సరిహద్దుల్ని రోడ్డు, రైలు మార్గాల్ని తవ్వేశారు. దక్షిణ కొరి్యా తమ దేశంపై దండెత్తాలని చూస్తే అణుబాంబులు  వేస్తామని హెచ్చరికలు చేస్తూ ఉంటారు. మరో వైపు పుతిన్ కూడా అదే చెబుతున్నారు. ఉక్రెయిన్ కు అతి పెద్ద  ఆయుధాలు ఇవ్వాలని ఇటీవల నాటో కూటమి నిర్ణయించింది. ఈ నిర్ణయంపై పుతిన్ ఫైర్ అవుతున్నారు. తమ దేశంపై దాడి చేయడానికి ఆయుధాలిచ్చే దేశాలు కూడా తమకు శత్రువులేనని వాటిపై అణుబాంబులు వేయడం తమ విధానంలో భాగమేనని కూడా ప్రకటించుకున్నారు. 

Also Read: రెండేళ్లలోనే 83 వేల కోట్ల రేంజ్‌కి చేరిన అల్కేమీ - ఇది మన నిఖిల్ విశ్వనాథన్‌దే! పెళ్లి కూడా కానీ ఈ కుర్రాడు ఎలా సాధించాడంటే ?

అలా చేయడమే కాదు.. అణుబాంబులు వేసేందుకు ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో ఉత్తర కొరియా కూడా రష్యాతో చేతులు కలుపుతోంది. ఓ వైపు మధ్య ప్రాచ్యంలో అల్లకల్లోలం కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో అన్ని దేశాలు ఒకే సారిఉద్రిక్త పరిస్థితులు తీసుకు వస్తే అది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది. అణు అస్త్రాలు ఉన్న ఉత్తరకొరియా, రష్యా అధ్యక్షులు తర్వాత ఏం జరుగుతుందా అన్న అంశాలను పట్టించుకోరు. అందుకే ప్రపంచం అంతా ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళనలో ఉంది.                                

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Allu Arjun Bail: చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
Google Pay Transaction Delete: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
Allu Arjun: అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త భాస్కర్
అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త భాస్కర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపుఆ ఒక్క నిర్ణయమే అల్లు అర్జున్ అరెస్ట్ వరకూ వచ్చిందా..?అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో కన్నీళ్లు పెట్టున్న స్నేహపాతిక లక్షల పరిహారం ఇచ్చినా అరెస్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Allu Arjun Bail: చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
Google Pay Transaction Delete: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
Allu Arjun: అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త భాస్కర్
అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త భాస్కర్
Skoda Kylaq: 10 రోజుల్లో 10 వేల బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న స్కోడా కైలాక్!
10 రోజుల్లో 10 వేల బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న స్కోడా కైలాక్!
Support From YSRCP: అల్లు అర్జున్‌కు వైఎస్ఆర్‌సీపీ సపోర్టు - లాయర్ కూడా వైసీపీ ఎంపీనే !
అల్లు అర్జున్‌కు వైఎస్ఆర్‌సీపీ సపోర్టు - లాయర్ కూడా వైసీపీ ఎంపీనే !
Arjun Arrest Revant Reddy Reaction : చట్టం తన పని తాను చేసుకుపోతుంది - అర్జున్ అరెస్ట్‌పై రేవంత్ ఫస్ట్ రియాక్షన్
చట్టం తన పని తాను చేసుకుపోతుంది - అర్జున్ అరెస్ట్‌పై రేవంత్ ఫస్ట్ రియాక్షన్
Allu Arjun Arrest Chiranjeevi Reaction: షూటింగ్స్ రద్దు చేసుకుని అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన చిరంజీవి, నాగబాబు సైతం
షూటింగ్స్ రద్దు చేసుకుని అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన చిరంజీవి, నాగబాబు సైతం
Embed widget