అన్వేషించండి

Telescope Origin : టెలిస్కోపుల తయారు చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది?

Telescope Origin : ఆధునిక మానవుడికి టెలిస్కోపుల అవసరం ఎంతో ఉంది. అంతరిక్షంలో అన్వేషణకు టెలిస్కేపులు కీలకంగా మారాయి. అసలు టెలిస్కేపుల తయారుచేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది.

Telescope Origin :  ఆదిమ కాలం నుంచి అభివృద్ధి వైపు అడుగేస్తున్న మనిషికి అర్థం కాని ప్రశ్నలెన్నో. అసలు తను ఎవరు. ఎందుకు ఇక్కడ ఉన్నాడు అనే ప్రశ్నలే కాస్త ఆలోచించగలిగే సామర్థ్యం ఉన్న మనుషులను ఉక్కిరి బిక్కిరి చేసేవి. ఆహారం కోసమో, నీటి కోసమే అన్వేషణ సాగిస్తూనే ఆకాశంలో రాత్రి పూట పరుచుకునే నక్షత్రాలను చూస్తూ ఆశ్చర్యానికి లోనయ్యేవాడు. వాటిని లెక్కపెట్టాలని కొందరు, లేదు నచ్చిన ఆకృతులు ఊహించుకోవాలని మరికొందరు ఇలా మనిషి పయనం విజ్ఞాన శాస్త్ర ప్రపంచం వైపు అడుగులు వేయించేలా చేసింది. గుంపులు గుంపులుగా గుహల్లో బతికిన రోజుల నుంచి ఈరోజు భారీ భవంతుల్లో ఆకాశానికి పోటీ ఇచ్చే స్థాయిలో మిణుకు మిణుకు భవంతుల్లో బతుకుతున్న మనిషి ఈ జర్నీ అంత తేలిగ్గా ఏం సాగలేదు. ఎన్నో అవమానాలు అంతకు మించి భవిష్యత్తుపై ఎన్నో అనుమానాలు. ఈ సందిగ్ధావస్థలో మనిషి అర్థం కాని మిస్టరీలా ఇబ్బందిపెట్టిన ఏకైక విషయం కాంతి. 


Telescope Origin : టెలిస్కోపుల తయారు చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది?

కెమెరా అబ్ స్క్యూరా 

రెండు వేల సంవత్సరాలకు పూర్వం చైనాలో ఓ ఫిలాసఫర్ మొదటిసారి కాంతిపై ప్రయోగాలు చేశాడు. ఆయన మోట్జో. కాంతిని ఓ క్లోజ్డ్ రూంలో బంధించటం ద్వారా అందమైన కదలే బొమ్మలు తయారు చేయొచ్చని మొదటగా ఊహించింది ఆయనే. ఓ టెంట్ లాంటిది తయారు చేసి దానిన్ని అన్ని వైపులా మూసేసి ఒకే ఒక్క చిన్న రంధ్రం పెట్టి దాని బయట పడి నిలబడి మనుషులతో విన్యాసాలు చేయించేవాడు మోట్జో. ఫలితంగా ఆ బయటి వ్యక్తిపై పడిన కాంతి ఆ రంధ్రం ద్వారా టెంట్ లో ఉన్నవాళ్లకి కదలాడే బొమ్మరూపంలో కనిపించేది. దీనికి మోట్జో పెట్టిన పేరు ఏంటో తెలియదు కాని విజ్ఞాన ప్రపంచం దాన్ని కెమెరా అబ్ స్క్యూరా గా పిలిచింది. ఇప్పుడున్న అన్ని కెమెరాలకు అదే ప్రోటో టైప్. యుద్ధ వ్యూహాల్లో నిష్ణాతుడైన మోట్జో శాంతి కోసం పని చేసేవాడు. మరో వైపు తన శిష్యులతో కాంతిపై తను చేసిన పరిశోధనలను గ్రంథం రూపంలో తీసుకురావటం మొదలుపెట్టాడు. కాని అథారిటీస్ రూల్స్ కి వ్యతిరేకంగా అప్పటివరకూ లేని విషయాలపై ప్రయోగాలు, పరిశోధనలు చేస్తున్నాడని మో ట్జో పై ఆరోపణలు మోపారు. అయినా పరిశోధనలు కొనసాగిస్తూనే తన శిష్యులను తన తర్వాతి పరిశోధకులుగా తీర్చిదిద్దాడు. అలా మో ట్జో చనిపోయిన కొన్ని సంవత్సరాలకు ఓ కొత్త పరిపాలకుడు అప్పటి వరకూ ఉన్న అన్ని ప్రాంతాలను ఏకీకరణ చేయటం మొదలు పెట్టాడు. రాజ్యానికి వ్యతిరేకంగా జరుగుతున్న పరిశోధనలను, ప్రయోగాలను తగులబెట్టాడు. ఆ ఎంపరర్ పేరే చిన్ షింగ్ హువాంగ్. అప్పటివరకూ అనేక రాజ్యాలుగా ఉన్న ప్రాంతాలను ఏకం చేసే ఓ ఖండాన్నే దేశంగా మార్చాడు. అతని పేరు మీదుగానే ఆ దేశానికి చైనా అనే పేరు వచ్చింది. తను చనిపోయిన తర్వాత కూడా 7వేల టెర్రాకోట గార్డ్స్ ను తన సమాధికి కాపలాగా పెట్టించిన వైనం అతని రాజ్య కాంక్ష, అతని దర్పం ఎలాంటిదో చెబుతూ ఉంటుంది.

మాస్టర్ ఆఫ్ లైట్

సరే మోట్జో తర్వాత మళ్లీ కాంతిపై ప్రయోగాలు సాగించటానికి దాదాపు వెయ్యేళ్లు పట్టింది. ఇరాక్ లోని బాస్రా నుంచి మరో మాస్టర్ ఆఫ్ లైట్ పుట్టుకొచ్చాడు. ఆయన పేరే ఇబెన్ ఆల్ హేజెన్. ఆయనకు ఉన్న ప్రశ్న ఒక్కటే. ఆకాశంలో ఎక్కడో కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న నక్షత్రాలను మనం ఎలా చూడగలుగుతున్నాం అని. అప్పటికి ఉన్న సిద్ధాంతం ఏంటంటే...మనిషి కంటి నుంచి కిరణాలు మనం చూసే వస్తువును తాకి మళ్లీ రిఫ్లెక్షన్ లో వస్తాయి కనుకనే మనం చూస్తున్న వస్తువుల ఇమేజ్ మనకు కనపడుతుంది అని. కానీ అల్ హేజెన్ కి వచ్చిన డౌట్ ఏంటంటే...ఎక్కడో కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న నక్షత్రాల వరకూ మనం కంటి నుంచి కాంతి వెళ్లి తిరిగి మన దగ్గరకు వచ్చేటప్పటికి చాలా పట్టాలి కదా. కాని మనం కను రెప్పు వేసి మళ్లీ మూసేలోపే చూడగలుగుతున్నాం కదా ప్రశ్నించాడు.

Telescope Origin : టెలిస్కోపుల తయారు చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది?

అల్ హెజెన్ 

అతని ప్రశ్నలు కొత్త ఐడియాలకు కారణమయ్యాయి. ఇస్లామిక్ వరల్డ్ సైన్స్ లో అది గోల్డెన్ ఏజ్. కైరో, బాగ్దాద్ లకు క్రిస్టియన్, జ్యూయిష్ స్కాలర్స్ వచ్చి నేర్చుకుని వెళ్లిన రోజులవి. అలా ఇస్లామిక్ స్టేట్స్ నుంచి కాంతి కి సంబంధించిన ఎన్నో థియరీలు, ప్రశ్నలు యూరోప్ కు వెళ్లాయి. కానీ అరబ్స్ చాలా వరకూ ఈ సమాచారాన్ని భారత్ నుంచి తీసుకున్నారు. భారత్ లో జరిగిన నాటి పరిశోధనల్లో అరబ్ దేశాల స్కాలర్స్ ఎక్కువగా పాల్గొనేవాళ్లు. ఇప్పుడు ఉన్న సైన్స్ కి చాలా పేర్లు గ్రీక్, లాటిన్ నుంచి వచ్చినట్లు చాలా అరబిక్ టర్మ్స్ కి మూలం సంస్కృతం. అరబిక్ న్యూమరల్స్, సున్నా సహా అన్ని భారత్ నుంచి అరబ్ కు వెళ్లినవే. విజ్ఞాన శాస్త్ర ప్రపంచాన్ని సున్నా ఎన్ని మలుపులు తిప్పిందో ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పక్కర్లేదు. అల్ జీబ్రా, అల్ గారథిమ్, ఆల్కెమీ, ఆల్క హాల్ లాంటి అల్ తో వచ్చేవన్నీ అరబిక్ నుంచి వచ్చినవే. వెయ్యేళ్ల క్రితం మో ట్జో రూపొందించిన కెమెరా అబ్ స్క్కూరా లాంటిదే అల్ హెజెన్ కూడా రూపొదించాడు. కాంతి స్టైట్ లైన్స్ లో బంధిస్తే అది ఏర్పరిచే స్కాటెర్డ్ ఇమేజెస్ ద్వారా పరిశోధనలు చేయొచ్చని అల్ హెజెన్ భావించాడు.

Telescope Origin : టెలిస్కోపుల తయారు చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది?

టెలిస్కోపుల్లో లెన్సులు

ఆ ప్రతిపాదనలే మొదటి టెలిస్కోపులకు కారణమయ్యాయి. సన్నగా పొడుగాటి గొట్టాల్లా ఉండే టెలిస్కోపులు పుట్టుకొచ్చిందో కాంతిని స్ట్రైట్ లైన్ గా కలెక్ట్ చేసుకుని ఎనలైజ్ చేయటానికే. టెలిస్కోపుల్లో లెన్సులను వాడటం దీన్ని మరో అడుగు ముందుకు తీసుకెళ్లింది. కాన్ వెక్స్ లైన్స్, కాన్ కేవ్ లెన్స్ ఇలా వీటిపై జరగని ప్రయోగాలు లేవు. ఎంత పెద్ద బకెట్ పెడితే అంత ఎక్కువగా వర్షం నీటిని మనం పట్టుకోవచ్చు. అలానే ఎంత పెద్ద టెలిస్కోపు పెడితే అంత ఎక్కువగా కాంతిని కలెక్ట్ చేసుకుని ఎన లైజ్ చేయొచ్చని అంశం అప్పటి శాస్త్రవేత్తలకు కొన్ని ధృఢమైన అభిప్రాయాలు ఏర్పరుచుకునేలా చేసింది.

స్పై గ్లాస్

ఇప్పుడున్న మోడ్రన్ టెలిస్కోపులు కలెక్టింగ్ ఏరియా చాలా పెద్దది. హైలీ సెన్సిటివ్ డిటెక్టర్స్ తో ...ఒకే ఆబ్జెక్ట్ గంటలపాటు టార్గెట్ చేసి చూడగల టెక్నాలజీ ఇప్పుడు అందుబాటులో ఉంది. మన హబుల్, ఇప్పుడు నాసా జేమ్స్ వెబ్ ఇవన్నీ కొన్ని మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలోని లైట్ ను కూడా ఎన లైజ్ చేయగల సామర్థ్యం ఉన్నవి. గెలిలీయో ముందు వరకూ టెలిస్కోపులను స్పై గ్లాస్ లనే పిలిచేవారు. 1608 లో నెదర్లాండ్స్ లో హాన్స్ లిప్పర్ షే అనే ఐ గ్లాస్ మేకర్ కు టెలిస్కోపు ను తయారు చేశారన్న ప్రాచుర్యం ఉంది.  కానీ టెలిస్కోపులను  ఖగోళ శాస్త్ర పరిశోధనల కోసం వాడాలన్న ఆలోచన వచ్చింది మాత్రమె గెలిలీయోకే. అంతకు ముందు కాన్ వెక్స్ లెన్స్ వాడటం ద్వారా లెన్స్ నుంచి వచ్చిన ఇమేజ్ ఐ పీస్ కు వచ్చేప్పటికి ఇమేజ్ కలర్స్ గా విడిపోయేది. దాని వల్ల ఏం ఉందో ఇమేజ్ తెలిసేది కానీ చాలా బ్లర్రీగా ఉండేవి ఇమేజెస్. దాన్నే క్రొమాటిక్ అబ్బరేషన్ అనేవాళ్లు. గెలీలియో తర్వాత ప్రయోగాలు చేసిన జొహన్నస్ కెప్లర్, క్రిస్ట్రియన్ హైగన్స్ టెలిస్కోపులతో ఖగోళశాస్త్రపరిశోధనలను మరింత ముందుకు తీసుకెళ్లారు. కానీ ఐజక్ న్యూటన్ రాకతో టెలిస్కోపుల స్వరూపం మారిపోయింది.  టెలిస్కోపుల్లో న్యూటన్ పలు మార్పులు సూచించాడు. 

Telescope Origin : టెలిస్కోపుల తయారు చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది?

రిఫ్లెక్టింగ్ టెలిస్కోప్స్

నేరుగా లెన్స్ లో కి లైట్ తీసుకోకుండా లోపల మిర్రర్ ను ఏర్పాటు చేసి దాని మీద కాంతి పడేలా చేసి మిర్రర్ నుంచి రిఫ్లైక్ట్ అయిన కాంతిని లెన్స్ లోకి తీసుకుని ఐ పీస్ నుంచి ఇమేజ్ చూసేలా టెలిస్కోపులో మార్పులు చేశాడు ఐజక్ న్యూటన్. ఇప్పటికీ టెలిస్కోపుల్లో నడుస్తున్న ట్రైండ్ న్యూటన్ సజెస్ట్ చేసిందే. రిఫ్లెక్టింగ్ టెలిస్కోప్స్.  కానీ భూమిపై నుంచి టెలిస్కోపులు పెట్టి పనిచేయించటానికి చిన్న ప్రాబ్లమ్ ఉంది. ఎర్త్ అట్మాస్పియర్ లో ఉండే టర్బ్యులెన్స్ అందుకు కారణం. మనం బాగా ఎండగా ఉన్నప్పుడు రోడ్ మీద దూరంగా చూస్తే ఏదో వాటర్ ఉన్నట్లు కనిపిస్తుంది కదా. కానీ  నిజంగా అక్కడ వాటర్ ఉండదు. అదొక మిరాజ్ లాంటి ది.  ఆప్టికల్ ఇల్యూషన్. ఫలితంగా మనకు టెలిస్కోప్ కు వచ్చే లైట్ కూడా బెండ్ అవుతూ వచ్చేది. ఫలితంగా ఇమేజింగ్ బ్లర్ ఉండేది. అందుకే న్యూటన్ ప్రతిపాదించిన మరో అంశం ఏంటంటే భూమి వాతావరణం దాటి భవిష్యత్తులో టెలిస్కోపులను ప్రవేశపెట్టగలిగే రోజంటూ వస్తే ఆ రోజు ఈ అనంతమైన విశ్వాన్ని మరింత లోతుగా పరిశోధించవచ్చని. వినటానికి మీకు ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఈ ఆలోచన సర్ ఐజక్ న్యూటన్ దే. సో ఇది మొత్తంగా టెలిస్కోపులతో మనిషి అంతరిక్షంలోకి చూడటానికి కారణమైన కొన్ని సంఘటనలు. ఇవన్నీ కలగలిసి ఈరోజు జేమ్స్ వెబ్ లాంటి అతిపెద్ద మానవనిర్మిత టెలిస్కోపు ఏర్పాటు చేసి పరిశోధనలు సాగించేవరకూ మనిషి ప్రయాణం సాగింది. సాగుతూనే ఉంటుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Embed widget