Viral News: ముగ్గురు పిల్లల తల్లి - మతం మార్చుకుని మరీ ఇంటర్ స్టూడెంట్‌ను పెళ్లాడింది - ప్రేమంటే ఇదేనా?
UP News: ఉత్తరప్రదేశ్ లో ఓ మహిళ ముగ్గురు పిల్లల తల్లి. కానీ అందర్నీ వదిలేసి వెళ్లి మైనర్ అయిన టీనేజీ యువకుడ్ని పెళ్లాడింది. అక్కడే అసలు ట్విస్ట్ ఉంది.

Third marriage: యువతీయువకులు ప్రేమించుకుని పెళ్లి కోసం సాహసాలు చేస్తే.. త్యాగాలు చేస్తే ప్రేమంటే ఇదేరా అని చెప్పుకుంటాం. కానీ కొన్ని కొన్ని ప్రేమలు, పెళ్లిళ్ల విషయంలో మాత్రం ఇలా చెప్పుకోవాలంటే.. కాస్త కామెడీగా ఉంటుంది. అలాంటి లవ్ స్టోరీనే ఇది.
యూపీలో శివాని అనే యువతి పన్నెండో తరగతి చదువుతున్న ఓ యువకుడ్ని పెళ్లి చేసుకుంది. ఆమె వయసు ఇరవై ఆరు, అ కుర్రాడి వయసు.. ఇంకా పద్దెనిమిది నిండలేదు. వయసుదేముంది.. ప్రేమ ఉండాలి కానీ అని ఈ పెళ్లి గురించి చాలా కబుర్లు చెప్పవచ్చు. కానీ అసలు విషయం మాత్రం తెలుసుకోవాల్సి ఉంటుంది.
ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లా శివానిది. అదే ఊళ్లో నివసిస్తూంటాడు కుర్రాడు. ఇద్దరూ ఇష్టపడ్డారు. కానీ ఓ సమస్య వారిని వెంటాడింది.. అది శివాని వయసు సమస్య కాదు. ఆమె పిల్లల సమస్య. అప్పటికే ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. రెండు పెళ్లిళ్లు కూడా అయ్యాయి. మొదటి భర్తకు విడాకులు ఇచ్చి రెండో పెళ్లి చేసుకుంది. ఇప్పుడు రెండో భర్తకు కూడా విడాకులు ఇచ్చి కొత్త లవర్ ను చేసుకుంది.
शादी शुदा महिलायो को आख़िर हो क्या गया है ,सीमा हैदर के बाद अमरोहा की शबनम उर्फ़ शिवानी जो की 3 बच्चों की माँ ने 12वी के छात्र शिव से शादी कर ली,
— Mahender Mahi (@MahendrMahii) April 9, 2025
शबनम ने अपना धर्म भी बदल लिया है अब वो शिवानी के नाम से जानी जाएगी,
सीमा हैदर अपने 4 बच्चों के साथ साथ आई थी,शबनम 3 के साथ #amroha pic.twitter.com/KxSX6nQNes
ఇంకో ట్విస్ట్ ఏమిటంటే.. శివాని అసలు పేరు శివానీ కాదు..షబ్నం. ముస్లిం వర్గానికి చెందిన ఆమె .. తన ప్రేమికుడు హిందువు అని.. హిందూ మతంలోకి మారిపోయింది. శివాని అని పేరు మార్చుకుంది. తనకు భర్త, పిల్లలు ఎవరూ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తానని వెళ్లిపోయింది.
దీనిపై పెద్దలు పంచాయతీ కూడా పెట్టారు. రెండు కుటుంబాల పెద్దలు ఈ పంచాయతీకి హాజరయ్యారు. షబ్నం అలియాస్ శివానికి ఆమె కోరుకున్న చోట నివసించడానికి స్వేచ్ఛగా ఉందని నిర్ణయించారు. శివాని తన ఇష్టానుసారంగా వివాహం చేసుకున్నానని , తన నిర్ణయంలో మార్పు ఉండదని ఆమె పంచాయతీలో చెప్పింది. టీనేజర్ కూడా అదే విధంగా చెప్పారు. వారు సంతోషంగా ఉన్నారని, జోక్యం కోరుకోవడం లేదని పంచాయతీ తీర్పు చెప్పింది.
షబ్నం అలీఘర్‌లో మొదటి వివాహం చేసుకుంది, కానీ ఆ జంట తరువాత విడాకులు తీసుకున్నారు. ఆమె రెండవ వివాహం దాదాపు ఎనిమిది సంవత్సరాల క్రితం జరిగింది. ఒక సంవత్సరం క్రితం, ఆమె భర్త రోడ్డు ప్రమాదంలో గాయపడి వికలాంగుడయ్యాడు, ఆ తర్వాత ఆమె ఆ టీనేజర్ ను ప్రేమించడం ప్రారంభించింది. తన కొడుకు నిర్ణయానికి మద్దతు ఇస్తున్నట్లు టీనేజర్ తండ్రి తెలిపారు. "ఇద్దరూ కలిసి హాయిగా జీవించాలని మాత్రమే మేము ఆశిస్తున్నాము" అని ఆయన లోకల్ మీడియాకు చెప్పారు. దీంతో ప్రేమంటే ఇదే అని అనుకోవాలని అందరూ ఆ జంటను ఆశీర్వదించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

