Monalisa News: మోనాలిసాకు చాన్స్ ఇచ్చిన దర్శకుడిపై రేప్ కేసులో ట్విస్ట్ - ప్లేట్ తిప్పేసిన బాధితురాలు
Monalisa Director: మహాకుంభ్ వైరల్ గర్ల్‌కు చాన్స్ ఇచ్చిన దర్శకుడి కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. తప్పుడు కేసు పెట్టానని బాధితురాలు రివర్స్ అయింది.

Maha Kumbh Girl Monalisa Director : అత్యాచారం ఆరోపణలపై సినీ దర్శకుడు సనోజ్ మిశ్రా అరెస్టు అయ్యారు. ఆయన మహా కుంభ్ వైరల్ గర్ల్ మోనాలిసాకు సినిమా చాన్స్ ఇచ్చారు. దీంతో ఆయన అరెస్టు కలకలం రేపింది. ఇప్పుడు సినిమా చాన్సులు ఆశ చూపి తనపై అత్యాచారం చేశారని కేసు పెట్టిన మహిళ తాను "కుట్ర"లో భాగమయ్యానని ... తనకు రేప్ చేయలేదని తాజాగా ప్రకటించారు. సనోజ్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ నుండి పోస్ట్ చేసిన ఒక వీడియోలో ఆ మహిళ వివరణ ఇచ్చారు. అంతే కాదు ఫిర్యాదును ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. సనోజ్ మిశ్రాపై తప్పుడు కేసు నమోదు చేయడానికి కొంత మంది తనను మోసం చేశారని ఆమె వీడియోలో చెప్పారు. చిత్ర నిర్మాత వసీం రిజ్వి , మరో నలుగురు తన ప్రాణానికి మరియు ప్రతిష్టకు హాని కలిగించారని ఆరోపించింది.
సనోజ్ మిశ్రా అరెస్ట్.. ఎందుకంటే?
సనోజ్ మిశ్రాను ఢిల్లీ పోలీసులు సోమవారం అరెస్అటు చేశారు. సినిమాలో తనకు అవకాశం ఇస్తానని చెప్పి ఆయన తనను మోసం చేశారంటూ ఝూన్సీకి చెందిన ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. టిక్ టాక్, ఇన్‌స్టా వేదికగా 2020లో సనోజ్‌తో తనకు పరిచయం ఏర్పడిందని.. సినిమాల్లో ఛాన్స్ ఇస్తానంటూ ఆయన తరచూ ఫోన్ కాల్స్ చేస్తుండేవాడని యువతి ఫిర్యాదులో పేర్కొన్నారు. సనోజ్ ఓసారి ఝాన్సీకి వచ్చి తనకు ఫోన్ చేశాడని.. చెప్పిన చోటుకు రాకపోతే చనిపోతానని బెదిరించాడని.. చేసేది లేక వెళ్లి కలిశానని యువతి ఫిర్యాదులో చెప్పింది. తనను రిసార్ట్‌కు తీసుకెళ్లి మత్తు మందు ఇచ్చి తనను వేధించాడని.. అసభ్య వీడియోలు చిత్రీకరించి బెదిరించాడని తీవ్ర ఆరోపణలు చేసింది. ఆ వీడియోలు బయటపెడతానని బెదిరిస్తూ పలుమార్లు తనపై అత్యాచారం చేశాడని తెలిపింది. సినిమాల్లో ఛాన్స్ ఇస్తానని చెప్పి తనను మోసం చేశాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
Now this is getting really crazy. The woman is saying again and again that she not got raped but Media and Police are still hell bent to declare Sanoj Mishra a Rapist.
— NCMIndia Council For Men Affairs (@NCMIndiaa) April 4, 2025
PS: Second Marriage without divorcing first wife is a punishable offense as per Indian Laws but only when one… pic.twitter.com/lM5krFvSBZ
మోనాలిసాకు చాన్స్ ఇచ్చి మీడియాలో హైలెట్ అయిన దర్శకుడు
ఓవర్ నైట్‌లోనే స్టార్‌గా మారిన మోనాలిసాకు సనోజ్ మిశ్రా 'ది డైరీ ఆఫ్ మణిపూర్' మూవీలో ఓ పాత్రకు ఆమెను ఎంపిక చేశారు. దాంతో ఆయన హైలెట్ అయ్యారు. ఈ మూవీకి మోనాలిసాకు రూ.21 లక్షల రెమ్యునరేషన్ అందించారు. మధ్యప్రదేశ్‌కు వెళ్లి ఆయన మోనాలిసా కుటుంబ సభ్యుల అంగీకారం కూడా తీసుకున్నారు. ఇప్పుడు రేప్ ఆరోపణలు రావడంతో ఆయన అరెస్టు అయ్యారు. మళ్లీ బాధితురాలు రివర్స్ కావడంతో రిలీజయ్యే అవకాశం ఉంది.





















