Delhi Police arrests IT professional: పరిచయొస్తుడే ఫ్రాడ్, ఇలాంటి పరిస్థితి మీకూ రావచ్చు, ఢిల్లీలో అరెస్టైన హైదరాబాద్ ఐటీ ఉద్యోగి
Delhi Police arrests IT professional: హైదరాబాద్‌కు చెందిన ఓ ఐటీ ఇంజినీర్ మార్ఫింగ్ ఫొటోలతో విద్యార్థిని బెదిరిస్తున్నాడు. ఫేక్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌తో అశ్లీల ఫొటోలు, వీడియోలు పోస్టు చేశాడు.

Delhi Police Arrests Hyderabad IT Professional: హైదరాబాద్‌కు చెందిన ఒక ఐటీ ఇంజినీర్‌ను ఢిల్లీ సైబర్ క్రైమ్ సెల్ అరెస్ట్ చేసింది. ఒక విద్యార్థిని ప్రైవేట్ ఫోటోలను ఫేక్ అకౌంట్ల ద్వారా ఇన్‌స్టాగ్రామ్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మార్ఫ్ చేసిన ఫోటోలు, అశ్లీల వీడియోలను క్రియేట్ చేసి షేర్ చేసేవాడు. ఆమెను కించపరిచి ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించాడు. దీని వల్ల బాధితురాలి తీవ్ర ఒత్తిడి గురై ఆత్మహత్య చేసుకునే దశకు చేరుకుంది.
పోలీసుల కథనం ప్రకారం... బాధితురాలు గత ఆరు నెలలుగా మార్ఫింగ్ చేసిన తన ఫొటోలను, అశ్లీల వీడియోలను ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లలో పెట్టారని చెప్పింది. ఆమె మొబైల్ నంబర్, అడ్రెస్‌ను కూడా నిందితుడు సోషల్ మీడియా ద్వారా లీక్ చేశాడు. దీని వల్ల ఆమెకు విపరీతంగా కాల్స్ వచ్చేవి. వికృతంగా మాట్లాడేవాళ్లు. అశ్లీలంగా మాట్లాడటమే కాకుండా అలాంటి వీడియోలు, ఫొటోలు పంపించే వాళ్లు. కొందరు బెదిరిస్తూ సందేశాలు రావడం మొదలయ్యాయి.
బాధితురాలిపై మానసిక వేధింపులు
ఇలా వరుసగా కాల్స్ రావడంతో బాధితురాలు మొహం చూపించలేకపోయింది. ఇంటి నుంచి బయటకు రావడమే మానేసింది. తనను తాను నాలుగు గోడల మధ్య బంధించుకుంది. కళాశాలకు వెళ్లడం మానేసింది. ఈ ఫొటోలు, వీడియోల వల్ల ఇమేజ్ దెబ్బతింది. వరసుగా జరిగిన ఘటనలతో మానసికంగా కుంగిపోయింది.
ఐపీ అడ్రస్ ద్వారా నిందితుడి గుర్తింపు
వేధింపులు ఎక్కువ కావడంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు అందుకున్న ఢిల్లీ పోలీసుల సైబర్ విభాగం వెంటనే రియాక్ట్ అయింది. నేషనల్ సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ (NCFL)తో కలిసి డిజిటల్ ఫుట్‌ప్రింట్‌లను ట్రాక్ చేసింది. నిందితుడు VPN, డార్క్ వెబ్‌ను ఉపయోగించాడని గ్రహించారు. దీని ద్వారా ట్రాక్ చేయడం పోలీసులకు కష్టమైంది.
నిందితుడు బాధితురాలితో ప్రైవేటుగా వాట్సాప్‌లో చాట్ చేశాడు. ఇది పోలీసులకు కేసులో ముందుకెళ్లేలా చేసింది. బాధితురాలితో వాట్సాప్ చాట్ చేసి ప్రైవేట్ వాట్సాప్ చాట్‌లను హ్యాక్ చేసిన పోలీసులు అసలు నిందితుడిని పట్టుకున్నారు. నిజమైన ఐపీ అడ్రస్ తెలుసుకొని ఢిల్లీ హరినగర్‌కు చెందిన దివాన్షు నిందితుడిగా గుర్తించారు.
బాధితురాలి పొరుగు వ్యక్తే నిందితుడు
పొరుగున ఉండే వ్యక్తే ఇదంతా చేసినట్టు తెలిసి అంతా షాక్ అయ్యారు. మొదటి నుంచి ఆమెతో క్లోజ్‌గా ఉండే వాడు. అయితే ఆమె దూరం అవుతుందని గ్రహించిన తర్వాత ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశ్యంతో ఇలా చేశానని ఒప్పుకున్నాడు. అతని ల్యాప్‌టాప్‌లో 700 కంటే ఎక్కువ మార్ఫ్ చేసిన ఫోటోలు, 12 వీడియోలు లభించాయి, వాటిని అతను డార్క్ వెబ్‌లో అమ్మాలని ప్లాన్ చేశాడు.
నిందితుడిపై కేసు నమోదు
నిందితుడిపై ఐటీ చట్టం సెక్షన్ 66E (గోప్యతా ఉల్లంఘన), 67 (అశ్లీల కంటెంట్ ప్రసారం), IPC సెక్షన్ 306 (ఆత్మహత్యకు ప్రేరేపించడం) కింద కేసు నమోదు చేశారు. పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ"ఇది సైబర్ స్టాకింగ్, టెక్నాలజీ దుర్వినియోగానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్‌గా. బాధితులకు న్యాయం చేకూర్చడానికి మేము AI-ఆధారిత టూల్స్ కూడా ఉపయోగిస్తున్నాము" అని అన్నారు.





















