అన్వేషించండి

Iran And Israel FriendShip: 30 ఏళ్ల స్నేహం, కానీ 30 ఏళ్లుగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం- ఇరాన్, ఇజ్రాయెల్‌ ఫ్రెండ్ షిప్ మీకు తెలుసా?

Once Iran And Israel Friends:ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఒక దేశంపై రెండో దేశం బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటి బద్ధ శత్రువులు ఒకప్పుడు మధ్యప్రాశ్చ్యంలోనే గొప్ప మిత్రదేశాలు.

Iran and Israel: మధ్యప్రాశ్చ్యంలోనే ఒకరిపై ఒకరు నిప్పుల వర్షం కురిపించుకుంటున్న ఇరాన్‌- ఇజ్రాయెల్‌ ఒకనాడు గొప్ప మిత్రదేశాలంటే నమ్మగలమా.? కానీ అది నిజం. ఈ రెండు దేశాలు టర్కీతో కలిసి కూటమిగా ఇంటెలిజెన్స్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకొని పనిచేశాయి. 30 ఏళ్లపాటు ఈ బంధం కొనసాగింది. ఆ తర్వాత 30 ఏళ్లుగా శత్రుత్వం కొనసాగుతోంది. ఇరు దేశాల మధ్య స్నేహం చిగురించడానికి, శత్రుత్వం రాజుకోవడానికి కారణాలను ఈ కథనంలో చూద్దాం.

ఇరాక్‌ను సంయుక్తంగా 30ఏళ్ల పాటు ఎదుర్కొన్న ఇరాన్, ఇజ్రాయెల్‌

ఇరాన్‌ మంగళవారం నాడు ఇజ్రాయెల్‌పై 200కి పైగా మిజైల్స్‌తో విరుచుకు పడింది. ఇజ్రాయెల్‌ కూడా దెబ్బకుదెబ్బ తీస్తామని ప్రతినబూనింది. ఇంతగా ఇరు దేశాలు ఒకరిపై ఒకరు భీకరదాడులకు దిగుతున్నారు. ఇలాంటి ఈ రెండు దేశాలు ఒకప్పుడు మిత్రదేశాలు అంటే నమ్మగలమా. కానీ నిజం. వారిని కలిపిన సిద్ధాంతం శత్రువుకు శత్రువు మిత్రుడు. ఈ సిద్ధాంతమే ఇరాన్ ఇజ్రాయెల్‌ను 30 ఏళ్లు కలిపి జట్టుగా నడిపింది. 1950ల చివర్లో ఇరాన్‌, ఇజ్రాయెల్ కామన శత్రువు ఇరాక్‌. ఆ సమయంలో సరిహద్దు అరబ్ దేశాలతో ఇజ్రాయెల్‌కు వివాదాలు నడుస్తున్నాయి. అదే సమయంలో ఇరాన్‌లోని షా సర్కార్‌కు ఇరాక్ పెద్ద తననొప్పిగా ఉంది. ఈ సమస్యలకు సమాధానంగా ఇజ్రాయెల్‌ గూఢచార సంస్థ మొస్సాద్‌, ఇరాన్ గూఢచార సంస్థ సవాక్‌ కలిసి పనిచేయడం మొదలు పెట్టాయి. ఇరాక్ ప్రభుత్వానికి తలనొప్పిగా ఉన్న ఖుర్దిష్‌లకు ఈ రెండు దేశాలు వెన్నుదన్నుగా నిలిచాయి. ఈ క్రమంలో నాన్ అరబ్‌ దేశాలైన ఇరాన్- ఇజ్రాయెల్‌- టర్కీ దేశాలు కలిసి 1958లో ట్రైడెంట్ పేరుతో క్రిటికల్ ఇన్ఫర్‌మేషన్‌ను షేర్‌ చేసుకుంటూ వచ్చాయి. ఈ బంధం మరింతగా బలపడి ఇరాన్‌- ఇజ్రాయెల్ సంయుక్తంగా సైనిక ఆపరేషన్లు కూడా చేపట్టాయి.

అప్పటి ఇరాన్ పాలకుడు అయిన మొహమ్మద్ రెజా పహ్లావికి ఇజ్రాయెల్‌తో స్నేహం వెనుక జియొపొలిటికల్ ఇంట్రెస్ట్‌తో పాటు వాషింగ్టన్‌తో ఇజ్రాయెల్ ద్వారా స్నేహం పెంచుకోవచ్చన్న ఆలోచన ఉండేది. ఈ క్రమంలో పశ్చిమదేశాలతో స్నేహమే లక్ష్యంగా నాటి రెజా రెజీమ్‌, 1960ల్లో టెహ్రాన్‌లో ఇజ్రాయెల్‌కు పర్మెనెంట్ డెలిగేషన్ కార్యాలయాన్ని కూడా ఏర్పాటైంది. అయితే ఇదే సమయంలో దేశంలో ఇజ్రాయెల్ పట్ల ముఖ్యంగా 1967 నాటి ఆరు రోజుల యుద్దం పట్ల దేశంలో నెలకొన్న వ్యతిరేకత కూడా రెజా అంచనా వేస్తూనే వచ్చారు. 1979లో ఇరాన్‌లో ఇస్లామిక్ రెవెల్యూషన్ స్టార్ట్ అయింది. అది క్రమంగా ఇరాన్‌ను యాంటీ ఇజ్రాయెల్‌గా మార్చింది. ప్రస్తుత ఇరాన్ సుప్రీం లీడర్ అయొతుల్లా అలీ ఖమేనీ శకం మొదలయ్యాక కూడా ఇరాక్‌ను ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్‌తో ఇరాన్ స్నేహం సాగింది. 1980- 88 మధ్య కాలంలో ఇరాన్‌ ఇరాక్ యుద్ధ సమయంలో రెండు దేశాలు కూడా సద్దా హుస్సేన్‌పై పోరాడేందుకు కలిసే ఉన్నాయి. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య చిన్నపాటి పొరపొచ్చాలు ఉన్నప్పటికీ ఇజ్రాయెల్‌ మాత్రం సాయం అందిస్తూనే ఉంది. ఇరాక్‌కు అమెరికాతో పాటు సోవియట్ యూనియన్ నుంచి ఆయుధాలు వస్తున్న సమయంలో ఇజ్రాయెల్‌ ఆయుధ పరంగా ఇరాన్‌కు అండగా నిలిచింది. ఆ సమయంలోనే ఇరాన్‌లో ఉన్న వేలాది మంది ఇరానియన్ యూదులను ఇజ్రాయెల్ లేదా అమెరికాకు వలస వెళ్లేందుకు ఖమేనీ సర్కార్ సహకరించింది.

1980ల మధ్యలో ఇరాక్‌పై యుద్దంలో ఇజ్రాయెల్ ఎంతగానో ఇరాన్‌కు సహకరించింది. ఆర్మ్స్‌ డీల్‌ను అడ్డుపెట్టుకొని లెబనాన్లో ఇరాన్ మద్దతుతో పనిచేసే హెజ్బొల్లా ఉగ్రవాదుల చెరలో ఉన్న అమెరికా బందీలను విడిపించడానికి ఇజ్రాయెల్ ప్రయత్నించింది. ఆపరేషన్ ఫ్లవర్ పేరిట ఇరు దేశాల మధ్య 1977 నుంచి సీక్రెట్ మిసైల్ ప్రాజెక్ట్ కూడా నడిచింది. ఇరాన్ ఆయుధాల ఆధునికీకరణకు ఇజ్రాయెల్ సహకరించింది. అందుకు ప్రతిగా ఇరాన్ 1978లో 260 మిలియన్ డాలర్ల విలువైన చమురును ఇజ్రాయెల్‌కు సరఫరా చేసింది. 1979 తర్వాత ఇరాన్‌లో ఖమేని సర్కారు ఏర్పాటైన తర్వాత క్రమంగా ఈ ప్రోగ్రామ్‌కు నిధుల విడుదల నిలిచిపోయింది. వీటన్నింటీతో పాటు ఇరాన్‌లో ఉన్న 60 వేల మంది యూదుల రక్షణ గురించి ఇజ్రాయెల్‌కు ఎక్కువ ఆందోళన ఉండేది. అది కూడా ఇరాన్‌కు ఇజ్రాయెల్‌ సహకారానికి ఒక కారణంగా ఉండేది.

1990ల నుంచి కత్తులు దూసుకుంటున్న ఇరాన్ ఇజ్రాయెల్‌:

1990ల ప్రారంభంలో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. మధ్యప్రాశ్చ్యంలో అరబ్ సోషలిజం, సోవియట్ యూనియన్ ఇన్ఫ్లూయెన్స్, ఇరాక్ ప్రమాదం క్రమంగా సమసిపోయాయి. ఈ క్రమంలో ఈ రెండు దేశాలు తమ స్నేహంలో లాభనష్టాల లెక్కలు వేసుకోవడం మొదలు పెట్టాయి. ఇరాన్‌లో ఏర్పడిన ఖమేనీ సర్కార్ యాంటీ ఇజ్రాయెల్‌ తత్త్వాన్ని పూర్తిగా తమతో పాటు ప్రజల్లోనూ ఏర్పడేలా చేసింది. హమాస్‌, హెజ్బొల్లాకు ఖమేనీ సర్కార్ అండగా నిలబడడం మొదలు పెట్టింది. 2000వ సంవత్సరం నాటికి ఇరాన్ వ్యాప్తంగా ఇజ్రాయెల్ వ్యతిరేకత అధికమైంది.  ఆ తర్వాత హెజ్బొల్లాతో 2006 యుద్ధం, 2008లో హమాస్‌తో ఇజ్రాయెల్ యుద్ధంలో ఇరాన్ ఆ రెండు ఉగ్ర గ్రూపుల పక్షాన నిలిచింది. ఇక అప్పటి నుంచి ఇజ్రాయెల్ రక్షణకు ఇరాన్ ఒక థ్రెట్‌లా మారింది. ఇక 2023 అక్టోబర్ 7 దాడుల తర్వాత గాజా స్ట్రిప్‌తో పాటు ఇటీవల లెబనాన్‌లోని హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ సేనలు భీకరదాడులు జరిపి వాటి అగ్రనాయకత్వాలను చంపేశాయి. ఈ క్రమంలో మండిపడ్డ ఇరాన్ ఇజ్రాయెల్‌పై భీకరదాడులు చేసింది. ఇజ్రాయెల్‌ కూడా 30 ఏళ్లుగా ఇజ్రాయెల్‌ను ఇబ్బందులకు గురి చేస్తున్న ఖమేనీని అంతం చేస్తామని ప్రతిజ్ఞ చేసింది.

Also Read: Israel-Iran Tension: మధ్యప్రాచ్యంలో యుద్ధం ఖాయమా? ఇరాన్ క్షిపణి దాడిపై ఇజ్రాయెల్‌ చేసిన ప్రకటన ఉద్దేశం ఏంటీ?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
OnePlus Ace 5 Mini: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థతఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబుమళ్లీ కెలుక్కున్న వేణుస్వామి, అల్లు అర్జున్ జాతకం కూడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
OnePlus Ace 5 Mini: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
Rishabh Pant: డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
Toyota Innova Hycross: ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
Telangana News: మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
Pawan Kalyan: 'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Embed widget